Home
News

రోజుకు 2GB డేటాను అందిస్తున్న Airtel, Jio ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే....

ఇండియాలోని టెలికామ్ రంగంలో అధిక సంఖ్యలో వినియోగదారులను కలిగిన ఎయిర్‌టెల్ మరియు జియోలు తమ వినియోగదారులకు ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో అద్భుతమైన డేటా ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది వినియోగదారులు 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లను ఇష్టపడుతున్నారు.

ఇండియాలో 2GB డైలీ డేటా ప్లాన్‌లు

ఇండియాలో 2GB డైలీ డేటా ప్లాన్‌లు

కరోనా కారణంగా ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న చాలామందికి ఈ రోజువారి డేటా సరిపోక దీని కంటే అధిక డేటాను అందిస్తున్న ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఇటువంటి వారికోసం ఈ రెండు టెల్కోలు తమ వినియోగదారులకు రోజువారి 2GB డేటా ప్లాన్‌లను కూడా అందిస్తున్నారు. భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో నుండి రోజువారీ 2GB డేటాను అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క చెల్లుబాటు 28 రోజుల నుండి ఒక సంవత్సరం వరకు ఉన్నాయి. రిలయన్స్ జియో 2GB రోజువారీ డేటా ప్రయోజనంతో ఇటీవల మరికొన్ని ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ల యొక్క ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Tata Sky vs Airtel Digital TV vs Dish TV: సెట్-టాప్ బాక్స్‌లలో బెస్ట్ ఇదే!!!

భారతి ఎయిర్టెల్ యొక్క 2GB డైలీ డేటా ప్లాన్‌లు

భారతి ఎయిర్టెల్ యొక్క 2GB డైలీ డేటా ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ రూ.2498 ప్రీపెయిడ్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ సంస్థ అధిక ధర వద్ద అందిస్తున్న ప్లాన్ ఇది. ఈ ప్లాన్ రోజువారీ 2GB డేటా బెనిఫిట్‌ను 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. దీనితో పాటుగా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటితో పాటు మరిన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. Also Read: Motorola One Fusion+ కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా!!!

 

ఎయిర్‌టెల్ రూ.698 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.698 ప్రీపెయిడ్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ వినియోగదారులు మూడు నెలల చెల్లుబాటుతో అద్భుతమైన ప్రయోజనాలను కోరుకుంటున్న వారికి ఇది సరైన ఎంపిక. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో రోజువారీ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ .449 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ .449 ప్రీపెయిడ్ ప్లాన్

రెండు నెలల చెల్లుబాటు కాలంతో రోజువారీ అధిక డేటా ప్రయోజనాలను కోరుకుంటున్న వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఇది 56 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటా, రోజుకు100 SMS ప్రయోజనాలతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనంను కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

2GB రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తున్న ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. డేటా ప్రయోజనంతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇది ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియో చందాను ఉచితంగా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.298 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.298 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ సంస్థ 2GB రోజువారీ డేటాను తక్కువ ధరలో అందిస్తున్న ప్లాన్ లలో ఇది మొదటిది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తున్నది.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల అదనపు ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల అదనపు ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ యొక్క 2GB రోజువారీ డేటాను అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్లు అన్ని కూడా ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్‌తో వస్తాయి. ఈ ప్రయోజనాలలో ZEE5 ప్రీమియం, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, షా అకాడమీ యొక్క ఉచిత ఆన్‌లైన్ క్లాసులు, ఉచిత హెలోటూన్స్ వంటివి కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ఫాస్ట్ ట్యాగ్ యొక్క లావాదేవీలపై 150 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా పొందుతారు.

జియో రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ లాంగ్-టర్మ్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటా, అపరిమిత జియో - టూ - జియో కాల్స్ మరియు 12000 FUP నిమిషాల నాన్-జియో కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఇదే కాకుండా పరిచయ ఆఫర్లో భాగంగా 10GB డేటాను కూడా అదనంగా అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది డిస్నీ + హాట్‌స్టార్ సభ్యత్వాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది.

 

జియో రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో ఒక సంవత్సరం చెల్లుబాటుతో వస్తున్న రెండవ ప్లాన్ ఇది. ఇది తన 365 రోజుల చెల్లుబాటు కాలంలో 2GB రోజువారీ డేటాతో పాటు జియో - టూ - జియో అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 12000 FUP నిమిషాల నాన్-జియో కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

జియో రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్

మూడు నెలల చెల్లుబాటుతో వినియోగదారులకు అందిస్తున్న ఈ ప్లాన్ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నది. ఈ ప్లాన్ తన 84 రోజుల చెల్లుబాటు కాలంలో 2GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత జియో కాల్స్ మరియు 3000 FUP నిమిషాల నాన్-జియో కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది.

జియో రూ.444 ప్రీపెయిడ్ ప్లాన్

ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో వినియోగదారులు ఎంచుకోవడానికి సరైన ప్లాన్ ఇది. ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు కాలంతో రోజుకు 2GB డేటా, అపరిమిత జియో కాలింగ్‌తో పాటు రోజుకు 100SMS ప్రయోజనాలతో పాటుగా నాన్-జియో కాల్స్‌ కోసం 2000 FUP నిమిషాలను అందిస్తుంది.

జియో రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్

జియో సంస్థ తక్కువ ధరలో రోజువారి 2GB డేటాను అందిస్తున్న ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటా ప్రయోజనంతో పాటు అపరిమిత జియో వాయిస్ కాలింగ్ మరియు 1000 FUP నిమిషాల నాన్-జియో కాల్స్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. పైన తెలిపిన అన్ని ప్లాన్లు కూడా అన్ని రకాల జియో యాప్ ల కాంప్లిమెంటరీ చందాను ఉచితంగా అందిస్తాయి.

Best Mobiles in India

English summary
Airtel and Reliance Jio now Offers 2GB Data Every Day
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X