జియోకి సవాల్: రూ. 29కే నెలంతా ఇంటర్నెట్

Written By:

ఇప్పుడు అన్ని కంపెనీలు డేటాపై ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జియో దెబ్బకి ఎక్కడివక్కడ రేట్లు భారీగా తగ్గించి కష్టమర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో ఎయిర్ టెల్ చేరింది. మహీనే బర్కా ఇంటర్నెట్ పేరుతో వచ్చిన ఈ ఆఫర్ ద్వారా మీరు నెలంతా ఇంటర్నెట్ లో గడిపేయవచ్చు.

డేటా ఆఫర్ల సునామి..కష్టమర్లకు ప్రతిరోజూ పండగే

జియోకి సవాల్: రూ. 29కే నెలంతా ఇంటర్నెట్

ఇందులో భాగంగా వినియోగదారులు 30 రోజుల పాటు 75 ఎంబీ 2 జీ, 3 జీ, 4 జీ డేటాను పొందవచ్చు. అందుబాటు ధరలో ఎంట్రీ లెవెల్ ప్యాక్తో ఎక్కువ రోజులు ఆన్లైన్లో ఉండాలని కోరుకునే వారి కోసం దీనిని అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ తెలిపింది. ప్రీ-పెయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. మరింతమంది మొబైల్ సబ్ స్క్రైబర్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో సంస్థ ఈ ప్రత్యేక ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. కష్టమర్లకు ఇప్పుడు ఆఫర్లలో లభిస్తున్న డేటా ప్యాక్ లు ఇవే.

రిలయన్స్ జియో vs బీఎస్ఎన్ఎల్:పోల్చి చూస్తే జియోకి షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

1జిబి 4జీ డేటా

రిలయన్స్ :రూ. 50, ఎయిర్ టెల్ : రూ.255 ,వొడాఫోన్ : రూ. 255, ఐడియా : రూ.246 ( అన్ని చోట్లా కాదు)

ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడితో ఉంటుంది. నైట్ ఎటువంటి బెనిఫిట్స్ లేవు.

#2

2 జిబి 4జీ డేటా
రిలయన్స్ : N/A
ఎయిర్ టెల్ : రూ.455
వొడాఫోన్ : రూ. 359
ఐడియా : రూ.455 ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడితో ఉంటుంది.
నైట్ ఎటువంటి బెనిఫిట్స్ లేవు.

#3

4జిబి 4జీ డేటా
రిలయన్స్ : రూ. 499
ఎయిర్ టెల్ : రూ.755
వొడాఫోన్ : రూ. 559
ఐడియా : రూ.755 ( అన్ని చోట్లా కాదు)
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడితో ఉంటుంది. నైట్ ఎటువంటి బెనిఫిట్స్ లేవు.

#4

రూ. 1000కు ఎంత 4జీ డేటా..?
రిలయన్స్ : 10జిబి డేటా ( 28 రోజులు )నైట్ ఫ్రీ డేటా + వాయిస్ కాల్స్ + ఎసెమ్మెస్
ఎయిర్ టెల్ : 10 జిబి డేటా ( 30 రోజులు)
వొడాఫోన్ : 10 జిబి డేటా ( 28 రోజులు)
ఐడియా : 6 జిబి ( 28రోజులు)

#5

రూ. 1500కు ఎంత 4జీ డేటా..?

రిలయన్స్ : 20జిబి డేటా

ఎయిర్ టెల్ : N/A

వొడాఫోన్ : 15 జిబి డేటా ఐడియా : 11.5 జిబి

#6

రూ. 2000కు ఎంత 4జీ డేటా..?

రిలయన్స్ : 24జిబి డేటా

ఎయిర్ టెల్ : N/A వొడాఫోన్ : 20జిబి డేటా

ఐడియా : 16 జిబి

#7

రూ. 2000 పైన టారిప్ ప్లాన్లు
రిలయన్స్ జియో ,వొడాఫోన్ లు మాత్రమే రూ. 2000 పైన టారిప్ ప్లాన్లు అందిస్తున్నాయి. మిగతా నెట్ వర్క్ లు 2000 పైన ఎటువంటి టారిప్ ప్లాన్లు అందిచడ్ లేదు. రిలయన్స్ జియో 75 జిబి రూ. 4999 కి అందిస్తోంది. దీంతో పాటు జియో యాప్ లో జియో సినిమాని కంటెంట్ కూడా లభిస్తుంది.

#8

మిగతా నెట్ వర్క్ లు జియోకి ధీటుగా ఆఫర్లను ఎప్పుడు ప్రకటిస్తాయనే ఇప్పట్లో సంచలనం రేపుతున్న ప్రశ్న. ఇక పై అన్నింటి డేటా ప్లాన్లు పోల్చి చూస్తే ఖచ్చితంగా రిలయన్స్ ముందు వరుసలో ఉంది. అన్ లిమిలెడ్ నైట్ డేటాను జియో ప్లాన్ లో పొందుపరచింది. వాయిస్ కాల్స్ కూడా ఫ్రీగా ఇస్తోంది. ముందు ముందు ఏది దూసుకుపోతుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Airtel is giving 3g internet for 1 month in just rs 29
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot