ఐ ఫోన్ ఇవ్వండి..లేదంటే నేను చచ్చిపోతా

Written By:

కొందరు ఐ ఫోన్ కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతున్నారు. గతంలో ఓ వ్యక్తి ఐ ఫోన్ మీద మోజుతో తన కిడ్నీలు అమ్ముకుంటే మరొకరు ఏకంగా దొంగతనానికే ఒడిగట్టారు. మరొకరు న్యూయార్క్ లో ఫ్లాగ్ షిప్ స్టోర్ కెళ్లి నానా హంగామా చేశాడు. ఏకంగా పెద్ద కత్తి పట్టుకుని యాపిల్ స్టోర్ ముందుకే వచ్చాడు మరొక వీరాభిమాని..వివరాల్లోకెళితే న్యూయార్క్‌లో 'సూ చియెన్' అనే వ్యక్తి యాపిల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌కు వెళ్లి హంగామా సృష్టించాడు.

Read more: అంత రేటు ఎందుకు పెట్టాలి..?

ఐ ఫోన్ ఇవ్వండి..లేదంటే నేను చచ్చిపోతా

ఇలాంటి ఘటనే 'న్యూయార్క్ యాపిల్ స్టోర్‌'లో చోటు చేసుకుంది. తనకు ఎలాగైనా ఐఫోన్ కావాలని, లేదంటే చనిపోతానని మెడపై కత్తి పెట్టుకుని బెదిరించడం కలకలం రేపింది. దాపు 2 అడుగుల పొడవుతో, వంకర్లు తిరిగి చూసేందుకే భయంకరంగా ఉన్న పదునైన కత్తితో స్టోర్‌లో ప్రవేశించి తనకు ఎలాగైనా ఐఫోన్ ఇవ్వాలని బెదిరించాడు. దీంతో అక్కడున్న ఇతర వినియోగదారులు భయపడి అటూ ఇటూ పరుగులు పెట్టారు. ఇంతలో అలర్టయిన స్టోర్ సెక్యూరిటీ సిబ్బంది ఎవరికీ గాయాలు కాకుండా ఆ వ్యక్తికి, ఇతర వినియోగదారులకు మధ్య ఒక కంచెను ఏర్పాటుచేశారు.

Read more: ఐ ఫోన్ 7: నీటితో చెలగాటం

ఐ ఫోన్ ఇవ్వండి..లేదంటే నేను చచ్చిపోతా

అయినా అతడు ఎక్కడా తగ్గలేదు. మరింత అలజడి సృష్టించాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అతికష్టం మీద సూ చియెన్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారన్నంతా అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీసి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ సంధర్భంగా ఐ ఫోన్ కోసం కిడ్నీ అమ్మకున్న బాధితుడి రోదన మీరే చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనాకు చెందిన ఓ 15ఏళ్ల యువకుడు

గతంలోనూ ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మకున్న సంఘటనలు చైనాలో కలకలం రేపాయి. చైనాకు చెందిన ఓ 15ఏళ్ల యువకుడు ఆపిల్ ఐప్యాడ్-2 కోసం తన కిడ్నీని అమ్మకున్నాడు. అక్రమ కిడ్నీల వ్యాపారంలో ప్రమేయమున్న ఐదుగురు వ్యక్తులు ఇతగాడికి $35,000 చెల్లించి సర్జరీ ద్వారా కిడ్నీని వేరు చేశారు.

జరగాల్సిదంతా జరిగపోయింది

పాపం!! జరగాల్సిదంతా జరిగపోయింది. టెక్నాలజీ పై వెంపర్లాట ఆ యువకుడిని ప్రాణ సంకటంలో పడేసింది. సర్జరీ అనంతరం అనారోగ్యానికి గురైన సదరు యువకుడు జరిగిన విషయాన్ని తల్లిగి పూసగుచ్చినట్లు వివరించాడు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

లబో దిబో మన్నా లాభమేముంది చెప్పండి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నీ కోనుగోలులో ప్రమేయమున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రదారైన హీ వై‌ను పోలీసులు విచారిస్తున్నారు.

ఇప్పుడు ఐప్యాడ్-2 ధర సగానికి సగం

ఇప్పుడు ఐప్యాడ్-2 ధర సగానికి సగం పడిపోయింది. అమ్ముకున్న ఆ కిడ్నీ తిరిగి వస్తుందా..?, ఆ యువకుడి ఆరోగ్యం కుదటపడుతుందా..?, ఆలోచించండి ఇతర సుఖాల కోసం అవయువాలను అమ్ముకోవద్దు.

ఇంగ్లాండ్‌కు చెందిన ఓ టీనేజర్

ఇంగ్లాండ్‌కు చెందిన ఓ టీనేజర్ డ్రెయిన్‌లో పడిపోయిన తన ఐఫోన్‌ను వెతికిపట్టుకునే క్రమంలో డ్రెయిన్‌లో ఇరుక్కుపోయాడు. రెస్క్యూ సిబ్బంది కొన్ని గంటల పాటు బాధితురాలిని రక్షించాల్సి వచ్చింది.

యాపిల్ స్టోర్ వద్ద 7 నెలల ముందు నుంచే తిష్ట

జపాన్‌కు చెందిన ఓ యాపిల్ అభిమాని ఐఫోన్‌ను ముందుగా దక్కించుకునే క్రమంలో యాపిల్ స్టోర్ వద్ద 7 నెలల ముందు నుంచే తిష్టవేసుకు కూర్చున్నాడు.

తన క్రింద పని చేసే 10 మంది పరిశోధకులను

తన కొడుకు ఐఫోన్‌ను వెతికిపట్టుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి తన క్రింద పని చేసే 10 మంది పరిశోధకులను పురమాయించడం ఓ సంచలనమైంది.

2000 డాలర్ల హ్యాండ్ బ్యాగ్‌ను

యాపిల్ ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలన్న తపనతో ఓ మహిళ క్యూలో తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు తన 2000 డాలర్ల హ్యాండ్ బ్యాగ్‌ను ఇచ్చేసింది.

ఐఫోన్‌లను కొనుగోలు చేసేందుకు తమ బిడ్డలను

చైనాకు చెందిన ఓ జంట ఐఫోన్‌లను కొనుగోలు చేసేందుకు తమ బిడ్డలను అమ్మకానికి పెట్టింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here write A man with a sword went into an Apple Store and yelled I just want an iPhone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot