ఎయిర్‌టెల్ & వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌లు...ధరల పెంపులో పోటా పోటీ

|

ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా సంస్థలు ఇప్పుడు తమ టారిఫ్ ధరలను పెంచాయి. ఈ రెండు సంస్థల యొక్క పెరిగిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లు ఇప్పుడు దేశంలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఇద్దరు టెలికాం ఆపరేటర్లు తమ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా వివిధ రకాల ధరల విభాగాలలో ప్రీపెయిడ్ రీఛార్జ్ వోచర్‌లను అందిస్తున్నారు.

అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు
 

ఎయిర్‌టెల్ యొక్క అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు రూ.149 - రూ. 2,398 మధ్య ఉండగా వోడాఫోన్ ఐడియా యొక్క అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు రూ.149 - రూ.2,399 మధ్య లభిస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా మరియు ఎయిర్‌టెల్ నుండి వచ్చిన తాజా ప్లాన్‌లు ఒకదానికొకటి ఎలా పోటీ పడుతున్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టాడు... రాత్రికి రాత్రి వరల్డ్ ఫెమస్ అయ్యాడు

ఎయిర్‌టెల్ రూ.148 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ. 149 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.148 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ. 149 ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క రూ.148 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో అపరిమిత కాలింగ్, నెలకు 2GB డేటా మరియు 300 రోజువారీ SMSల ప్రయోజనాలను అందిస్తుంది. మరోవైపు వోడాఫోన్ ఐడియా యొక్క రూ.149 ప్లాన్‌ కూడా అదే 28 రోజుల వాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 1,000 నిమిషాల FUP), మొత్తం నెలకు 2GB డేటా మరియు రోజుకు 300 SMS ప్రయోజనాలను అందిస్తుంది.

5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు ఎలా ఉన్నాయో తెలుసా

ఎయిర్‌టెల్ రూ.248 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.249 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.248 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.249 ప్లాన్

కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్ రూ. 248 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 1.5GB డేటా మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. మరొక వైపు వోడాఫోన్ ఐడియా యొక్క రూ.249 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 1,000 నిమిషాల FUP), రోజుకు 1.5GB డేటా మరియు రోజుకు 100 SMSలు వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.298 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.299 ప్లాన్
 

ఎయిర్‌టెల్ రూ.298 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.299 ప్లాన్

ఎయిర్టెల్ యొక్క రూ.298 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. కానీ రోజువారీ డేటా ప్రయోజనం 2GB గా అందిస్తుంది. మిగిలిన ప్రయోజనాలలో అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా ఉన్నాయి. వోడాఫోన్ యొక్క రూ.299 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 1,000 నిమిషాల FUP), రోజుకు 2GB డేటా మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది.

1 నిమిషంలో 80% వరకు బ్యాటరీని ఛార్జ్ చేసే టెక్నాలజీ...

ఎయిర్‌టెల్ రూ.598 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.599 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.598 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.599 ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క రూ.598 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. మిగిలిన అదనపు ప్రయోజనాలలో అపరిమిత కాలింగ్, 1.5GB రోజువారీ డేటా మరియు రోజుకు 100 SMSలు ఉన్నాయి. మరోవైపు వోడాఫోన్ ఐడియా యొక్క రూ.599 టారిఫ్ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది.ఇది అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 3,000 నిమిషాల FUP), రోజుకు 1.5GB డేటా మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.698 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.699 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.698 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.699 ప్లాన్

ఎయిర్టెల్ అందించే కొత్త రూ.698 ప్లాన్ 84 రోజుల వాలిడిటీను కలిగి ఉండగా ఇది అందించే ప్రయోజనాలలో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు మరియు రోజుకు 2 జిబి డేటాను అందిస్తుంది. వోడాఫోన్ ఐడియా యొక్క రూ.699 ప్లాన్ అదే 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 3,000 నిమిషాల FUP), రోజుకు 2GB డేటా మరియు 100 SMSలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.1498 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.1499 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.1498 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.1499 ప్లాన్

ఎయిర్టెల్ అందించే కొత్త రూ.1498 ప్లాన్ 365 రోజుల వాలిడిటీను కలిగి ఉండగా ఇది అందించే ప్రయోజనాలలో అపరిమిత కాలింగ్ మరియు మొత్తం చెల్లుబాటు కాలానికి 3600 SMSలు మరియు 24 జిబి డేటాను అందిస్తుంది. వోడాఫోన్ ఐడియా యొక్క రూ.1499 ప్లాన్ అదే 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 12,000 నిమిషాల FUP) మరియు మొత్తం చెల్లుబాటు కాలానికి 24GB డేటా మరియు 3600 SMSలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.2398 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.2399 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.2398 ప్లాన్ VS వోడాఫోన్ ఐడియా రూ.2399 ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క రూ.2,398 ప్లాన్ ఏడాది పొడవునా చెల్లుబాటును కలిగి ఉంటుంది. ఇది అపరిమిత కాలింగ్,రోజువారి 100 SMSలు మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. మరోవైపు వోడాఫోన్ ఐడియా యొక్క రూ.2,399 టారిఫ్ ప్లాన్ కూడా 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది కూడా అపరిమిత వాయిస్ కాల్స్ (ఆఫ్-నెట్ కాల్స్ కోసం 12,000 నిమిషాల ఎఫ్‌యుపి), రోజుకు 1.5 జిబి డేటా మరియు రోజుకు 100SMSల ప్రయోజనాలను అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel New Plans VS Vodafone Idea New Plans: Check Full Details Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X