తప్పు మీద తప్పులు చేస్తున్న అమెజాన్

Written By:

ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌ప్పుమీద త‌ప్పు చేస్తోంది. భార‌తీయుల మ‌నోభావాలను రోజురోజుకు ఘోరంగా దెబ్బ‌తీస్తోంది. ఇటీవ‌ల జాతీయ ప‌తాకాన్ని ముద్రించిన డోర్‌మ్యాట్ల‌ను సైట్‌లో అమ్మ‌కానికి పెట్టిన సంస్థ ఆ త‌ర్వాత జాతిపిత మ‌హాత్మాగాంధీ ఫొటోను ముద్రించిన చెప్పుల‌ను వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆ వివాదాలు అలా ఉండగానే ఇప్పుడు ఏకంగా వినాయ‌కుడి బొమ్మ‌లున్న స్కేటింగ్ బోర్డుల‌ను తన సైట్‌లో పెట్టింది.

నోకియా నుంచి దూసుకొస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే

తప్పు మీద తప్పులు చేస్తున్న అమెజాన్

ఇలా తప్పు మీద తప్పులు చేస్తోన్న అమెజాన్ తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. చండీగ‌ఢ్‌కు చెందిన న్యాయ‌వాది అజ‌య్ జ‌గ్గా వినాయ‌కుడి స్కేటింగ్ బోర్డుల‌పై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ మెయిల్ ద్వారా తెలియ‌జేశారు. వెంట‌నే వెబ్‌సైట్ నుంచి వాటిని తొల‌గించి ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణలు చెప్పించాల‌ని డిమాండ్ చేశారు. అమెజాన్‌పై వెంట‌నే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కోరారు.

విండోస్ 7 వాడుతున్నారా..ఇకపై మీకు అన్నీ కష్టాలే !

తప్పు మీద తప్పులు చేస్తున్న అమెజాన్

మ‌రోవైపు అమెజాన్ తీరును కేంద్ర‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వ‌రూప్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. భార‌తీయుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌కుండా న‌డుచుకుంటే మంచిద‌ని హెచ్చ‌రించారు.అయితే అమెజాన్ నుంచి ఎలాంటి స్పందన ఇప్పటివరకూ రాలేదు.

English summary
After Tricolour Doormat, Now Amazon India Spotted Selling A Ganesha Skateboard read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot