షియోమి ఎంఐ 4ఐ ఇప్పుడు 32జీబి వేరియంట్‌లో

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రికార్డ్ స్థాయి ఫోన్‌ల అమ్మకాలతో సంచలనాల సృష్టిస్తోన్న చైనా ఫోన్‌ల కంపెనీ షియోమి తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ఎంఐ 3 మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 32జీబి వేరియంట్ ‘ఎంఐ 4ఐ' స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.14,999. ఇదిలా ఉండగా...  షియోమి ఎంఐ4ఐ, 16జీబి వేరియంట్ ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోంది. ధర రూ.12,999.

 షియోమి ఎంఐ 4ఐ ఇప్పుడు 32జీబి వేరియంట్‌లో

Read More: ఈ విల్లాను మూడు గంటల్లో కట్టేసారు! 

ఫోన్ ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా - కోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ - కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన ఎమ్ఐయూఐ 6 ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్, డ్యుయల్ - టోన్ ఫ్లాష్), 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/1.8 అపెర్చుర్ 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), 3120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 షియోమి ఎంఐ 4ఐ ఇప్పుడు 32జీబి వేరియంట్‌లో

Read More: ఆండ్రాయిడ్ గురించి ఆసక్తికర నిజాలు

తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డార్క్ గ్రే వేరియంట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. జూలై 28 నుంచి Mi.com నిర్వహించే ఫ్లాష్ సేల్స్ లో భాగంగా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

English summary
Xiaomi Mi 4i 32GB Launched in India at Rs 14,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot