విండోస్ ‘10’కి ఎందుకంత క్రేజ్

Posted By:

విండోస్7కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రెండు సంవత్సరాల క్రితం విడుదలైన విండోస్8కు వినియోగదారుల నుంచి అంతగా ఆదరణ లభించలేదు. దీంతో మైక్రోసాఫ్ట్ ఒక్కసారిగా ఆలోచనలో పడింది. విండోస్8ను కేవలం 20 శాతం సంస్థలు మాత్రమే ఉపయోగిస్తున్నాయని సాంకేతిక అంశాల పరిశోధన సంస్థ ఫారెస్టర్ తెలిపింది. విండోస్ 8 ఇంటర్‌ఫేస్‌లో స్టార్ట్ బటన్ పాపప్ మెనూ లేకపోవటం పలువురిని నిరాశకు గురి చేసింది. ఈ తరుణంలో ఒకడుగు ముందుకేసిన మైక్రోసాఫ్ట్ ఏకంగా విండోస్ 10ను ఆవిష్కరించి యూవత్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Read More: ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ‘హైఅలర్ట్'!

బుధవారం ఢిల్లీతోపాటు సిడ్నీ, బీజింగ్, సింగపూర్ వంటి 13 అంతర్జాతీయ నగరాల్లో విండోస్ 10 విడుదల కార్యక్రమాలను మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున నిర్వహించింది. కెన్యాలో జరిగిన విండోస్ 10 ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల పాల్గొన్నారు. ఇకపోతే చట్టబద్ధమైన విండోస్ 7, 8.1 ఓఎస్ లను వినియోగిస్తున్న వారికి మాత్రమే విండోస్ 10 ఉచితంగా లభిస్తుందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

Read More: నోకియా.. నీ ఎంట్రీ అదిరిందయ్యా

వ్యక్తిగత కంప్యూటర్లను వినియోగిస్తోన్న ప్రతి ఒక్కరూ విండోస్ 10కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 5 కారణాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు అధికారిక విండోస్ 7, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంలను ఉపయోగించుకుంటున్నట్లయిలే ఏడాదిలోపు విండోస్ 10ని ఉచితంగా పొందవచ్చు.

విండోస్ 8లో కనుమరుగైన స్టార్ట్ మెనూ విండోస్ 10లో మీకు దర్శనమిస్తుంది. కొత్త ఓఎస్ లో ఏర్పాటు చేసిన క్లాసిక్ స్టార్ట్ మెనూ మీ కంప్యూటింగ్ మరింత సరళతరం చేస్తుంది.

యాపిల్ డిజిటల్ అసిస్టెంట్ ఫీచర్ ‘సిరి'కి పోటీగా మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఫీచర్ కార్టోనా. ఈ ఫీచర్ మీకు వ్యక్తి సహాయకునిగా వ్యవహరిస్తుంది. భారత్ వినియోగదారులు ఈ ఫీచర్ కోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

విండోస్ 10 యూజర్లు ఎప్పికప్పుడు ఉచిత అప్‌డేట్‌లను పొందవచ్చు.

విండోస్ 10 మీకు నచ్చనట్లయితే పాత వర్షన్‌లోకి స్విచ్ కావొచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 reasons why everyone should upgrade to Windows 10. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot