సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ప్రారంభించిన ‘11ఏళ్ల బాలుడు’!

Posted By:

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ప్రారంభించిన ‘11ఏళ్ల బాలుడు’!
నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు వెబ్ చక్కటి వేదిక. అయితే చిన్నారులకు ఇంటర్నెట్ అంత శ్రేయస్కరం కాదు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సంబంధాల సైట్‌లు సైతం వయోపరిమితి విధించాయి. చిన్న వయసు కారణంగా సోషల్ నెట్‌వర్కింగ్ అనుభూతులను ఆస్వాదించలేకపోతున్న పిల్లల కోసం 11 సంవత్సరాల జాచ్.. ‘గ్రోమ్ సోషల్' పేరుతో చిన్నారుల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను ప్రారంభించాడు. చిన్నారులకు అవసరమైన గేమింగ్, హెల్త్, ఫిట్‌నెస్, స్సోర్ట్స్, స్కూల్ హెల్ప్ వంటి అంశాలను మాత్రమే ఈసైట్‌లో జాచ్ పొందుపరిచాడు. ఇవి చిన్నారుల విజ్ఞానాన్ని పెంపొదించటంలో ఎంతగానో తోడ్పడతాయి.

తండ్రి.. కూతురు; ఓ ఫేస్‌బుక్ కథ!

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

11 సంవత్సరాల జాచ్ ‘గ్రోమ్ సోషల్' రూపొందించటానికి పెద్ద స్టోరీనే ఉంది. ఆ కుటుంబంలో జాచ్ అందిరికన్నా చిన్నవాడు. ముందు నుంచి సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఇష్టపడేవాడు. అయితే అందుకు అతని వయసు అవరోధం కావటంతో తండ్రి నిరాకరించేవాడు. దింతో అసహనానికి గురైన జాచ్, తండ్రి అనుమతి లేకుండా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లలో అకౌంట్ ఓపెన్ చేసి కార్యాకలపాలు సాగించేవాడు. ఓ సందర్భంలో తండ్రికి దొరికిపోవటంతో మందలించి సదురు అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేశారు. దింతో చిన్నారులకు ప్రత్యేకించి కిడ్స్ సోషల్ నెట్‌వర్క్ ప్రారంభించాలన్న తపన జాచ్‌లో మొదలైంది. 2011 నవంబర్ నుంచి ‘గ్రోమ్ సోషల్' ఆవిష్కరణ దిశగా జాచ్ శ్రమించి అంతిమంగా అనుకున్నది సాధించాడు. జాచ్ రూపొందించిన ‘గ్రోమ్ సోషల్' లింక్ అడ్రస్:

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot