బీకేర్ పుల్..ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

Written By:

ఇప్పుడు ల్యాప్‌టాప్ లు కూడా షాక్ కొడుతున్నాయి. అవును ఇప్పటి దాకా స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఛార్జింగ్ పెట్టినప్పుడు షాక్ కొట్టేవి. కాని ఇప్పుడు ఏకంగా ల్యాప్ టాప్ లు షాక్ కొట్టి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ల్యాప్‌టాప్‌పై పనిచేస్తూ కరెంట్ షాక్‌కు గురై యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. దక్షిణ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతానికి చెందిన బ్రిజేశ్ సింగ్ (23) తన ల్యాప్ టాప్ కు చార్జింగ్ పెట్టి ఈ-మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా కరెంట్ షాకు తగలడంతో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.

Read more: ఫోన్ కంటే తక్కువ ధరకే లెనోవో ల్యాప్‌టాప్

బీకేర్ పుల్..ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రిజేశ్ మరణానికి కారణాలను తెలుసుకునేందుకు ల్యాప్ టాప్ ను సీజ్ చేసి ఫోరెన్సిక్ నిపుణులను పోలీసులు సంప్రదించారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సివుంది. కాగా మూడు నెలల క్రితమే బ్రిజేష్ కు పెళ్లైంది. సెలవు రోజున బయటికెళ్లాలనుకున్న సమయంలో ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మీకు ఇలాంటి ప్రమాదం జరగవచ్చు..సో ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.

Read more: 10 'లైట్ వెయిట్' ల్యాప్‌టాప్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీకేర్ పుల్.. ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

కంప్యూటర్లను, ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా వాడటం వల్ల కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ వస్తుంది. కళ్లు మంట, దురదగా ఉండటం, కళ్ల లోంచి నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. మానిటర్‌ను తీక్షణంగా ఊసేవారిలో కనురెప్పలు వాల్చే సంఖ్య తగ్గిపోతుంది. దీంతో కళ్లుపొడిబారిపోతాయి. ఫలితంగా కంటి జబ్బులు వస్తాయి.

బీకేర్ పుల్.. ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ నియంత్రించడానికి 20-20- 20 సూత్రాన్ని పాటించాలి. అంటే ప్రతి 20 నిముషాలకు, 20 సెకన్ల విరామాన్ని తీసుకుని, 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువు వైపుకు దృష్టిని మళ్లించాలి. విరామ సమయంలో ఎక్కువసార్లు కనురెప్పల్ని ఆర్పాలి.

బీకేర్ పుల్.. ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

ల్యాప్‌టాప్‌ తెర పెద్దగానూ, ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవాలి. కంటి చూపుకి తెర ఎప్పుడూ 90 డిగ్రీల కోణంలో ఉండాలి.

బీకేర్ పుల్.. ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

మనం ఆఫీసుల్లో కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లపై పనిచేసేటప్పుడు మన చుట్టూ కంప్యూటర్లు ఉంటాయి. ఇలా కంప్యూటర్లన్నీ దగ్గర, దగ్గరగా ఉండటం వల్ల వీటిలోని విద్యుదయస్కాంత శక్తి మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది.

బీకేర్ పుల్.. ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లకు టైప్‌ చేసే మన చేతులు 70 సెంటీమీటర్లు దూరంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేసినప్పుడు మానిటర్‌పై టెక్ట్స్‌ చిన్నగా కనిపిస్తే సైజు పెంచుకోవడం మంచిది. చుట్టూ ఉండే మానిటర్లను నాలుగు అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. దీంతో విద్యుదయస్కాంత శక్తి తగ్గుతుంది.

బీకేర్ పుల్.. ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

కడుపుతో ఉన్నవారు కంప్యూటర్లను వాడకపోవడమే మంచిది. అలాగే ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని వాడటం శ్రేయస్కరం కాదు.

బీకేర్ పుల్.. ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

కంప్యూటర్‌ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి నడుంనొప్పి, వెన్ను నొప్పి రావడం చాలా సహజం. ల్యాప్‌టాప్‌తో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల ఇలా వస్తుది. సాధారణంగా పీసీని వాడేట ప్పుడు వెన్నెముక, మెడను నిటారుగా ఉంచి పనిచేస్తాం. అదే ల్యాప్‌టాప్‌ను వాడేటప్పుడు మెడను కొద్దిగా కిందకి వచ్చి పనిచేయాల్సి ఉంటుంది.

బీకేర్ పుల్.. ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

ఒకవేళ ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై ఉంచి పనిచేసినా కూడా కూర్చునే కుర్చీని మన ఎత్తుకు తగినదాన్ని ఎంచుకుని చేసుకోవాలి. లేకపోతే మెడ నొప్పి, స్పాండిలైట్‌ను భరించాల్సిందే. ప్రత్యేకంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన స్టాండ్‌ల ద్వారా కానీ, టేబుల్స్‌ ద్వారా కానీ కంటిచూపునకు సమాంతరంగా తెరను అమర్చుకోవాలి. దీంతో మెడను వాల్చాల్సిన అవసరం రాదు. నిర్ణీత సమయాల్లో అంటే ప్రతి అరగంటకోసారి ఐదు నిముషాలు రెస్ట్‌ తీసుకోవాలి.

బీకేర్ పుల్.. ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

ల్యాప్‌టాప్‌ను మోసేటప్పుడు తప్పనిసరిగా బండిపైనో, పక్కనో పెట్టుకుని ప్రయాణించాలి తప్పితే భుజానికి తగిలించుకోకూడదు.భుజానికి తగిలించుకోవడం వల్ల భుజం నొప్పి వస్తుంది. ఒకవేళ భుజానికి తగిలించుకోవలసివస్తే ఒకవైపు కాకుండా రెండువైపులకు కలిపి (పిల్లల పుస్తకాల బ్యాగులా) తగిలించుకోవడం మంచిది.

బీకేర్ పుల్.. ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

ల్యాప్‌టాప్‌ కీబోర్డ్‌పై చేతుల్ని సరైన పద్ధతిలో పెట్టకపోవడం వల్ల ఈ వ్యాధివస్తుంది. మణికట్టు, వేళ్లలో నొప్పి వస్తూ ఏదైనా వస్తువ్ఞను కూడా పట్టుకోలేనంత స్థాయికి చేరుతుంది. ల్యాప్‌టాప్‌ కీబోర్డ్‌కు సరైన స్థితిలో చేతుల్ని ఉంచాలి. వేళ్లను మోచేతికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మణికట్టును పక్కకు తిప్పి టైప్‌ చేయడం సురక్షితం కాదు.

బీకేర్ పుల్.. ల్యాప్‌టాప్‌‌లు షాక్ కొడుతున్నాయి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 23 year old electrocuted while working on laptop
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot