Home
News

ACT Fibernet vs JioFiber vs Airtel Broadband: 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ఎంపికలో బెస్ట్ ఇదే!!

ఇండియాలో జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వంటి వాటికి పోటీగా ACT ఫైబర్నెట్ ఇటీవల అన్ని నగరాల్లో తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను సవరించింది. బ్రాడ్‌బ్యాండ్ లను వినియోగించే వారు ఎక్కువ మంది అపరిమిత డేటా ప్లాన్‌లను ఇష్టపడుతూ ఉంటారు. ఇతర ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISP) తో పోలిస్తే ACT ఫైబర్నెట్ తన 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తక్కువ ధరకు అందిస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమలో ACT ఫైబర్నెట్ BSNL, Airtel మరియు JioFiber వంటి సంస్థల తరువాత నాల్గవ అతిపెద్ద వైర్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది.

ACT ఫైబర్‌నెట్

ACT ఫైబర్‌నెట్ యొక్క 300 Mbps స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ.1,325 ధర వద్ద లభిస్తుంది. అయితే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ రెండు కూడా 300 Mbps ప్లాన్‌ను రూ.1,499 ధర వద్ద అందిస్తున్నాయి. అలాగే BSNL కూడా తన 300 Mbps ప్లాన్ ను నెలకు అదే రూ.1,499 ధర వద్ద అందిస్తున్నది. అయితే ఈ 300 Mbps స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లు అందించే ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ACT ఫైబర్నెట్ 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

ACT ఫైబర్నెట్ 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

రూ.1,325 ధర వద్ద లభించే ACT ఫైబర్నెట్ యొక్క A-Max బ్రాడ్బ్యాండ్ ప్లాన్ 300Mbps వేగంతో అపరిమిత డేటా బెనిఫిట్ (నెలకు 3.3TB చొప్పున) అందిస్తుంది. ACT ఫైబర్నెట్ యొక్క ప్లాన్ వాయిస్ కాలింగ్ మరియు అధిక OTT సబ్స్క్రిప్షన్ లను అందించదు. ఇది రూ.99 విలువైన ZEE5 ప్రీమియానికి ISP ఒక నెల ఉచిత ట్రయల్‌ను మరియు ఎపిక్ ఆన్ మరియు క్యూర్ ఫిట్ ను అందిస్తుంది. ACT ఫైబర్నెట్ ద్వారా చెల్లించినట్లయితే వినియోగదారులు ప్రతి నెలా నెట్‌ఫ్లిక్స్ చందాపై 100 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ACT ఫైబర్నెట్ యొక్క బ్రాడ్‌బ్యాండ్‌ను ఎంచుకోవడంలో ఉత్తమమైన భాగం దీర్ఘకాలిక ఎంపికలు. 24 నెలలు, 12 నెలలు, 8 నెలలు, 6 నెలలు మరియు ఒక నెలలకు అయ్యే ఖర్చు వరుసగా రూ.23,850, రూ .13,250, రూ .9,275, రూ .6,500, రూ .1,325 గా ఉంది. ఒక కస్టమర్ వార్షిక సభ్యత్వాన్ని ఎంచుకుంటే పన్ను మినహాయించి నెలకు ధర 1,104 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

జియోఫైబర్ 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

జియోఫైబర్ 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

జియోఫైబర్ యొక్క 300Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ.1,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 300Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా (3.3TB)ను అందిస్తుంది. అలాగే ఇది అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. JioFiber దాని OTT సభ్యత్వాల పోటీలో ఎవరికి అందనంత ఎత్తులో ప్రతి నెలా 1,500 రూపాయల విలువైన 16 OTT సబ్స్క్రిప్షన్ లను అందిస్తోంది. ఈ ప్లాన్‌ను ఎంచుకునే వినియోగదారులకు రూ.499 విలువైన నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ VIP, సోనీలైవ్, Zee5 ప్రీమియం, SunNXT, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ALTBalaji, హోయిచోయ్, షెమరూమీ, లయన్స్‌గేట్ ప్లే, Discovery+ మరియు JioCinema వంటి సభ్యత్వాలను మైజియో యాప్ ద్వారా రీడీమ్ చేయవచ్చు.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కూడా తన యొక్క వినియోగదారులకు 300Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అపరిమిత డేటా ప్రయోజనంతో నెలకు 1,499 రూపాయల ధర వద్ద అందిస్తోంది. OTT చందాలలో జియోఫైబర్ అందించే అన్ని కాకుండా ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కొన్ని OTT యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తోంది. వినియోగదారులు డిస్నీ + హాట్‌స్టార్ VIP, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం మరియు వింక్ మ్యూజిక్‌లకు ఉచిత యాక్సిస్ ను పొందుతారు. అయితే వినియోగదారులు ఉచిత ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను ఎంచుకుంటే కనుక వారికి ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మరియు ZEE5 ప్రీమియం సభ్యత్వాలను పొందడానికి అర్హులు అవుతారు. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌కు మొదటి నెల సభ్యత్వం కూడా ఉచితంగా లభిస్తుంది. రూ.1,499 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ అపరిమిత కాలింగ్ సేవను కూడా అందిస్తోంది.

Best Mobiles in India

English summary
ACT Fibernet vs JioFiber vs Airtel Broadband: Best Choice of 300 Mbps Broadband Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X