Home
Mobile

షియోమీ మళ్లీ ఫ్లాష్ సేల్ పెట్టింది

మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని, ఎలాంటి రిజిస్ట్రేషన్లూ అక్కర్లేదని, స్టాక్స్ అయిపోయేంత వరకూ విక్రయాలు సాగుతాయని పేర్కొంది

By Hazarath

సరిగ్గా వారం క్రితం ఈ నెల 23న తొలిసారిగా ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫ్లాష్‌సేల్‌కు వచ్చి నిమిషాల వ్యవధిలో లక్షల 'రెడ్ మీ నోట్ 4' స్మార్ట్ ఫోన్లను విక్రయించిన షియోమీ, నేడు మరో విడత ఫ్లాష్ సేల్‌ను ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని, ఎలాంటి రిజిస్ట్రేషన్లూ అక్కర్లేదని, స్టాక్స్ అయిపోయేంత వరకూ విక్రయాలు సాగుతాయని పేర్కొంది.

ఆధార్ పే వస్తోంది, కార్డులకు,మొబైల్స్‌కు ఇక చెల్లు

థర్డ్ ఫ్లాష్ సేల్ ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని పేర్కొంది. కాగా, ఈ స్మార్ట్ ఫోన్‌లో మెటల్ డిజైన్, 2.5డీ కర్వ్ డ్ గ్లాస్, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలు ఉన్న సంగతి తెలిసిందే. 2 జీబీ ర్యామ్ 32 జీబీ మెమొరీ ఉన్న ఫోన్ ధర రూ. 9,999 కాగా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ధర రూ. 10,999గా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ. 12,999గా షియోమీ పేర్కొంది.

6జిబి ర్యామ్‌తో షియోమి Mi 6, ధర తక్కువే

డిజైనింగ్ పరంగా చూస్తే

డిజైనింగ్ పరంగా చూస్తే

డిజైనింగ్ పరంగా చూస్తే రెడ్మీ నోట్ 3, రెడ్మీ నోట్ 4లు మొదటి చూపులో ఒకేలా అనిపిస్తాయి. నోట్ 3 తరహాలోనే నోట్ 4 కూడా 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా ఈ ఫోన్ డిస్‌ప్లే పై 2.5డి కర్వుడ్ గ్లాస్‌ను షియోమీ పొందుపరిచింది. రెడ్మీ నోట్ 3లో కర్వుడ్ గ్లాస్ ఉండదు. నోట్3 మాదిరిగానే నోట్ 4 కూడా సమానమైన స్ర్కీన్ రిసల్యూషన్ (1080*1920)ను కలిగి ఉంది. పీపీఐ (పిక్సల్స్ పర్ ఇంచ్) విషయానికి వచ్చేసరికి నోట్ 4 ఫోన్ 403 పీపీఐను కలిగి ఉంటుంది.

క్యాండీ బార్ డిజైన్‌

క్యాండీ బార్ డిజైన్‌

రెడ్మీ నోట్ 4 ఫోన్ క్యాండీ బార్ డిజైన్‌తో వస్తోంది. యునిమెటల్ బాడీ డిజైన్‌తో ఇటీవల మార్కెట్లోకి వస్తోన్న చాలా వరకు ఫోన్‌లలో ఈ తరహా డిజైన్‌ను మీరు చూడొచ్చు. రెడ్మీ నోట్ 4 ఫోన్ అంచులు మరింత గుండ్రంగా అనిపిస్తాయి. బరువు విషయానికి వచ్చేసరికి
రెడ్మీ నోట్ 4 ఫోన్ ను 174 గ్రాముల బరువుతో తీర్చిదిద్దారు.

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి వాల్యుమ్ రాకర్స్ అలానే పవర్ బటన్‌లను ఫోన్‌కు కుడి వైపు ఏర్పాటు చేసారు. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను ఫోన్‌కు ఎడమ వైపు ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ క్రింద భాగంలో రెండు స్పీకర్స్‌తో పాటు ఒక మైక్రోయూఎస్బీ పోర్టును అమర్చటం జరిగింది. టీవీ, ఏసీ వంటి డివైస్‌లకు ఈ ఫోన్‌ను రిమోట్ కంట్రోలర్‌లా ఉపయోగించుకునేందుకు వీలుగా పై భాగంలో IR blasterను ఏర్పాటు చేసారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఫోన్ పై భాగంలోనే ఉంటుంది. ఇదే సమయలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా మాడ్యుల్ క్రింద అమర్చారు.

హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానల్‌

హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానల్‌

ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానల్‌తో పాటు 2.5డి కర్వుడ్ గ్లాస్ రెడ్మీ నోట్ 4 ఫోన్‌కు ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుంది. రెడ్మీ నోట్ 4 ఆఫర్ చేసే 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, డీసెంట్ వ్యూవింగ్ యాంగిల్స్‌తో పాటు నేచురల్ కలర్స్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఎండ వాతవరణంలో ఫోన్‌లోని టెక్స్ట్‌ను చదవటం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తోంది. రిఫ్లెక్టివ్ ప్యానల్ కారణంగా ఇలా జరుగుతుండొచ్చు.

ర్యామ్ ఇంకా స్టోరేజ్

ర్యామ్ ఇంకా స్టోరేజ్

ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 మూడు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999.

Qualcomm Snapdragon 625 ఆక్టా కోర్ ప్రాసెసర్

Qualcomm Snapdragon 625 ఆక్టా కోర్ ప్రాసెసర్

Qualcomm Snapdragon 625 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. 14nm తయారీ ప్రాసెస్ ఆధారంగా ఈ చిప్‌సెట్‌ను అభివృద్ది చేసారు. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో పీ2 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే తరహా చిప్‌సెట్‌ను ఉపయోగించటం జరిగింది. Adreno 506 GPU ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

రెడ్మీ నోట్ 4, Android 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI 8 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఈ ప్లాట్‌ఫామ్ కలర్‌ఫుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. షియోమీ తన రెడ్మీ నోట్ 4 ఫోన్ కోసం సెకండ్ స్పేస్ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్‌లో రెండేసి చొప్పున వాట్సాప్, హైక్ వంటి యాప్స్‌ను రన్ చేసుకోవచ్చు.

కెమెరా

కెమెరా

రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 aperture, డ్యుయల్ టోన్ ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్లను ఈ కెమెరా కలిగి ఉంది.5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. మంచి లైటింగ్ కండీషన్‌లలో ఈ కెమెరా అద్బుతంగా పనిచేస్తోంది.

బ్యాటరీ కెపాసిటీ..

బ్యాటరీ కెపాసిటీ..

బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్, 4100mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. జాగ్రత్తగా వాడుకుంటే రెండు రోజుల పాటు ఈ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఫోన్ హెవీగా వాడటం మొదలు పెడితే ఒక్క రోజులోనే బ్యాటరీ మొత్తం
దిగిపోతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 4 flash sale on Flipkart from 12 noon today. Price, specification and all you need to know read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X