భారతదేశపు ప్రముఖ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్ టెల్ తమ పోస్ట్-పెయిడ్ కనెక్షన్ ల కోసం lsquo;మైప్లాన్ ఫ్యామిలీ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పోస్ట్-పెయిడ్ పథకాన్ని ఒకే కుటుంబంలోని అయిదుగురు సభ్యులు వినియోగించుకోవచ్చు. మూడు రెంటల్ ప్లాన్ ఆప్షన్ లలో (రూ.799, రూ.999, రూ.1599) అందుబాటులో ఉన్న ఈ మైప్లాన్ ఫ్యామిలీ పథకాన్ని ముందుగా కుటుంబంలోని ఒకరు తమ వినియోగానికి అనుగుణంగా రెంటల్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుని యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది. యాక్టీవేట్ అయిన తన మైప్లాన్ కు 5 మొబైల్ అకౌంట్ లను జతచేసుకోవచ్చు. ఈ ఐదు ఖాతాలూ పోస్ట్-పెయిడ్ అయి ఉండాలి. గూగుల్ లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే వాట్సాప్ లాంటివే ఇవి కూడా..! ఈ పథకం ద్వారా లభించే కాల్స్ నిమిషాలు, ఇంటర్నెట్ డేటా, ఎస్ఎంఎస్ లను అందరూ షేర్ చేసుకోవచ్చు. ఇందువల్ల మొబైల్ ఫోన్ బిల్లులను మరింత ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్ చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.