అన్‌లిమిటెడ్ కాల్స్, 18జీబి మొబైల్ డేటా

రిలయన్స్ జియో అన్‌లిమిటెట్ వాయిస్‌ కాల్ ఆఫర్‌కు పోటీగా భారతి ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా 28 రోజుల పాటు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ 28 రోజుల వ్యవధిలో 18జీబి వరకు 3జీ/4జీ మొబైల్ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.

Read More : అమ్మకానికి రూ.2000 నోటు, ఎంతో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కాల్ డ్రాప్ సమస్యలు జియోను వేధిస్తోన్న నేపథ్యంలో..

కాల్ డ్రాప్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో జియో కాల్ టైమింగ్‌ను 30 నిమిషాలకు కుదించిన విషయం తెలిసిందే. కాల్ కనెక్ట్ అయి 30 నిమిషాలు పూర్తికాగానే ఆటోమెటిక్‌గా డిస్కనెక్ట్ కాబడుతుంది.

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌లో ఇలాంటి సమస్య ఉండదు..

ఎయిర్‌టెల్‌ అందించే ఈ ఆఫర్‌లో ఈ విధమైన సమస్య ఉండదు. కాల్స్ నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. రూ.2,249 పెట్టి రీఛార్జ్ చేయించటం ద్వారా ఈ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ యూజర్లు పొందవచ్చు.

ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు..

28 రోజుల వ్యాలిడిటీతో వర్తించే ఈ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌టెల్ నెంబర్లతో పాటు వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, ఆర్‌కామ్, ఎయిర్‌సెల్, డొకోమో వంటి నెట్‌వర్క్‌లకు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. నోరు విప్పిన నోకియా

ఈ ఆఫర్‌ను పొందేందుకు ఎయిర్‌టెల్ యూజర్లు ఏం చేయాలంటే..?

స్టెప్ 1

ముందుగా మీ ఎయిర్‌టెల్ నెంబర్ నుంచి #121*1#కు డయల్ చేయండి. ఆఫర్ మీ నెంబర్‌కు అందుబాటులో ఉందో లేదో తెలిసిపోతుంది.

 

స్టెప్ 2

MyAirtel యాప్‌ను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయండి. యాప్ ద్వారా మీ ఎయిర్‌టెల్ అకౌంట్‌లోకి లాగిన్ అయిన తరువాత "Special Offer" ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

అక్కడ కనిపించే స్పెషల్ ఆఫర్స్ లో భాగంగా Rs.2,249 రీఛార్జ్ ఆఫర్ పై క్లిక్ చేయండి. పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ కార్డ్ వివరాలను ఎంటర్ చేసిన పే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4

ఆఫర్ మీ నెంబర్‌కు యాక్టివేట్ అవటానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది.

మీరు గుర్తుపెట్టుకోవల్సిన విషయాలు..

ఈ ఆఫర్ ఎంపిక చేసిన ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. కేవలం 3జీ/4జీ నెట్‌వర్క్‌లకు మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. మళ్లీ ఆఫర్‌ను పొందాలనుకుంటే పైన పేర్కొన్న ప్రొసీజర్‌ ద్వారా మళ్లీ రూ.2,249 పెట్టి రీఛార్జ్ చేయించుకోవల్సి ఉంటుంది. డిసెంబర్ 3 తరువాత Jio నుంచి మరో ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Offers Unlimited Calls To Any Network. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting