అమెజాన్‌ & వివో ఇ-షాపులలో Vivo U20 సేల్స్ ఆఫర్స్ బ్రహ్మాండం

|

వివో U 20 స్మార్ట్ ఫోన్ యొక్క సేల్స్ ఈ రోజు ఇండియాలో గొప్ప ఆఫర్లతో సిద్ధమైంది. ఈ సేల్స్ అమెజాన్ ఇండియా మరియు వివో ఇండియా ఇ-షాపులలో ఒకేసారి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభంకానున్నది. వివో U20 గత వారం ఇండియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ సైట్ల ద్వారా అమ్మకానికి అందుబాటులోకి తీసుకురావడం ఇది రెండోసారి.

ధరలు
 

ధరలు

వివో U20 రెండు వేరు వేరు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇండియాలో వీటి ధరల వివరాలు వరుసగా బేస్ మోడల్ 4 జిబి RAM + 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.10,990. మరియు 6 జిబి RAM + 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ.11,990. వివో యొక్క తాజా ఫోన్ రేసింగ్ బ్లాక్ మరియు బ్లేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఇంటెల్ అతి పెద్ద డిజైన్ సెంటర్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో

ఆఫర్స్ వివరాలు

ఆఫర్స్ వివరాలు

ఈ ఫోన్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఇండియాలో అమెజాన్.ఇన్ మరియు అధికారిక వివో ఇ-షాప్ ద్వారా లభిస్తుంది. అమ్మకపు ఆఫర్ల విషయానికొస్తే అమెజాన్ ఇండియాలో నో-కాస్ట్ EMI ఆప్షన్లను అందిస్తున్నది. 10 శాతం క్యాష్‌బ్యాక్ రూ.500ల వరకు తగ్గింపును హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డుల మీద, HSBC బ్యాంక్ కార్డుతో 5 శాతం వరకు తక్షణ తగ్గింపును క్యాష్‌బ్యాక్ రూపంలో పొందవచ్చు. మరోవైపు వివో ఇండియా ఇ-షాప్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్స్, రిలయన్స్ జియో చందాదారులకు 6,000 రూపాయల విలువైన ఆఫర్లను అందిస్తున్నది.

ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు కోసం మరో 15 రోజులు గడువు

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ స్లాట్ గల వివో U20 ఆండ్రాయిడ్ పై మరియు ఫన్‌టచ్ OS 9 కస్టమ్ స్కిన్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080 x 2340 పిక్సెల్స్) డిస్ప్లే 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ వైడ్విన్ L1 ధృవీకరణను పొందినట్లు వివో పేర్కొంది. అంటే వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ సేవలను అధిక రిజల్యూషన్ కంటెంట్‌తో ఆస్వాదించవచ్చు. వివో U20 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 SoCను కలిగి ఉండి 6GB వరకు గల RAM తో జతచేయబడి ఉంటుంది.

Mi TV 4X 55-inch 2020 ఎడిషన్‌ : ధర & ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

కెమెరా

ఫోన్ యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇది సోనీ IMX499 సెన్సార్ మరియు f / 1.8 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ గల మెయిన్ కెమెరా ద్వారా హైలైట్ చేయబడుతుంది. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ కెమెరా వైడ్-యాంగిల్ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చరు మరియు 120-డిగ్రీల వీక్షణ క్షేత్రంతో వస్తుంది. దీనితో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఎఫ్ / 2.4 ఎపర్చరుతో వస్తుంది. అలాగే ముందు భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

మెరుగైన సౌండ్ తో గూగుల్ నెస్ట్ మినీ స్పీకర్... ధర కాస్త ఎక్కువ

కనెక్టివిటీ

వివో U 20 స్మార్ట్ ఫోన్ 64 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీను 256 జిబి వరకు ద్వారా విస్తరించే సదుపాయం కూడా ఉంది. వివో U20 లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై, బ్లూటూత్ 5.0, GPS , BeiDou, GLONASS మరియు గెలీలియో ఉన్నాయి. ఫోన్ లోపల ప్యాక్ చేయబడిన సెన్సార్లు యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, మాగ్నెటోమీటర్, గైరోస్కోప్ మరియు యాక్సిస్ కోసం వెనుక-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇది యాజమాన్య 18W డ్యూయల్-ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇచ్చే 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vivo U20 Second Sale Starts Today at 12PM via Amazon, Vivo.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X