Home
Mobile

6500mAh బ్యాటరీ, 50MP + 50MP + 50MP కెమెరాలు, క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే ఫోన్‌పై రూ.3 వేల డిస్కౌంట్‌..!

వివో సంస్థ భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల వివో V70 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా వివో V70, V70 ఇలైట్‌ మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. త్వరలో V70 FE మోడల్‌ కూడా లాంచ్‌ కానుందని లీక్స్‌ వస్తున్నాయి. గ్లోబల్‌ మార్కెట్‌ లో ఈ మోడల్‌ ఇప్పటికే విడుదల అయింది. గ్లోబల్‌ వేరియంట్‌ తరహా ఫీచర్లు, స్పెసిఫికేషన్లనే కలిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివో నుంచి గత సంవత్సరం విడుదల అయిన V60 స్మార్ట్‌ఫోన్‌ ( Vivo V60 Smartphone Price cut ) కొన్ని స్టోరేజీ వేరియంట్స్‌ ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లే, టెలిఫోటో లెన్స్‌, 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతుంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

Vivo V60 smartphone pricecut

రూ.2 వేల డిస్కౌంట్‌ :
వివో V60 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.36999 ధరకు విడుదల అయింది. ప్రస్తుతం మిస్ట్‌ గ్రే కలర్‌ వేరియంట్‌ ను రూ.34999 ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.2000 డిస్కౌంట్‌ తో అందుబాటులో ఉంది.

Also Read

రూ.3 వేల డిస్కౌంట్‌ :
అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.38999 గా ఉండేది. మూన్‌లిట్‌ బ్లూ వేరియంట్‌ ప్రస్తుతం రూ.35799 ధరకు సొంతం చేసుకోవచ్చు. అంటే సుమారుగా రూ.3 వేల తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు తగ్గింపును పొందవచ్చు.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
వివో V60 స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మిస్ట్‌ గ్రే, మూన్‌లిట్‌ బ్లూ, ఆస్పీషియస్‌ గోల్డ్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Vivo V60 smartphone pricecut

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది. అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి.

Recommended For You

6500mAh బ్యాటరీ, మూడు 50MP కెమెరాలు :
ఈ ఫోన్‌ Zeiss భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX766 కెమెరా, 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలున్నాయి. 50MP సెల్ఫీ కెమెరా ఉంది. 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V60 smartphone with Snapdragon 7 gen 4 Chip gets rs3000 pricecut on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X