ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదా.. అదే ఛార్జీతో ఎయిర్ విమానంలో వెళ్లడమే !

Written By:

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇది శుభవార్తే. వారు టికెట్ కన్ఫర్మ్ కాలేదని బాధపడకుండా ఏం చక్కా ఎయిర్ ఇండియా విమానంలో గమ్యస్థానానికి వెళ్లిపోవచ్చు. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఈ సేవలను అందించనుంది. రాజధాని రైళ్లలోని ఫస్ట్ ఏసీ టికెట్ ధరలు, విమాన చార్జీలతో సరిపోలడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పథకం కింద పరిమిత కాలం వరకు ఈ సేవలు అందించనుంది. టికెట్ కన్ఫర్మ్ కాని రాజధాని రైలు ప్రయాణికులు విమానం బయలుదేరడానికి నాలుగు గంటల ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఎయిరిండియా పేర్కొంది.

Read more:గూగుల్ కీ బోర్డ్‌‌ని తలదన్నే కీ బోర్డ్‌లు

ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదా.. అదే ఛార్జీతో ఎయిర్ విమానంలో వెళ్లడమే !

సూపర్ సేవర్ స్కీం కింద జూన్ 26 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రైల్వేశాఖ 21 రాజధాని ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతోంది. రోజూ 20 వేల మంది వీటిలో ప్రయాణిస్తున్నారు. ''వేలాదిమంది టికెట్‌లు కన్ఫర్మ్ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ ఖాళీని పూరించాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఇక నుంచి టికెట్‌ దొరకని వారు అదే ఖర్చుతో అంతకంటే తక్కువ సమయంలో వారి గమ్యాలకు చేరుకోవచ్చు'' అని సంస్థ పేర్కొంది.

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫాస్ట్ అండ్ స్లో

ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

అత్యంత ఫాస్ట్ ట్రైన్ ఢిల్లీ భూపాల్ శతాబ్ది ఎక్స్ ప్రెస్. దీని యావరేజ్ వేగం 91 kmph
అత్యంత స్లోగా వెళ్లే ట్రైన్ నీలగిరి ఎక్స్ ప్రెస్. దీని సరాసరి వేగం 10 kmph

పెద్ద లైన్.. చిన్న లైన్

ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

Dibrugarh to Kanyakumari అతి పెద్ద లైన్. దీని పొడవు 4273 కిలోమీటర్లు,
Nagpur and Ajni అతి చిన్న లైన్ దీని పొడవు 3 కిలోమీటర్లు

నాన్ స్టాప్ రైలు

ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

Trivandrum-Nizamuddin Rajdhani Express 523 కిలోమీటర్లు ఆగకుంగా నాన్ స్టాప్ గా ప్రయాణిస్తుంది.

ఒకే లొకేషన్లో రెండు స్టేషన్లు

ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

మహరాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాలో Srirampur and Belapur రెండు స్టేషన్లు ఉంటాయి. ఒకే ప్రదేశంలో అపోజిట్ గా ఉంటాయి.

Longest & shortest station names

ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

చైన్నైలోని అరక్కోణం రేణిగుంట సెక్షన్ లో ఉన్న Venkatanarasimharajuvaripeta అనేది అతి పెద్ద స్టేషన్ పేరు
అతి చిన్న పేరు ఒడిషాలోని ఎల్ బి, గుజరాత్ లోని ఒడి

అతి పెద్ద ఫ్లాట్ పాం

ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

గోరఖ్ పూర్ స్టేషన్ అతి పెద్ద ఫ్లాట్ పాం. 1.35 కిలోమీటర్లు ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Air India offers seats at same fare as Rajdhani Express through irctc website
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting