Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా డేటా వోచర్‌లు!!!
ఇండియాలోని టెలికామ్ సంస్థలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన వినియోగదారుల కోసం కొన్ని డేటా కూపన్‌లను ఉచితంగా అందిస్తున్నది. ఈ ఉచిత డేటా కూపన్‌లను కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందిస్తున్నది. ఇప్పుడు టెల్కో తన ఆఫర్‌ను వినియోగదారులు అధికంగా రీఛార్జ్ చేసుకుంటున్న రూ.289, రూ.448 మరియు రూ.599 ప్లాన్‌లకు కూడా విస్తరించింది. ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో దేనినైనా కొనుగోలు చేసినప్పుడు వారికి డేటా కూపన్లు ఉచితంగా లభిస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ ఉచిత డేటా కూపన్‌ల వివరాలు
ఎయిర్‌టెల్ యొక్క రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ కొత్తది కాదు. ఈ ప్లాన్ వినియోగదారులకు ముందునుంచి కూడా అందించబడుతోంది. ZEE5 ప్రీమియం యొక్క OTT ప్రయోజనంను అందిస్తున్న ఏకైక ప్లాన్ ఇది కావడం గొప్ప విషయం. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 28 రోజుల చెల్లుబాటు కాలంలో రెండు 1GB డేటా వోచర్‌లను ఉచితంగా పొందుతారు. రూ.289 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలంలో అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100SMS లతో రోజువారీ 1.5GB డేటా ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్ ఉచిత డేటా కూపన్‌ల వివరాలు
ఎయిర్‌టెల్ యొక్క రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికొస్తే ఎయిర్‌టెల్ యొక్క కొత్త ఆఫర్‌లలో భాగమైన డిస్నీ + హాట్‌స్టార్ VIP ఒక సంవత్సరం చందాను ఉచితంగా అందిస్తుంది. అలాగే రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్ రెండు 1GB డేటా వోచర్‌లను అదనంగా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో రోజువారి 3GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ ఉచిత డేటా కూపన్‌లు
ఎయిర్‌టెల్ యొక్క రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనంను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారుడు 56 రోజుల చెల్లుబాటుతో నాలుగు 1GB డేటా కూపన్‌లను పొందుతాడు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు యాక్సిస్ ను కలిగి ఉంది. ఇది 2GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. కస్టమర్ ఎవరైనా సరే డేటా వోచర్‌ను రీడీమ్ చేసిన ఓక రోజులోనే దాని ప్రయోజనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ఉచిత డేటా వోచర్‌లు
ఎయిర్‌టెల్ సంస్థ మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో కాంప్లిమెంటరీ డేటా వోచర్‌లను ఉచితంగా అందిస్తుంది. రూ .219, రూ .249, రూ .279, రూ .289, రూ .298, రూ. 349, రూ .398, రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్‌లు 28 రోజుల చెల్లుబాటుతో రెండు 1GB డేటా వోచర్‌లను అందిస్తాయి. అలాగే రూ .339, రూ .449, రూ .558, మరియు రూ .599 ప్రీపెయిడ్ ప్లాన్‌లు 56రోజుల చెల్లుబాటు కాలంతో నాలుగు 1GB డేటా వోచర్‌లను అందిస్తాయి. చివరిగా రూ.598 మరియు రూ.698 ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఆరు 1GB వోచర్లను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తాయి.


Click it and Unblock the Notifications








