‘Yu Yunique’ స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

|

మైక్రోమాక్స్ సబ్సిడరీ బ్రాండ్ యు టెలీవెంచర్స్, Yu Yunique పేరుతో తక్కువ ధర 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రెండు రోజుల క్రితం మార్కెట్లో విడుదల చేసింది. 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ వంటి ప్రత్యేకతలతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.4,999. ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ప్రీబుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. మొదటి ఫ్లాష్‌సేల్ సెప్టంబర్ 15న జరుగుతుంది.

Read More : 60 రోజుల్లో 5 లక్షల ఫోన్‌లు అమ్మేసారు

‘Yu Yunique' స్మార్ట్ ఫోన్ క్విక్ రివ్యూలోకి వెళ్లేముందు, ఫోన్ స్పెసిఫికేషన్‌లను ఓ సారి చూద్దాం...

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో కూడిన 4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (720 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్), ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 సీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే, ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ 4జీ ఎల్టీఈ, 3జీ, బ్లూటూత్ 4.0, జీపీఎస్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

Read More : పై నుంచి మృత్యువు ముంచుకొస్తోంది

Yu Yunique బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ క్విక్ రివ్యూకు స్వాగతం...

 ‘Yu Yunique’ స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

‘Yu Yunique’ స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ వంటి లేటెస్ట్ ఫీచర్లతో యు టెలీవెంచర్స్ రూ.4,999 ధర ట్యాగ్ తో అందిస్తోన్న Yu Yunique స్మార్ట్‌ఫోన్ తన పోటీ స్మార్ట్‌ఫోన్‌లకు టఫ్ ఫైట్‌ను ఇస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

 ‘Yu Yunique’ స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

‘Yu Yunique’ స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

గతంలో యు టెలీవెంచర్స్ నుంచి విడుదలైన యుఫోరియా స్మార్ట్‌ఫోన్‌కు Yunique స్మార్ట్‌ఫోన్ దగ్గరి పోలికలను కలిగి ఉంటుంది. ఫోన్ డిజైన్ ప్రొఫైల్, అలానే మెటాలిక్ స్లైడ్స్ ఇంచుమించుగా యుఫోరియా ఫోన్‌ను తలపిస్తాయి.

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ
 
‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

యునిక్యూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను ఫోన్ కడువైపు స్లైడ్‌లో ఏర్పాటు చేసిన వాల్యుమ్ బటన్ మధ్య ఏర్పాటు చేయటం యూజర్లకు అలవాటయ్యేంత వరకు గందరగోళంగా ఉంటుంది.

ఈ ఫోన్‌ను చేతిలో హోల్డ్ చేసినపుడు మన చేతి వేళ్లు రేర్ కెమెరా లెన్స్ పై ల్యాండ్ అయ్యే అవకాశముంది. ఫలితంగా లెన్స్ పై మరకలు ఏర్పాడే ప్రమాదం.

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

యూనిక్యూ స్మార్ట్‌ఫోన్ 2000 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. అంటే బ్యాటరీని రీప్లేస్ చేసే అవకాశముండదు. ఫోన్ వెనుక భాగంలో నాన్ రిమూవబుల్ బ్యాటరీతో పాటు రెండు సిమ్ కార్డ్ స్లాట్స్ అలానే మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్‌ను మనం చూడొచ్చు.

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

4.7 అంగుళాల డిస్‌ప్లే కారణంగా యూనిక్యూ స్మార్ట్‌ఫోన్ మరింత కాంపాక్ట్‌గా ఉంటుంది. ఫోన్ చుట్టుకొలత 134.50x67.50x8.30మిల్లీ మీటర్లు ఉంది. ఈ కారణంగా ఫోన్ చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. ఫోన్ హైడెఫినిషన్ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కవచంలా ఉంటుంది. ఆన్ - స్ర్కీన్ ఆండ్రాయిడ్ నావిగేషన్ బటన్‌లను ఈ డివైస్‌లో

చూడొచ్చు. రూ.4,999 ధర ట్యాగ్ లో 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఫోన్ ఇదే కావటం విశేషం.

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే యూనిక్యూ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం మీరు కావాలనుకుంటే డివైుసులోకి శ్యానోజెన్ ఓఎస్ 12.1 వర్షన్‌ను ఫ్లాష్ చేసుకోవచ్చు. దాదాపు జీరో బ్లోట్‌వేర్‌తో వస్తోన్న ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఏ విధమైన అడ్డంకులు లేకుండా రన్ అవుతాయి.

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 1జీబి ఎల్ పీడీడీఆర్ ర్యామ్ వంటి మిడ్ లెవల్ స్పెక్స్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో మల్టీ టాస్కింగ్ యూవరేజ్‌గా ఉంటుంది. నార్మల్ యూసేజ్‌కు ఈ ఫోన్ అద్భుతంగా స్పందిస్తుంది.

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

ఫోన్‌లో ఇన్‌బుల్ట్‌గా ఇచ్చిన 8జీబి స్టోరేజ్‌లో 4జీబి కన్నా ఎక్కువ స్టోరేజ్‌ను యూజర్ ఉపయోగించుకోగలరు. ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ సహాయంతో ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకోవచ్చు.

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

ఫోన్ వెనుక భాగంలో 8 మెగా పిక్సల్ సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ కెమెరాను ఏర్పాటు చేసారు. ఈ కెమెరా ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్‌గా, సలువుగా ఆపరేట్ చేసే విధంగా ఉంటుంది. డేలైట్ కండీషన్‌లలో ఈ కెమెరా పనితీరు బాగున్నప్పటికి లో-లైట్ కండీషన్‌లలో కాస్తంత నిరుత్సాహపరుస్తుంది. ఫ్లాష్ మోడ్, స్టోరేజ్ లోకేషన్, పిక్షర్ సైజ్, పిక్షర్ క్వాలిటీ, టైమర్, కంటిన్యూషన్ షాట్, ఫేస్‌ డిటెక్షన్ వంటి ఆప్షన్‌లను ఈ కెమెరాలో చూడొచ్చు.

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా సెల్ఫీలను షూట్ చేసుకోవచ్చు.

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

‘Yu Yunique’స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది

Most Read Articles
Best Mobiles in India

English summary
yu yunique Smart phone quick review. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X