జింక్ తక్కువ ధర డ్యూయల్ సిమ్ ఫోన్‌లు!

Posted By: Staff

జింక్ తక్కువ ధర డ్యూయల్ సిమ్ ఫోన్‌లు!

దేశీయ సంస్థ, జింక్ గ్లోబల్ ప్రైవేటు లిమిటెడ్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణుల్లో ఆరు సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్‌లను బుధవారం ఆవిష్కరించింది. జింక్ సీ18, జింక్ సీ21, జింక్ సీ22, జింక్ సీ24, జింక్ సీ27, జింక్ సీ30 మోడళ్లలో ఈ హ్యాండ్‌సెట్‌లు లభ్యం కానున్నాయి. వీటిలో  జింక్ సీ18 మోడల్ ధర రూ.1399. మరో మోడల్ జింక్ సీ30 ధర రూ.2,499. తక్కిన మోడళ్లు రూ.1990 ధరకు లభ్యమవుతాయి.

అంగారకుడి పై అద్భుతాలు!

ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్,

లౌడ్ స్పీకర్,

4జీబి మైక్రోఎస్డీ మెమెరీ కార్డ్,

యూఎస్బీ కనెక్టువిటీ,

బ్లూటూత్ సపోర్ట్,

డ్యూయల్ ఎల్ఈడి టార్చ్,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో రికార్డింగ్),

మ్యూజిక్ ప్లేయర్,

ఎఫ్ఎమ్ రేడియో.

అవసరమైన ఫీచర్లతో కూడిన ఆధునిక వర్షన్ ఎంట్రీస్థాయి ఫోన్‌లను సమంజసమైన ధరల్లో అందించే లక్ష్యంగా ఈ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టినట్లు జింక్ గ్లోబల్ సహా - వ్యవస్థాపకులు ఆమూల్ మిట్టల్ తెలిపారు. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లు దేశవ్యాప్తంగా 51 నగరాల్లో ఉన్న 500 డీలర్ పాయింట్ల వద్ద లభ్యమవుతాయి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు స్నాప్‌డీల్ డాట్ కామ్, నాప్‌టూల్ డాట్ కామ్, ఇండియా టైమ్స్, ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్,

హోమ్‌షాప్ 18 ఇంకా ఇన్ఫీబీమ్‌లు వద్ద ఈ డ్యూయల్ సిమ్ ఫోన్‌లు లభ్యమవుతాయి.

ఇంజనీరింగ్ కుర్రోడా.. మజాకా!

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot