ఓపెన్ సేల్ పై రెడ్‌మి నోట్ 5 ప్రో
నిన్నమొన్నటి వరకు ఫ్లాష్ సేల్‌కు మాత్రమే పరిమితమైన రెడ్‌మి నోట్ 5 ప్రో ఇప్పుడు ఓపెన్ సేల్ పై లభ్యమవుతోంది.
నిన్నమొన్నటి వరకు ఫ్లాష్ సేల్‌కు మాత్రమే పరిమితమైన రెడ్‌మి నోట్ 5 ప్రో ఇప్పుడు ఓపెన్ సేల్ పై లభ్యమవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్లాష్‌సేల్ మోడ్ క్రిందే ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తూ వస్తోంది.ఇప్పటి వరకు నిర్వహించిన సేల్స్‌లో భాగంగా 50 లక్షల రెడ్‌మి నోట్ 5 ప్రో యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ డివైస్ ఇక పూర్తిస్థాయిలో ఓపెన్ సేల్ పై లభ్యమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ అలానే ఎంఐ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. దీంతో ఈ ఫోన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు.

ఓపెన్ సేల్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఫోన్ కొనుగోలు పై అనేక ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ సిద్ధంగా ఉంచింది. ఈ ఆఫర్‌లలో భాగంగా రెడ్‌మి నోట్ 5 ప్రోను తమ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలనుకునే వారికి ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.14,000 వరకు ఎక్స్‌ఛేంజ్ క్రింద లభించే అవకాశం ఉంది.
రైల్వే టికెట్ క్యాన్సిల్ ఛార్జీల వివరాలు, రైళ్ల రాకపోకల్లో మార్పులు
జియో డేటా కూడా ఉచితం..
యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ డివైస్‌ను కొనుగోలు చేసే యూజర్లకు 5శాతం తగ్గింపు లభిస్తుంది. ఇదే సమయంలో రూ.499 నెలవారీ ఈఎమ్ఐతో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు పై జియో యూజర్లు 4.5టీబీ అదనపు డేటాను ఉచితంగా పొందగలుగుతారు. ఇదే సమయంలో వారికి 3 నెలల హంగామా సబ్‌స్ర్కిప్షన్ కూడా లభిస్తుంది.
రెడ్‌మి నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్స్..
5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ (రిసల్యూషన్ 1080x2160 పిక్సల్స్) డిస్‌ప్లే విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా కోర్ 650 సాక్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, 3.5ఎమ్ఎమ్ హెడ్ ఫోన్ జాక్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
డెలివరీ ఎప్పుడో తెలియదు, జియోఫోన్ 2 బుకింగ్స్ రేపటి నుంచే,బుకింగ్ ఎలా?
ధరలు వివరాలు..
మార్కెట్లో రెడ్‌మి నోట్ 5 ప్రో రెండు వేరియంట్ లలో లభ్యమవుతోంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్‌తోనూ లభ్యమవుతున్నాయి. వీటిలో మొదటి వేరియంట్ ధర రూ.14,999గానే, రెండవ వేరియంట్ ధర రూ.16,999గాను ఉంది.


Click it and Unblock the Notifications








