తండ్రి.. కూతురు; ఓ ఫేస్‌బుక్ కథ!

Posted By:

తండ్రి.. కూతురు; ఓ ఫేస్‌బుక్ కథ!
సామాజిక సంబంధాల సైట్ ఫేస్‌బుక్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ కుటంబంలో తండ్రి..కూతరు మధ్య చోటుచేసుకున్నఒప్పందం సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... గ్రూమ్ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీకి చెందిన పాల్ బెయర్ తన 16ఏళ్ల కూతరుతో ఓ ఒప్పందాన్ని కుదర్చుకున్నాడు. సదురు ఒప్పందానికి సంబంధించి ఓ డాక్యుమెంట్ కాపీతో కూడన ఫోటోను పాల్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేశాడు.

ఫోన్ కొంటే ఫోన్ ‘ఫ్రీ'

ఈ ఒడంబడికలో భాగంగా తన 16ఏళ్ల యుక్తవయసు కూతురు 2.4.2013 నుంచి 6.26.2013 అంటే 5 నెలల పాటు ఫేస్‌బుక్ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అంటే ఈ టీనేజ్ అమ్మాయి తన ఫేస్‌బుక్ అకౌంట్‌ను 6 నెలల పాటు పూర్తిగా డీయాక్టివేట్ చేసుకోవల్సి ఉంది. అగ్రిమెంట్‌లో పేర్కొన్న విధంగా తన కూతురు ఫేస్‌బుక్‌కు దూరంగా ఉన్నట్లయితే పాల్ $200 చెల్లిస్తాడు. ఈ చెల్లింపు రెండు విడతలుగా ఉంటుంది. ఈ ఆలోచనను తొలిగా తన కూతురే ప్రతిపాదించినట్లు పాల్ వెల్లడించాడు. ఈ తండ్రికూతుళ్ల మధ్య చోటుచేసుకున్న ఒప్పందం పై ప్రపంచవ్యాప్తంగా అనేక కామెంట్ లు వ్యక్తమవుతున్నాయి.

కొత్త రిలీజ్‌లు (స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot