Tata Sky vs Airtel Digital TV vs Dish TV: సెట్-టాప్ బాక్స్‌లలో బెస్ట్ ఇదే!!!

|

ఇండియాలోని డిటిహెచ్ రంగంలో గల డిటిహెచ్ ఆపరేటర్లు అందరు తమ వినియోగదారుల బేస్ ను పెంచుకోవడానికి వివిధ రకాల సెట్-టాప్ బాక్స్‌లను వేర్వేరు ధరల వద్ద అందిస్తున్నారు. ఇండియాలోని డిటిహెచ్ యొక్క మార్కెట్ వాటాలో అధికంగా టాటా స్కై ఆపరేటర్ కలిగి ఉంది.

DTH ఆపరేటర్లు

DTH ఆపరేటర్లు

తరువాత స్థానాలలో డిష్ టివి, ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మరియు డి 2 హెచ్ ఆపరేటర్లు ఉన్నారు. DTH యొక్క సేవలను పొందడానికి వినియోగదారులకు సెట్-టాప్ బాక్స్ యొక్క అవసరం ఖచ్చితంగా కావాలి. ఏ ఆపరేటర్ కూడా తమ సెట్-టాప్ బాక్స్‌లను ఉచితంగా అందించడం లేదు. వీటి కోసం కొంత మొత్తంలో రుసుమును చెల్లించాలి.Also read:COVID-19 పరీక్షా కేంద్రాలను గూగుల్ మ్యాప్స్, యాప్ ద్వారా కనుగొనడం ఎలా?

 

DTH ఆపరేటర్ల సెట్-టాప్ బాక్స్‌లు

DTH ఆపరేటర్ల సెట్-టాప్ బాక్స్‌లు

ఆపరేటర్లు అందరూ వివిధ రకాల సెట్-టాప్ బాక్స్‌లను వేర్వేరు ధరల వద్ద అందిస్తున్నాయి. డిటిహెచ్ ఆపరేటర్లు అందిస్తున్న STB ల ధరల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.  Also Read: Motorola One Fusion+ కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా!!!

టాటా స్కై సెట్-టాప్-బాక్స్ ల  ధరల వివరాలు

టాటా స్కై సెట్-టాప్-బాక్స్ ల ధరల వివరాలు

డిటిహెచ్ రంగంలో అద్దిక సంఖ్యలో వినియోగదారుల బేస్ ను కలిగి ఉన్న టాటా స్కై మొత్తంగా నాలుగు STBలను అందిస్తోంది. టాటా స్కై యొక్క SD STBని రూ.1,499 ధర వద్ద అందిస్తున్నది. ఇది హెచ్‌డి ఛానల్ ప్యాక్‌లకు మద్దతు ఇవ్వదు. టాటా స్కై యొక్క HD STBని కూడా రూ.1,499 ధర వద్ద అందిస్తున్నది. ఇది హెచ్‌డి ఛానల్ ప్యాక్‌లకు మద్దతు ఇస్తుంది. అలాగే టాటా స్కై యొక్క 4K STBని రూ.6,400 ధర వద్ద మరియు అత్యంత ఖరీదైన టాటా స్కై +HD STB ని రూ.9,300 ధర వద్ద అందిస్తున్నది. లైవ్ టీవీ మరియు OTT కంటెంట్‌ యాక్సిస్ ను అందిస్తున్న టాటా స్కై యొక్క మరొక STB టాటా స్కై బింగే +ను రూ.3,999 ధర వద్ద అందిస్తున్నది. Also Read: Bharat Fiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఈ కొత్త మార్పులు గమనించారా??

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సెట్-టాప్ బాక్స్ ధరల వివరాలు

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సెట్-టాప్ బాక్స్ ధరల వివరాలు

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి తన వినియోగదారుల కోసం మూడు రకాల STBలను అందిస్తున్నది. రూ.1,100 చౌక ధరలో (SD) స్టాండర్డ్ డెఫినిషన్ బాక్స్ లభిస్తుంది. ఇది హెచ్‌డి ఛానల్ ప్యాక్‌లకు మద్దతు ఇవ్వదు. అలాగే HD ఎస్‌టిబిని డిటిహెచ్ ఆపరేటర్ నుండి కేవలం రూ.200 అదనంగా చెల్లించి రూ.1,300 ధర వద్ద పొందవచ్చు. అలాగే వినియోగదారులు ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ను రూ.3,639 ధర వద్ద పొందవచ్చు. ఇది అంతర్నిర్మిత క్రొమ్ క్యాస్ట్ ఫీచర్ తో పాటుగా ప్రధాన OTT కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా యాక్సిస్ ను అందిస్తుంది.

డిష్ టీవీ సెట్-టాప్ బాక్స్ ధరల వివరాలు

డిష్ టీవీ సెట్-టాప్ బాక్స్ ధరల వివరాలు

డిష్ టీవీ కూడా తన వినియోగదారులకు మూడు రకాల సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తోంది. ఇందులో చౌకైనది SD సెట్-టాప్ బాక్స్‌ను రూ.1,490 ధర వద్ద అందిస్తుంది. HD వీడియో నాణ్యతను అందించే HD సెట్-టాప్ బాక్స్‌ను రూ.1,590 ధర వద్ద అందిస్తున్నది. కొత్తగా ప్రవేశపెట్టిన DishSMRT HUB ను రూ.2,499 ధర వద్ద వినియోగదారులు పొందవచ్చు. ఇది గూగుల్ ప్లే స్టోర్ నుండి అన్ని రకాల యాప్ లను మరియు గేమ్ లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రజలను అనుమతిస్తుంది.

d2h సెట్-టాప్-బాక్స్ ధరల వివరాలు

d2h సెట్-టాప్-బాక్స్ ధరల వివరాలు

d2h సంస్థ తన వినియోగదారులకు నాలుగు వేర్వేరు STB లను అందిస్తోంది. ఇందులో మొదటిది SD సెట్-టాప్ బాక్స్ రూ.1,499 ధర వద్ద వస్తుంది. రెండవది డిజిటల్ HD సెట్-టాప్ బాక్స్ రూ.1,599 ధర వద్ద లభిస్తుండగా మూడవది HD RF సెట్-టాప్ బాక్స్ ను రూ.1,799 ధర వద్ద పొందవచ్చు. చివరిగా అత్యంత ఖరీదైనది మ్యాజిక్‌స్టిక్‌తో కూడిన HD RF సెట్ టాప్ బాక్స్ ను వినియోగదారులు రూ.2,198 ధర వద్ద పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Tata Sky vs Airtel Digital TV vs Dish TV: Set-top-boxes, Prices and Features compared

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X