లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందించే ఏకైక DTH ఆపరేటర్ ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

|

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Trai) నుండి వచ్చిన తాజా నియంత్రణల కారణంగా టెలికాం పరిశ్రమ మాదిరిగానే డిటిహెచ్ పరిశ్రమ కూడా ఇప్పుడు పోటీగా మారింది. డిటిహెచ్ ఆపరేటర్లు కూడా పరిశ్రమలో అగ్రస్థానం కోసం పోరాడుతున్నారు. ఈ రేసులో అత్యంత ప్రాచుర్యం పొందిన DTH ఆపరేటర్లలో టాటా స్కై, డిష్ టివి, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ మొదటివరుసలో ఉన్నాయి.

డిటిహెచ్
 

భారతి ఎయిర్‌టెల్ వారి చందాదారులకు ఇతర డిటిహెచ్ ఆపరేటర్లు అందించే వాటితో పోలిస్తే కొన్ని ఎంపికలు మెరుగ్గా ఉన్నాయి. ఇందులో దీర్ఘకాలిక ఛానల్ ప్యాక్‌లు కూడా ఉన్నాయి. కొత్త ట్రాయ్ టారిఫ్ పాలన అమలులోకి వచ్చినప్పటి నుండి దీర్ఘకాలిక ప్లాను వివాదంలో చిక్కుకున్నాయి. ఏదేమైనా కొత్త పాలన అమలులో ఉన్నప్పటికీ ఎయిర్టెల్ డిజిటల్ టివి ఈ దీర్ఘకాలిక ప్రణాళికలను అందించడం కొనసాగిస్తున్నది. చందాదారులు వారి డిటిహెచ్ చందాలో కొంత పొదుపు చేయడానికి వాటిని ఎంచుకోవచ్చు.

5G ప్రొసెసర్ ల్యాప్‌టాప్‌లను అందించే ప్రయత్నంలో ఇంటెల్‌ & మీడియాటెక్

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ లాంగ్ టర్మ్ ఛానల్ ప్యాక్‌లు

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ లాంగ్ టర్మ్ ఛానల్ ప్యాక్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తమ చందాదారులకు దీర్ఘకాలిక ఛానల్ ప్యాక్‌లలో 6 నెలల లేదా 11 నెలల చందాను పొందే అవకాశం ఉంటుంది. 6 నెలలు ప్యాక్‌తో రీఛార్జ్ చేసినప్పుడు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ చందాదారులకు 15 రోజుల పాటు అదనంగా తమ సేవలను ఉచితంగా అందిస్తుంది. అలాగే 11 నెలల ప్యాక్‌తో రీఛార్జ్ చేసినప్పుడు అదనంగా మరొక 30 రోజుల సేవలు ఉచితంగా లభిస్తాయి. అంటే 11 నెలల చందా పొందినప్పుడు వినియోగదారులు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి నుండి ఉచితంగా మరొక నెల పాటు తమ సేవలను ఆనందిస్తారు.

 దబాంగ్ స్పోర్ట్స్ ప్యాక్‌

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి నుండి వచ్చిన ఈ దీర్ఘకాలిక ఛానల్ ప్యాక్‌ల జాబితా దబాంగ్ స్పోర్ట్స్ ప్యాక్‌తో మొదలవుతుంది. ఇది నెలవారీ ప్రాతిపదికన తీసుకుంటే నెలకు రూ.290 ఖర్చు అవుతుంది. ఈ ప్యాక్ యొక్క 6 నెలలు మరియు 12 నెలల చందా ధర వరుసగా రూ .1,681 మరియు రూ.3,081. ఈ ప్లాన్ యొక్క రెండవ కనెక్షన్ చందాదారులకు నెలకు 220 రూపాయలు ఖర్చు అవుతుంది.

వాల్యూ స్పోర్ట్స్ లైట్
 

దీర్ఘకాలిక ఛానల్ ప్యాక్‌లలో వాల్యూ స్పోర్ట్స్ లైట్ కూడా ఉంది. ఇది నెలకు రూ.332 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్యాక్ యొక్క 6 నెలల మరియు 11 నెలల కాలానికి రూ.1,994 మరియు రూ.3,654 ఖర్చవుతుంది. ఈ ప్లాన్‌పై సెకండరీ కనెక్షన్‌కు నెలకు రూ .273 ఖర్చవుతుంది.

Vivo U20 Sale : గొప్ప ఆఫర్లతో అమెజాన్ లో రేపటి నుండి అమ్మకాలు

ఎయిర్‌టెల్

దీర్ఘకాలిక చందా పొందగల ఎయిర్‌టెల్ డిజిటల్ టివి నుండి ఇతర ప్లాన్‌లలో వాల్యూ స్పోర్ట్స్ ప్యాక్ కూడా ఉన్నాయి. ఇది నెలకు 360 రూపాయల ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క సెకండరీ కనెక్షన్ ఒక నెలకి రూ.277 ధరకు లభిస్తుంది. ఈ ప్లాన్ కోసం 6 నెలలు మరియు 11 నెలల చందా రూ .2,164 మరియు రూ .3,964 ఖర్చు అవుతుంది.

రాబోయే రోజుల్లో DTH కస్టమర్లకు డిష్ టివి ఉత్తమ ఎంపిక ఎందుకు??

హెచ్‌డి ప్లాన్‌లు

హెచ్‌డి ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి నుండి కొన్ని హెచ్‌డి ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఇవి 6 నెలలు లేదా 11 నెలల చెల్లుబాటు కాలానికి అందుబాటులో ఉన్నాయి. వీటిలో దబాంగ్ స్పోర్ట్స్ హెచ్‌డి ప్యాక్, వాల్యూ స్పోర్ట్స్ లైట్ హెచ్‌డి ఉన్నాయి. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మెగా ప్యాక్ హెచ్‌డి కూడా అందిస్తుంది. ఇది నెలవారి ధర రూ.699. మరియు 6 నెలలకు రూ.4,204 మరియు మొత్తం సంవత్సరానికి రూ.7,697 ధర వద్ద లభిస్తుంది.

ఇతర ఆపరేటర్లు

ఇతర ఆపరేటర్లు

టాటా స్కై వంటి ఇతర ఆపరేటర్లు కూడా తమ చందాదారులకు మొదట ఇటువంటి దీర్ఘకాలిక ఛానల్ ప్యాక్‌లను అందించేవారు. కాని టాటా స్కై దాని దీర్ఘకాలిక ఛానల్ ప్యాక్‌లను పూర్తిగా తగ్గించింది. ఈ ప్యాక్‌లు ఎంచుకున్న భాషలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సన్ డైరెక్ట్ వంటి ఇతర డిటిహెచ్ ఆపరేటర్లు అలాంటి ప్యాక్‌లను అందించడం లేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel Digital TV Has Been Offering Long-Term Channel Packs, Unlike Other DTH Operators

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X