Motorola One Fusion+ కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా!!!
లెనోవా యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా ఇప్పుడు ఇండియాలో కొత్త ఫోన్ ను లాంచ్ చేసారు. మోటరోలా వన్ ఫ్యూజన్ యొక్క అప్ డేట్ వెర్షన్ గా వస్తున్న మోటరోలా వన్ ఫ్యూజన్ + ఈ రోజు ఇండియాలో గ్రాండ్ గా విడుదల అయింది.

"మేడ్ ఇన్ ఇండియా" మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్
ఈ స్మార్ట్‌ఫోన్ ను గత వారం యూరప్‌లో విడుదల చేశారు. మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ "మేడ్ ఇన్ ఇండియా" పేరుతో రావడం మరొక గొప్ప విషయం. సాఫ్ట్‌వేర్ మరియు చిప్‌సెట్ పరంగా గొప్ప మార్పులతో విడుదల ఈ మోటరోలా కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Bharat Fiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఈ కొత్త మార్పులు గమనించారా??

మోటరోలా వన్ ఫ్యూజన్ + ధరల వివరాలు
మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో కేవలం ఓకే ఒక వేరియంట్ లలో మాత్రమే విడుదల చేసారు. ట్విలైట్ బ్లూ మరియు మూన్లైట్ వైట్ అనే రెండు కలర్ వేరియంట్ లలో విడుదల అయ్యే ఈ ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర 16,999 రూపాయలు. దీనిని జూన్ 24 నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. Also Read:JPG ఫైల్‌ను PDF రూపంలోకి మార్చడం ఎలా?

మోటరోలా వన్ ఫ్యూజన్ + స్పెసిఫికేషన్స్
మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారంగా రన్ అవుతుంది. దీని యొక్క 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లే 19.5: 9 కారక నిష్పత్తి మరియు 395ppi పిక్సెల్ సాంద్రతతో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 730G SoC చేత శక్తిని పొందుతూ అడ్రినో 618 GPU మరియు 6GB RAM తో జత చేయబడి ఉంటుంది. ఈ ఫోన్ లో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో గల హైబ్రిడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + ఫీచర్స్
మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో నిలువ వరుసలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో , 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో పాప్-అప్ కెమెరా మాడ్యూల్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వస్తుంది.

మోటరోలా వన్ ఫ్యూజన్ + కనెక్టివిటీ ఎంపికలు
మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ V5, వై-ఫై 802.11ac, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ మరియు డ్యూయల్ 4G Volte ఉన్నాయి.అలాగే ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఇది ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 162.9x76.9x9.6mm కొలతలతో 210 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








