విండోస్ 7 వాడుతున్నారా..ఇకపై మీకు అన్నీ కష్టాలే !

Written By:

మైక్రోసాప్ట్ విండోస్ 7 యూజర్లకు చేదు వార్తను అందించింది. ఈ ఆపరేటింగ్ సిస్టం మరికొద్ది సంవత్సరాలు మాత్రమే వినియోగదారుడికి అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ఇది కనుమరుగైపోతుంది. 2009లో లాంచ్ అయిన ఈ ఆపరేటింగ్ సిస్టంను ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడతారు కూడా..అయితే ఇకపై వీరంతా విండోస్ 10కి అప్ గ్రేడ్ కావాల్సిందేనని మైక్రోసాప్ట్ చెబుతోంది.

నోకియా నుంచి దూసుకొస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మరికొద్ది సంవత్సరాలు మాత్రమే

వినియోగదారుడికి అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మరికొద్ది సంవత్సరాలు మాత్రమే వినియోగదారుడికి అందుబాటులో ఉంటుంది. ఈ మాట ఎవరో కాదు.. స్వయంగా మైక్రోసాఫ్ట్‌ సంస్థే ప్రకటించింది.

విండోస్‌ 7లో భద్రతా సమస్యలు

సమకాలీన సాంకేతికతలో రోజు రోజుకూ వస్తున్న మార్పులు విండోస్‌ 7లో భద్రతా సమస్యలు సృష్టిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో వచ్చే మూడేళ్లలో విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టంకు భద్రతాపరమైన అప్‌డేట్లను పంపడం నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

తలకు మించిన భారం

భద్రతా సమస్యలను ఎదుర్కోవాలంటే వినియోగదారులకు ఎప్పుడూ ఓఎస్‌లో మార్పులు చేస్తూ కొత్త అప్‌డేట్లు పంపించాల్సి ఉంటుంది. ఇది మైక్రోసాప్ట్ కు ఇప్పుడు తలకు మించిన భారంలా మారడంతో దీన్ని నిలిపివేయడమే ఉత్తమం అని భావిస్తోంది.

ఓఎస్‌లో మార్పులు

దీంతో పాటు కొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి వస్తున్న ప్రింటర్లు, కీబోర్డులు, స్పీకర్లు, మౌస్‌లు తదితర హార్డ్‌వేర్‌ పరికరాలకు సపోర్ట్‌ చేయాలన్నా ఓఎస్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించడం మైక్రోసాఫ్ట్‌కు తలకుమించిన భారంగా మారుతోంది.

వినియోగదారులంతా విండోస్‌ 10కి మారాలని..

అందుకే 2020 జనవరి 13 నుంచి విండోస్‌ 7కు సెక్యూరిటీ సపోర్ట్‌ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తన బ్లాగులో మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. ఆ లోగా వినియోగదారులంతా విండోస్‌ 10కి మారాలని కోరింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Microsoft warns Windows 7 is dangerously insecure in 2017 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot