6జిబి ర్యామ్‌తో షియోమి Mi 6, ధర తక్కువే

Written By:

షియోమి నుంచి వస్తున్న అప్ కమింగ్ ఫోన్ షియోమి Mi 6 ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో లాంచ్ చేస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో షియోమి షాకిచ్చింది. ఈ ఈవెంట్ లో షియోమి Mi 6ను లాంచ్ చేయడం లేదని తెలిపింది. ఎప్పుడు రిలీజ్ చేస్తుందనే దానిపై క్లారటీ లేదుగాని ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు, ధర అప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఎయిర్‌టెల్‌కు భారీ జరిమానా విధించండి: జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు వేరియంట్లలో

సిరామిక్ బాడీతో పాటు మూడు వేరియంట్లలో షియోమి Mi 6 వినియోగదారుల ముందుకు రానుంది.

4 జీబీ, 6జీబీ ర్యామ్

ఆన్‌లైన్‌లో చక్కర్దు కొడుతున్న నివేదికలు ప్రకారం 4 జీబీ, 6జీబీ ర్యామ్ తో ఫుల్ సిరామిక్ బాడీతో వస్తోంది. 218జీజీ, 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ లో వేరియంట్ రానుంది.

6జీబీ ర్యామ్ , డ్యూయల్ ఎడ్జ్ స్క్రీన్

మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం వెర్షన్ ను 6జీబీ ర్యామ్ , డ్యూయల్ ఎడ్జ్ స్క్రీన్ వేరియంట్ గా రూపొందించింది.

ప్రాసెసర్ వెర్షన్

రెండు స్నాప్ డ్రాగెన్ 835 చిప్సెట్ , ఒకటి మీడియా టెక్ ఎక్స్30 ప్రాసెసర్ వెర్షన్ తో రానున్నాయి.

మార్చిలో కాని ఏప్రిల్ కాని లాంచ్ చేసే అవకాశం

ఆండ్రాయిడ్ 7.0 నోగట్, ఎంఐయుఐ8, 12 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 3000ఎంఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ మార్చిలో కాని ఏప్రిల్ కాని లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ధర

మీడియా టెక్ ప్రాసెసర్ ఎంఐ 6 వేరియంట్ సుమారుగా రూ 19,800, స్నాప్ డ్రాగెన్ 835 చిప్ సెట్ సుమారుగా రూ. 24,800 కి, డ్యూయల్ ఎడ్జ్ స్క్రీన్ వేరియంట్ రూ 29,800 ధరకి అందుబాటులోకి రానుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi 6 Premium Variant Rumoured to Have Dual-Edge Curved Screen, Ceramic Body, 6GB RAM read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot