ఆధార్ పే వస్తోంది, కార్డులకు,మొబైల్స్‌కు ఇక చెల్లు

Written By:

మీరు షాపింగ్ కి వెళ్లినప్పుడు అక్కడ మీరు ఆధార్ కార్డుతోనే చెల్లింపులు జరపవచ్చు. మొబైల్ డెబిట్ కార్డులు అవసరమే ఉండదు. ఆధార్ ద్వారానే సులభంగా నగదు చెల్లింపులు చేసేయవచ్చు. అలాగే నగదును తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన సర్వీసు ఆధార్ పే ను అతి త్వరలోనే ప్రభుత్వం పట్టాలెక్కించనుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. మీరు చెల్లింపులు ఆధార్ ద్వారానే జరపాలని తెలిపారు.

6జిబి ర్యామ్‌తో షియోమి Mi 6, ధర తక్కువే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అతి త్వరలోనే ఈ సర్వీసు

ఆధార్‌ పే సర్వీస్‌ పరిధిలోకి ఇప్పటి వరకు 14 బ్యాంకులు వచ్చి చేరాయని, మిగిలిన బ్యాంకులతోనూ చర్చిస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అతి త్వరలోనే ఈ సర్వీసును ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

ఆధార్‌ పేకు సంబంధించి

కొన్ని బ్యాంకులు ఆధార్‌ పేకు సంబంధించి ఇప్పటికే సొంతంగా అప్లికేషన్‌ను అభివృద్ధి చేశాయని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వీటి పనితీరును పరీక్షిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

భీమ్‌ యాప్‌ని ఆధార్‌ చెల్లింపుల విధానంతో

యూపీఐ ప్లాట్‌ఫామ్‌ ఆధారితంగా పనిచేసే భీమ్‌ యాప్‌ను అన్ని చెల్లింపులకు వీలుగా ఇటీవల కేంద్ర సర్కారు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, భీమ్‌ యాప్‌ని ఆధార్‌ చెల్లింపుల విధానంతో అనుసంధానించనున్నట్టు మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

111 కోట్ల మందికిపైగా ఆధార్‌

111 కోట్ల మందికిపైగా ఆధార్‌ నంబర్‌ కలిగి ఉన్నారని పేర్కొన్నారు. సమాచార దుర్వియోగంపై ప్రజలు తరచుగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని, కానీ ఆధార్‌ చట్టం ప్రజల సమాచార గోప్యతను పూర్తిగా గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

49 కోట్ల బ్యాంకు ఖాతాలు

ఇప్పటి వరకు 49 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమై ఉన్నాయని, ప్రతి నెలా రెండు కోట్ల ఖాతాలు ఆధార్‌ నంబర్‌తో అనుసంధానిస్తున్నట్టు చెప్పారు. ఆధార్ నంబర్‌ ద్వారా చెల్లింపుల విధానం ఇప్పటికే అమల్లో ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో 33 కోట్ల లావాదేవీలు జరిగాయని మంత్రి వెల్లడించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Aadhaar Pay for Cashless Transactions to Be Launched Soon: Prasad read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot