ఇండియాలో 113 కోట్ల మంది సైబర్‌కు బలి

Written By:

భారత్‌లో ఆన్‌లైన్ క్రైమ్ పెరిగిపోతోంది. గతేడాది భారత్‌లో 11.3 కోట్ల మంది సైబర్ క్రైమ్ బారినపడగా, వారు సగటున రూ.16,558లను కోల్పోయారు. గ్లోబల్ యావరేజ్ రూ.23,878గా ఉంది. నోర్టాన్ బై సిమంటెక్ సైబర్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం.. 54 శాతం మంది భారతీయులు వారి వాలెట్ల ద్వారా కన్నా ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డుల సమాచారాన్ని దొంగలించడం ద్వారానే సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని భావిస్తున్నారు.

Read more: కోట్లకు కోట్లు హ్యాకర్లపాలు

ప్రతి ముగ్గురులో ఇద్దరు (66 శాతం మంది) వినియోగదారులు పబ్లిక్ రెస్ట్‌రూమ్‌ను ఉపయోగించడం కన్నా పబ్లిక్ వై-ఫైను ఉపయోగించడం ప్రమాదకరమని భావిస్తున్నారు. కారును ఒక రోజు ఇతరులకు ఇవ్వడం కన్నా స్నేహితులతో ఈ-మెయిల్ పాస్‌వర్డ్‌ను షేరు చేసుకోవడం చాలా ప్రమాదకరమని 80 శాతం మంది విశ్వసిస్తున్నారు.

Read more: ఆకాశం నుంచి టమోటాలు, పూలు..

క్రెడిట్ కార్డు, బ్యాంకింగ్ సమాచారాన్ని క్లౌడ్‌లో స్టోర్ చేసుకోవడం.. కారులో సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం కన్నా ప్రమాదమని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు. గతేడాది భారతీయ ఆన్‌లైన్ యూజర్లలో 48 శాతం మంది (11.3 కోట్ల మంది) సైబర్ క్రైమ్‌ను ఎదుర్కొన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే హ్యాకర్ల భారీన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే మీ వెబ్‌సైట్‌లోని సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ అందుకుఅనుగుణంగా సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఈ చర్యను క్రమంగా పాటించినట్లయితే హ్యాకర్లు విజృంభించే అవకాశం ఉండదు.

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించటం ద్వారా హ్యాకర్ల చొరబాటును నిరోధించవచ్చు.

గూగుల్స్ వెబ్ మాస్టర్ టూల్స్‌లో రిజిస్టర్ అయినట్లయితే

మీ వెబ్‌సైట్, గూగుల్స్ వెబ్ మాస్టర్ టూల్స్‌లో రిజిస్టర్ అయినట్లయితే మాల్వేర్ దాడులు జరిగిన సమయంలో తక్షన నోటిఫికేషన్ మీకు అందుతుంది. తద్వారా రక్షణాత్మక చర్యలకు పూనుకోవచ్చు.

హ్యాకర్ల భారి నుంచి రక్షణ పొందే కమ్రంలో

ప్రముఖ వెబ్ కంపెనీలు హ్యాకర్ల భారి నుంచి రక్షణ పొందే కమ్రంలో సెక్యూరిటీ సేవలనందించే సంస్థలను నియమించుకుంటున్నాయి.

హ్యాకింగ్ నిరోధానికి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలను

ఈ సంస్థలు హ్యాకింగ్ నిరోధానికి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలను కలిగి సదరు కంపెనీ వెబ్‌సైట్‌కు సంబంధించి నిరంతర పర్యవేక్షణను నిర్వహిస్తాయి.

స్టాప్‌ ద హ్యాకర్, సైట్ లాక్, సుకురీ,

స్టాప్‌ ద హ్యాకర్, సైట్ లాక్, సుకురీ, క్వాలిస్ వంటి సంస్థలు ఈ తరహా సెక్యూరిటీ సేవలనందిస్తున్నాయి.

సంవత్సారినికి కొంత మొత్తం చెల్లించాల్సి

ఈ సెక్యూరిటీ సంస్థలను నియమించుకున్నట్లయితే సంవత్సారినికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write 113 million Indians lost an average of Rs16000 to cyber crime: Norton
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot