వోడాఫోన్,ఎయిర్టెల్,జియో రీఛార్జ్ ప్లాన్ ధరలను ఎంత పెంచుతున్నాయో తెలుసా

|

ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వానికి అనుకూలంగా AGR నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత వోడాఫోన్ ఐడియా దాని టారిఫ్ సేవల ధరలను పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. వెనువెంటనే ఎయిర్టెల్ కూడా ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే జియో కూడా మార్కెట్ లో తన మనుగడను కొనసాగించడానికి టారిఫ్ ధరల పెరుగుదల అవసరమని భావించి తన నిర్ణయం ప్రకటించింది.

టెలికామ్ కంపెనీలు
 

ఈ మూడు టెలికామ్ కంపెనీలు త్వరలో తమ టారిఫ్ ధరలను పెంచడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో వినియోగదారులు ఎంత మొత్తం అదనంగా చెల్లించాల్సి వస్తుందో అన్న ఆలోచన అందరికి వచ్చింది. ఇప్పుడు ఆ విషయమై ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టెలికాం ఆపరేటర్లకు రెండేళ్ల తాత్కాలిక నిషేదం ఇచ్చిన కేంద్రం

డెక్కన్ హెరాల్డ్ నివేదిక

డెక్కన్ హెరాల్డ్ నుండి వచ్చిన ఒక నివేదిక ప్రకారం ఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్ ఐడియా కస్టమర్లు భవిష్యత్తులో తమ అన్ని రీఛార్జ్ ప్లాన్లపై అదనంగా 20 శాతం చెల్లించవలసి ఉంటుంది. అన్ని రీఛార్జ్ ప్లాన్ లకు 20 శాతం వరకు ధరల పెరుగుదల ఉంటుందని పరిశ్రమకు చెందిన వివిధ వర్గాలు ధృవీకరించాయని ఈ నివేదిక పేర్కొంది. అయితే ధరల పెరుగుదల రీఛార్జ్ ప్లాన్‌ల ధరపై ఆధారపడి ఉంటుంది.

Amazon Fire TV Stickను ఉచితంగా అందిస్తున్న టాటా స్కై

 రీఛార్జ్ ప్లాన్‌లు

అందువల్ల తక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్‌లు తక్కువ పెరుగుదలను చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కువ ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లు ఎక్కువ డేటాను మరియు ఉచిత వాయిస్ కాల్‌లను అందించడంతో పాటుగా వీటిని పొందడానికి ఇప్పుడు అదనంగా 20 శాతం ఖర్చు చేయవలసి ఉంటుంది. అన్ని టెల్కోలు పెరుగుతున్న ప్రాతిపదికన ధరలను పెంచాలని యోచిస్తోంది. అంటే తక్కువ ధర గల ప్లాన్ లకు తక్కువ పెంపు మరియు అధిక ధర ప్లాన్లకు అధిక పెంపు అని నివేదిక పేర్కొంది.

Vodafone Long Term Plans ధరల పెంపుపై వోడాఫోన్ యూజర్లకు కొంత కాలం ఊరట

ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌
 

అంటే టెలికాం ఆపరేటర్లు అన్ని ధరల పెంపు వర్గాలలో ఏకరీతి ధరల పెంపు ఉండే అవకాశం ఉంది. ఇది సాధారణంగా ఫోన్ బిల్లుల కోసం రూ.100 కంటే తక్కువ ఖర్చు చేసేవారిని ప్రభావితం చేస్తుంది. జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ప్రస్తుతం ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను రూ .50 నుంచి రూ .10,000 వరకు అందిస్తున్నాయి. వీటిలో నెలవారీ ప్లాన్లు మరియు దీర్ఘకాలిక వార్షిక ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు వర్తించే ప్రత్యేక డేటా వోచర్‌లతో పాటు అకౌంట్ బ్యాలెన్స్ ప్యాక్‌లపై కూడా ధరల పెంపు వర్తిస్తుంది.

ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు

ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయుసి) వల్ల కలిగే నష్టాలను భరించలేక పోయినందున రిలయన్స్ జియో ఇటీవలే తన వినియోగదారుల నుండి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్గోయింగ్ కాల్స్ కోసం కొద్ది మొత్తంలో వసూలు చేయడం ప్రారంభించింది. ఎయిర్టెల్, వొడాఫోన్ మరియు బిఎస్ఎన్ఎల్ నంబర్లకు కాల్ చేయడానికి జియో కస్టమర్లు నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే జియో-టు-జియో కాల్స్ ఇప్పటికీ ఉచితంగా అందిస్తున్నది. జియో కస్టమర్లు దాని సేవలను ఉపయోగించటానికి కనీసం 10 రూపాయలు అదనంగా చెల్లించాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vodafone, Airtel, Jio New Recharge Plan Prices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X