Vi, BSNL, జియోలకు ఎయిర్‌టెల్ షాక్.. బడ్జెట్ ధరలో 84 రోజుల ప్లాన్.. రోజుకి 2GB డేటా, ఓటీటీ బెనిఫిట్స్!
Airtel: జియో, బీఎస్‌ఎన్ఎల్ బడ్జెట్ ప్లాన్ల దెబ్బకి టెలికాం కంపెనీలన్నీ దిగొస్తున్నాయి. దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సైతం చాలా బడ్జెట్ ధరల్లోనే అదిరిపోయే ప్లాన్స్ ఒక్కొక్కటిగా లాంచ్ చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ లాంగ్ టర్మ్ ప్లాన్స్‌కే ఓటేస్తున్నారు అందుకే ఎయిర్‌టెల్ కొత్తగా 84 రోజుల ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ SMSలు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ ప్రయోజనాలు ఏవో తెలుసుకుందాం.
బడ్జెట్‌లో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకునేవాళ్లకి ఈ ప్లాన్ సూపర్ ఛాయిస్. Vi, బీఎస్‌ఎన్ఎల్ లాంటి కంపెనీలకు పోటీగా ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఉత్తమ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ ఇది. మరి ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ ధర ఎంత, మిగతా ప్లాన్స్‌తో పోలిస్తే ఇది ఎంత ఉత్తమం అనేది చూద్దాం.

*:ఎయిర్‌టెల్ రూ.1,029 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ
ఎయిర్‌టెల్ రూ.1,029 ప్లాన్‌లో చాలా ఎక్కువ వ్యాలిడిటీతో పాటు బోలెడన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. 84 రోజుల పాటు ఈ ప్లాన్ పనిచేస్తుంది. లోకల్ అయినా, STD అయినా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్‌గా కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు, రోజుకి 100 SMSలు కూడా పూర్తిగా ఉచితం.
ఈ ప్లాన్‌లో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఏకంగా మూడు నెలలు ఫ్రీగా వస్తుంది. అంటే సినిమాలు, షోలు అన్నీ ఫ్రీగా చూసేయొచ్చు. కాకపోతే ఇది మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మాత్రమే. ఫోన్‌లోనే చూడాలి, టీవీలోనో, లాప్‌టాప్‌లోనో కుదరదు. ఫోన్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడగలmనుకునే వారు మాత్రమే ఈ ప్లాన్ తీసుకోవడం మంచిది.
బడ్జెట్‌లో ఎక్కువ కాలం వచ్చే ప్లాన్ కావాలి అనుకునేవాళ్లకి, కాలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ ముఖ్యం అనుకునేవాళ్లకి ఈ ప్లాన్ మంచి ఆప్షన్. మూడు నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ లేకుండా హ్యాపీగా వాడేసుకోవచ్చు. డేటా వద్దనుకుంటే మూడు నెలల పాటు అపరిమిత కాల్స్ అందించే ఇతర ప్లాన్లు చెక్ చేయవచ్చు.
* బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్‌టెల్ రూ.219 ప్లాన్
ఒకవేళ మీకు మూడు నెలల సుదీర్ఘమైన ప్లాన్ వద్దు, కానీ నెలవారీ ప్లాన్ కావాలి అనుకుంటే ఎయిర్‌టెల్ రూ.219 ప్లాన్ బెస్ట్ ఛాయిస్. ఈ ప్లాన్ 30 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో మొత్తం 3GB డేటా ఇస్తారు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అన్ని నెట్‌వర్క్‌లకి చేసుకోవచ్చు. ఇంకా 300 SMSలు కూడా వస్తాయి.
డేటా తక్కువగా వాడేవాళ్లకి, అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్ కావాలి అనుకునేవాళ్లకి ఈ రూ.219 ప్లాన్ బాగా సరిపోతుంది. రూ.211 ప్లాన్‌తో పోలిస్తే ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అందుకే ఇది ఎక్కువ ఇంటర్నెట్ వాడని వారికి చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
* BSNL హోలీ ధమాకా
BSNL కూడా హోలీ పండగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కొన్ని పాపులర్ ప్లాన్స్‌కి ఎక్స్‌ట్రా వ్యాలిడిటీ ఇస్తోంది. అంటే తక్కువ ధరకే ఎక్కువ రోజులు ప్లాన్ వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ డేటా లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇటీవలే BSNL 395 రోజుల ప్లాన్‌కి కూడా 30 రోజులు అదనంగా వ్యాలిడిటీ అందించింది.


Click it and Unblock the Notifications








