Home
News

ఎయిర్‌పాడ్స్‌లో త్వరలోనే లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. భాష రాకపోయినా ఎవరితోనైనా మాట్లాడొచ్చు..!

AirPods Live Translation: యాపిల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. త్వరలోనే ఎయిర్‌పాడ్స్‌లో లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ రాబోతోంది. అంటే త్వరలో మీరు వేరే భాషల్లో మాట్లాడేవాళ్లతో ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. ఐఓఎస్ 19 అప్‌డేట్‌లో భాగంగా ఈ ఫీచర్‌ను యాపిల్ రిలీజ్ చేయనుందని సమాచారం. బ్లూమ్‌బెర్గ్ రిపోర్టర్ మార్క్ గుర్మాన్ ప్రకారం, ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎక్కడికెళ్లినా సరే, లైవ్‌లోనే ట్రాన్స్‌లేషన్ జరుగుతుంది. భాషలు వేరైనా ఇబ్బంది లేకుండా ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు.

* ఇదెలా పనిచేస్తుందంటే..

ఎదుటి వ్యక్తి వేరే భాషలో మాట్లాడితే, ఐఫోన్ వెంటనే ఆ మాటల్ని ట్రాన్స్‌లేట్ చేసి, ఎయిర్‌పాడ్స్‌లోకి ఆడియో రూపంలో పంపిస్తుంది. మీరు రిప్లై ఇవ్వాలనుకుంటే, మీరు మాట్లాడే మాటల్ని కూడా ఐఫోన్ ట్రాన్స్‌లేట్ చేసి అవతలి వ్యక్తికి వినిపిస్తుంది. ఇలా ఇద్దరు వేర్వేరు భాషలు మాట్లాడేవాళ్లూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడుకునేలా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది.

AirPods May Soon Support Live Translation  A Game Changer for Apple Users

* లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తోంది..

లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఇయర్‌బడ్స్‌లో రావడం ఇదేం మొదటిసారి కాదు. గూగుల్ ఆల్రెడీ 2017లోనే పిక్సెల్ బడ్స్‌లో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత 2022లో పిక్సెల్ బడ్స్ ప్రోలోనూ దీన్ని అప్‌డేట్ చేసింది. మెటా, హ్యూమన్ లాంటి కంపెనీలు కూడా ఇలాంటి ఫీచర్స్‌ను వేరబుల్స్‌లో ట్రై చేశాయి.

కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు. యాపిల్ మాత్రం 2020 నుంచే ఐఫోన్లలో ట్రాన్స్‌లేట్ యాప్‌ను అందిస్తోంది. ఇప్పుడు ఏకంగా ఎయిర్‌పాడ్స్‌లోనే ట్రాన్స్‌లేషన్ ఫీచర్ వస్తుండటంతో, యూజర్లకు మరింత సులువైన, హ్యాండ్స్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఈ వార్త తెలిసి ఏర్పాటు యూజర్స్ ఫిదా తాగుతున్నారు.

* సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మాత్రమే.. కొత్త ఎయిర్‌పాడ్స్ కొనక్కర్లేదు..

ఇది హార్డ్‌వేర్ అప్‌డేట్ కాదు, కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మాత్రమే. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఎయిర్‌పాడ్స్‌కే ఈ ఫీచర్ వస్తుంది. కొత్తవి కొనాల్సిన అవసరం లేదు. గతంలో కూడా యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో (2వ తరం)కి హియరింగ్ హెల్త్ ఫీచర్స్ లాంటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ని ఇచ్చింది.

* యాపిల్ భారీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్లాన్స్..

యాపిల్ ఈసారి సాఫ్ట్‌వేర్ విషయంలో బాగా ఫోకస్ పెట్టింది. ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్, మ్యాక్‌ఓఎస్.. ఇలా అన్నిటినీ రీడిజైన్ చేస్తోంది. ట్రాన్స్‌లేషన్ టెక్నాలజీని కూడా మరింత తెలివైగా మార్చే పనిలో ఉంది. ఎయిర్‌పాడ్స్‌ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ గురించి యాపిల్ ఇంకా ఏం చెప్పలేదు కానీ, ఈ ఏడాది చివర్లో ఇది విడుదల కావచ్చు.

* ఫ్యూచర్ ప్లాన్స్ కూడా అదిరిపోలా..

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో పాటు కొత్త ఎయిర్‌పాడ్స్ మోడల్స్‌ను కూడా యాపిల్ రెడీ చేస్తోంది. థర్డ్-జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో, కెమెరాలు కలిగిన ఎయిర్‌పాడ్స్ (ఏఐ ఫీచర్స్‌తో పనిచేసేలా) కూడా రాబోతున్నాయట. లాస్ట్ ఇయర్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ కొత్త కలర్స్‌లో రిలీజ్ అయ్యాయి, లో-ఎండ్ ఎయిర్‌పాడ్స్ మోడల్స్‌ను కూడా అప్‌డేట్ చేసింది.

ఒకవేళ లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ అనుకున్నంత సక్సెస్ అయితే, యాపిల్ యూజర్ల జీవనశైలి గొప్పగా మారిపోతుంది. భాషా సమస్యలు లేకుండా ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం మరింత ఈజీ అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
AirPods may soon gain live translation in iOS 19, enabling real-time language interpretation during conversations. This software update promises seamless bilingual communication, breaking down language barriers for users globally.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X