జియో దెబ్బకు కంపెనీలు విలవిల..భారీగా డేటా రేట్లు తగ్గింపు

Written By:

దూసుకువస్తున్న రిలయన్స్ 4జీ దెబ్బకు మిగతా కంపెనీలు విలవిలలాడుతున్నాయి. జియో కలిగించే నష్టాన్ని ఎలాగైనా పూడ్చుకోవాలని ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. నష్ట నివారణ చర్యలకు ఐడియా సెల్యులార్ తగు ప్రణాళికలు రూపొందించుకుంటే ఇప్పుడు భారతి ఎయిర్ టెల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. దాదాపు 67 శాతం వరకు ప్రొత్సాహాకాలను అందించేందుకు సిద్ధమైంది.

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

జియో దెబ్బకు కంపెనీలు విలవిల..భారీగా డేటా రేట్లు తగ్గింపు

ఇందులో భాగంగా రూ. 455కు ఇంతవరకూ 4జీ లేదా 3జీపై 2 గిగాబైట్ల డేటాను ఇస్తున్న ఐడియా, ఇకపై 3 గిగాబైట్లను అందిస్తుంది. అదే రూ. 655 రీచార్జ్ పై ఇప్పుడున్న 3 జీబీని 5 జీబీకి, రూ. 989 రీచార్జ్ పై ఇప్పుడున్న 6.5 జీబీని 10 జీబీకి పెంచుతూ నిర్ణయించింది. రూ. 25 రూపాయల 2జీ ప్యాక్ పై ప్రస్తుతం 100 ఎంబీ ఇస్తుండగా, దాన్ని 145 ఎంబీకి, రూ. 145 కు ఇప్పుడిస్తున్న 440 ఎంబీని 580 ఎంబీకి పెంచుతున్నట్టు పేర్కొంది.

ట్విట్టర్‌కే దడ పుట్టిస్తున్న రాందేవ్ బాబా యోగాసనాలు

జియో దెబ్బకు కంపెనీలు విలవిల..భారీగా డేటా రేట్లు తగ్గింపు

ఎయిర్ టెల్ సైతం తమ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను సిద్ధం చేస్తున్నట్టు అజయ్ తెలిపారు. కాగా, డేటా చార్జీల తగ్గింపుపై స్పందించేందుకు వొడాఫోన్ భారత ప్రతినిధి మాత్రం నిరాకరించారు. శాంసంగ్ ఫోన్లపై జియో అన్ లిమిటెడ్ డేటా ఆఫర్ ఇస్తోంది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో దెబ్బకు డేటా రేట్లను భారీగా తగ్గించిన కంపెనీలు

రిలయన్స్ జియో భాగస్వామ్యంతో సామ్‌సంగ్ ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల పై రిలయన్స్ జియో సిమ్‌తో పాటు 3 నెలల ఉచిత డేటాను అందిస్తోంది. సామ్‌సంగ్ యూజర్లు పొందబోయే రిలయన్స్ జియో ప్రివ్యూ ఆఫర్‌లో భాగంగా 90 రోజుల పాటు జియో సిమ్ పై అన్‌లిమిటెడ్ డేటా, హైడెఫినిషన్ వాయిస్ ఇంకా వీడియో కాలింగ్, ఎస్ఎంఎస్ ఇంకా రిలయన్స్ జియో ప్రీమియమ్ యాప్స్‌కు సంబంధించిన యాక్సెస్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఎంపిక చేయబడిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల పై మాత్రమే ఈ ఆఫర్ వరిస్తుంది.

జియో దెబ్బకు డేటా రేట్లను భారీగా తగ్గించిన కంపెనీలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, గెలాక్సీ ఏ5 (2016), గెలాక్సీ ఏ7,గెలాక్సీ ఏ7 (2016), గెలాక్సీ ఏ8, గెలాక్సీ నోట్ 4, గెలాక్సీ నోట్ 5, గెలాక్సీ నోట్ డ్యుయోస్, గెలాక్సీ నోట్ ఎడ్జ్, గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్+, గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్.

జియో దెబ్బకు డేటా రేట్లను భారీగా తగ్గించిన కంపెనీలు

ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోగదలిచిన, పై జాబితాలో ఉన్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ హ్యాండ్‌సెట్‌లలో MyJio యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. యాప్ ఇన్‌స్టాలేషన్ పూర్తి అయిన తరువాత, జియో సిమ్‌ను పొందే ఆప్షన్‌ను యూజర్లు చూడగలుగుతారు.

జియో దెబ్బకు డేటా రేట్లను భారీగా తగ్గించిన కంపెనీలు

సదరు ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా బార్‌కోడ్ అలానే జియో ఆఫర్ కోడ్‌తో కూడిన కూపన్ జనరేట్ అవుతుంది. ఈ కోడ్‌ను పొందే క్రమంలో యూజర్ తన పర్సనల్ ఈమెయిల్ ఐడీతో పాటు అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

జియో దెబ్బకు డేటా రేట్లను భారీగా తగ్గించిన కంపెనీలు

నిర్ధేశిత expiry dateతో వచ్చే ఈ కోడ్‌ ఆ గడువులోపే పనిచేస్తుంది. ఒక్కో యూజర్‌కు రిలయన్స్ జియో జారీ చేసే కోడ్ ఇతరులకు బదిలీ చేయలేని విధంగా ఉంటుంది.

జియో దెబ్బకు డేటా రేట్లను భారీగా తగ్గించిన కంపెనీలు

ఈ కోడ్‌ను పొందే క్రమంలో యూజర్ తన పర్సనల్ ఈమెయిల్ ఐడీతో పాటు అడ్రస్ ప్రూఫ్‌లను సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

జియో దెబ్బకు డేటా రేట్లను భారీగా తగ్గించిన కంపెనీలు

డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓకే అయిన వెంటనే ఉచిత రిలియన్స్ జియో సిమ్ మీకు లభిస్తుంది.

జియో దెబ్బకు డేటా రేట్లను భారీగా తగ్గించిన కంపెనీలు

ఈ సిమ్ కార్డ్‌ను మీ ఫోన్‌లో ఇన్సర్ట్ చేసి 1977కు డయల్ చేయటం ద్వారా టెలి- వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా మీ సిమ్ యాక్టివేట్ అవుతుంది.

జియో దెబ్బకు డేటా రేట్లను భారీగా తగ్గించిన కంపెనీలు

ఈ ప్రకియ పూర్తి అయిన తరువాత మరోసారి MyJio యాప్‌‌లోకి వెళ్లి జియో ప్రివ్యూ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది.

జియో దెబ్బకు డేటా రేట్లను భారీగా తగ్గించిన కంపెనీలు

90 రోజుల ఉచిత సబ్‌స్ర్కిప్షన్ పూర్తి అయిన తరువాత రిలయన్స్ జియో కమర్షియల్ టారిఫ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కావల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Airtel cuts data prices as Reliance Jio grabs mobile customers
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot