Airtel Recharge Queue ప్రీపెయిడ్ ప్లాన్స్ ... కొంత కాలం కొత్త ధరకు గుడ్ బై

|

టెలికాం కంపెనీలు అన్ని తమ ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను డిసెంబర్ 1 నుండి పెంచడానికి రంగం సిద్ధం చేసుకోవడంతో చందాదారులు ధరల విషయంలో కాస్త డైలమాలో పడ్డారు. టెల్కో సంస్థలు ఇప్పటికే ధరల పెరుగుదలను ఎంత మొత్తంలో పెంచుతున్నారో కూడా ఊహాగానాలు వచ్చాయి.ఎయిర్‌టెల్ సంస్థ కూడా తన ధరల పెరుగుదలను ప్రకటించింది.

 

అపరిమిత కాల్స్

ధరల పెరుగుదలకు ముందు కొంత కాలం ఊరటను ఇవ్వడానికి రిలయన్స్ జియో ఇప్పటికే ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అపరిమిత కాల్స్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల రీఛార్జ్ లను వరుసగా రెండిటిని క్యూలో ఉంచగలిగే ప్రయోజనాన్ని తన కస్టమర్లకు అందిస్తోంది. ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్ కూడా జియో అందిస్తున్న తరహాలోనే తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం లాంగ్ టర్మ్ ప్లాన్ లను రెండిటిని ఒకదాని తరువాత ఒకటి క్యూలో ఉంచడానికి అనుమతిని కలిపిస్తోంది.

 

Reliance Jio Queue Recharge...ఒకే సారి రెండు రీఛార్జిలకు అనుమతిReliance Jio Queue Recharge...ఒకే సారి రెండు రీఛార్జిలకు అనుమతి

జియో
 

జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా తమ వినియోగదారులకు అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్‌లను క్యూ ఉంచడానికి అనుమతిస్తుంది. తద్వారా ప్రస్తుత రీఛార్జ్ గడువు ముగిసిన తర్వాత తదుపరి రీఛార్జ్ ఆటోమ్యాటిక్ గా యాక్టివేట్ అవుతుంది. రిలయన్స్ జియో మాదిరిగానే అపరిమిత కాంబో ప్లాన్‌లను మాత్రమే క్యూలో ఉంచడానికి ఎయిర్‌టెల్ వినియోగదారులను అనుమతిస్తుంది. భారతి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్ గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Vodafone Long Term Plans ధరల పెంపుపై వోడాఫోన్ యూజర్లకు కొంత కాలం ఊరటVodafone Long Term Plans ధరల పెంపుపై వోడాఫోన్ యూజర్లకు కొంత కాలం ఊరట

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్

డిసెంబర్ 1 నుండి ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌ల మీద కనీసం 15-20% పెరుగుదలను పొందనున్నది. అంటే ప్రస్తుతం రూ.199 ధర వద్ద వున్న ఒక ప్లాన్ 219 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ధరను కలిగి ఉండవచ్చు. ప్రీపెయిడ్ విభాగంలో రిలయన్స్ జియో మొదటి స్థానంలో ఉంది. రీఛార్జీల పరంగానే కాదు ఈ టెల్కో చిన్న చిన్న ప్రయోజనాలను కూడా మొదటిగా ప్రారంభిస్తుంది. ఉదాహరణకు ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్ ఫీచర్‌ను దేశంలో మొట్టమొదటిగా ప్రారంభించింది. ఇప్పుడు దీనిని భారతి ఎయిర్‌టెల్ కూడా అనుసరిస్తోంది.

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ కొంతకాలంగా ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్‌ ఫీచర్‌ను అనుమతిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ వినియోగదారుల్లో ఎక్కువ మందికి ఈ ఫీచర్ గురించి తెలియదు. దాని నెట్‌వర్క్‌లో ప్లాన్ క్యూయింగ్ ఎలా పనిచేస్తుందనే సమాచారాన్ని తెలియజేస్తున్నాము. ఉదాహరణకు ఒక ఎయిర్‌టెల్ కస్టమర్ ఇప్పటికే రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జిలో ఉన్నాడు అనుకోండి. ప్యాక్ యొక్క చెల్లుబాటు రెండు రోజులు మిగిలి ఉండగానే కస్టమర్ కాస్త ముందుగా అలోచించి ప్రస్తుత ప్లాన్ గడువుకు ముందే అదే రూ.399 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే కనుక కొత్తగా రీఛార్జ్ చేసిన ప్యాక్ క్యూలో ఉంటుంది. అంటే ప్రస్తుతం వున్న ప్యాక్ గడువు ముగిసిన రెండు రోజుల తర్వాత కొత్త ప్యాక్ ఆటొమ్యాటిక్ గా యాక్టివేట్ అవుతుంది.

 ప్రీపెయిడ్ ప్లాన్‌

ఎయిర్‌టెల్ కస్టమర్లు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.1,699ను కూడా క్యూలో ఉంచవచ్చు. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అధికారికంగా ధృవీకరించారు. కానీ ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను క్యూలో ఉంచడానికి ఎయిర్‌టెల్ కస్టమర్లు అపరిమిత కాంబో ప్లాన్‌లో ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకు 245 రూపాయల స్మార్ట్ రీఛార్జిపై ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్ అపరిమిత కాంబో ప్లాన్‌ను రూ. 199 లేదా రూ.399 లేదా మరే ఇతర ప్లాన్‌ను క్యూలో రీఛార్జ్ చేయలేరు దీనిని బాగా గమనించాలి.

 ప్రీపెయిడ్ ప్లాన్‌

రూ.597, రూ .998 ప్రీపెయిడ్ ప్లాన్‌లను క్యూ చేయడానికి ఎయిర్‌టెల్ వినియోగదారులను అనుమతించవచ్చు. కస్టమర్ ఇప్పటికే అపరిమిత కాంబో ప్లాన్‌లో ఉంటే రూ .1,699 రీఛార్జిని క్యూ చేయవచ్చు. అదనంగా కస్టమర్ ఈ ఫీచర్‌తో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వారు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కంపెనీతో సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.

 

Airtel Digital TV లాంగ్ టర్మ్ ప్యాక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లుAirtel Digital TV లాంగ్ టర్మ్ ప్యాక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎలా క్యూ చేయాలి?

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎలా క్యూ చేయాలి?

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను క్యూ చేయడం చాలా సులభం అలాగే ఇది సూటిగా కూడా ఉంటుంది. మీరు అపరిమిత కాంబో ప్లాన్ వినియోగదారు అయితే మీరు మరొక రీఛార్జ్ ను క్యూలో ఉంచాలనుకుంటే రీఛార్జ్ పూర్తి చేయడానికి ఏదైనా రీఛార్జ్ పోర్టల్ ( ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా పేటీఎం లేదా ఏదైనా ఇతర రీఛార్జ్ పోర్టల్) కు వెళ్లి రీఛార్జ్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel Now Letting Users With Queue Prepaid Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X