Airtel యూజర్లకు శుభవార్త!!! రూ.79 ధరకే ZEE5 సబ్స్క్రిప్షన్ ఉచితంగా...

|

ఇండియాలోని టెలికామ్ రంగంలో ఎయిర్‌టెల్ సంస్థ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన వినియోగదారుల కోసం రూ.289 ధర వద్ద కొత్తగా మరొక ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ సంస్థ ఇప్పుడు తన ప్లాన్ లతో ZEE5 యొక్క సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నది. మే నెలలో ఎయిర్‌టెల్ ZEE5 తో భాగస్వామ్యంను పంచుకున్నది.

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఇది వరకు తన వినియోగదారులకు 149 రూపాయల కంటే ఎక్కువ ధర గల అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ZEE5 ప్రీమియం సభ్యత్వాన్ని అందించడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు రూ.79 స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్‌లతో కూడా ZEE5 సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్నది. ఎయిర్‌టెల్ కొత్తగా ప్రారంభించిన ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు కొత్తగా అందిస్తున్న రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు, 1.5GB రోజువారీ డేటా మరియు రోజుకు 100 SMS‌లను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్రయోజనాలతో పాటు ఈ ప్లాన్ ZEE5 కేటలాగ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఉచిత హెలోటూన్స్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ నుండి ఉచిత ఆన్‌లైన్ కోర్సులు మరియు 150 రూపాయల ఫాస్టాగ్‌ క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితా

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితా

ఎయిర్‌టెల్ యొక్క రూ .289 రీఛార్జ్ ప్లాన్ యొక్క అన్ని ప్రయోజనాలు రూ.249 ప్లాన్‌కు సమానంగా అందిస్తున్నది. రాబోయే రోజుల్లో కంపెనీ రూ.249 ప్లాన్‌తో Zee5 యొక్క ఉచిత సభ్యత్వాన్ని ఇవ్వడం ఆపివేయనున్నది. Zee5 సభ్యత్వం కావలసిన వినియోగదారులు కొత్తగా ప్రారంభించిన రూ.289 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఎయిర్‌టెల్ 249 నుండి 400 రూపాయల మధ్య విస్తృత ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. కొత్త రీఛార్జ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రీపెయిడ్ చందాదారులకు అందుబాటులో ఉంది.

ఎయిర్‌టెల్ - Zee5 సబ్స్క్రిప్షన్

ఎయిర్‌టెల్ - Zee5 సబ్స్క్రిప్షన్

స్మార్ట్‌ఫోన్‌లలో డిజిటల్ కంటెంట్ వినియోగం భారీగా పెరగడంతో ఎయిర్‌టెల్ యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌లతో వినియోగదారులు ప్రత్యేక చందా ఛార్జీల నిర్వహణ గురించి ఆందోళన చెందకుండా ZEE5 యొక్క కంటెంట్‌ను ఉచితంగా యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తున్నాయి. ఎయిర్టెల్ 4G ద్వారా వినియోగదారులు ఈ ప్రత్యేకమైన కంటెంట్ సమర్పణను ఆస్వాదించవచ్చు అని భారతి ఎయిర్‌టెల్ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ తెలిపారు.

ఎయిర్‌టెల్ రూ.79 ప్రీపెయిడ్ ప్లాన్ ZEE5 కంటెంట్‌ ప్రయోజనం

ఎయిర్‌టెల్ రూ.79 ప్రీపెయిడ్ ప్లాన్ ZEE5 కంటెంట్‌ ప్రయోజనం

ఎయిర్‌టెల్ కొత్తగా రూ.289 ప్లాన్‌ను ప్రారంభించడంతో పాటు రూ.79 టాప్-అప్ ప్యాక్‌లో ఇప్పుడు కొన్ని మార్పులను కూడా చేసారు. ఇందులో భాగంగా ఇది Zee5 యొక్క కేటలాగ్‌కు 30 రోజుల పాటు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లోని డిజిటల్ స్టోర్ విభాగం ద్వారా ఎయిర్‌టెల్ కస్టమర్లందరికీ సౌకర్యవంతమైన ఈ టాప్-అప్ లభిస్తుందని ఎయిర్‌టెల్ సంస్థ తెలిపింది. ఈ రెండు ప్లాన్ లను అన్ని ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్ ద్వారా కూడా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel Launched Rs 79 and Rs 289 new Prepaid Plans with ZEE5 Subscription Offer

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X