Home
News

Airtel Xstream Fiber లాంగ్-టర్మ్ ప్లాన్‌ల మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్....

ప్రస్తుతం ఇండియాలో కొనసాగుతున్న లాక్ డౌన్ దృష్ట్యా మీరు ఇంటి వద్ద నుండి పని చేస్తుంటే కనుక మీరు ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేయడానికి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. ఈ సమయంలో మీరు అనేక వీడియో మీటింగులకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్

వినోదం కోసం మరియు వివిధ రకాల అవసరాల కోసం అధిక కంటెంట్‌తో ఆన్‌లైన్ కంటెంట్‌ను బఫర్ చేయడానికి మీకు అధిక ఇంటర్నెట్ వేగంతో లభించే కనెక్షన్ అవసరం. ఫైబర్ కనెక్షన్ సహాయంతో ఇవన్నీ సాధ్యమే. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ మీకు 1 Gbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. అటువంటి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులలో ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కూడా ఒకటి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ లాంగ్ టర్మ్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ లాంగ్ టర్మ్ ప్లాన్

వినియోగదారులకు అవసరమైన స్థితులలో డేటాను అందించే విభిన్న ప్లాన్ లు ఉన్నాయి. వీటిలో 100 Mbps నుండి 1 Gbps వరకు వేగంతో లభించే ఇంటర్నెట్ ప్లాన్లు ఉన్నాయి. వారి బిల్లులపై తగ్గింపు కోరుకునే కస్టమర్లు 6 నెలల లేదా 12 నెలల లాంగ్ టర్మ్ ప్లాన్ లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీరు దీర్ఘకాలిక ప్లాన్ ల కోసం వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి తగ్గింపు లభిస్తుందో లభిస్తుందో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌ల వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌ల వివరాలు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ తన వినియోగదారులకు నాలుగు ప్లాన్‌లను అందిస్తున్నది. ఈ ప్లాన్‌లు నెలకు రూ.799 నుండి 3,999 రూపాయల ధరను కలిగి ఉన్నాయి. టెల్కో యొక్క మొదటి మరియు ‘బేసిక్' ప్లాన్ రూ.799 ధర వద్ద 100 Mbps వేగంతో 150GB డేటాను అందిస్తుంది. ఇది ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్‌లతో కూడిన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సభ్యత్వంను ఉచితంగా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ VIP ప్లాన్‌ ధరల వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ VIP ప్లాన్‌ ధరల వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క రెండవ ప్లాన్ ‘ఎంటర్టైన్మెంట్' ప్లాన్ రూ.999 ధర వద్ద 200 Mbps వేగంతో మొత్తంగా 300GB డేటాను అందిస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి మరెన్నో ఇతర ప్రయోజనాలను కూడా ఉచితంగా అందిస్తుంది. ఇందులో గల మూడవ ప్లాన్ ‘ప్రీమియం' ప్లాన్. ఇది 500GB డేటాను 300Mbps వేగంతో రూ.1,499 ధర వద్ద అందిస్తుంది. ఇవే కాకుండా అత్యంత ఖరీదైన VIP ప్లాన్ రూ.3,999 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత డేటాను 1Gbps వేగంతో అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలలో వివిధ OTT కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లకు చందాను ఉచితంగా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌ల డిస్కౌంట్ ఆఫర్స్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌ల డిస్కౌంట్ ఆఫర్స్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క ఈ ప్లాన్లలో దేనినైనా మీరు దీర్ఘకాలికంగా కొనుగోలు చేసినప్పుడు డిస్కౌంట్లను కూడా పొందుతారు. కాబట్టి మీరు ఈ ప్లాన్‌లలో దేనినైనా 6 నెలల కాలానికి కొనుగోలు చేస్తే మీ నెలవారీ ఛార్జీపై 7.5% తగ్గింపుతో మీరు పొందవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 6 నెలల ప్లాన్ల మీద డిస్కౌంట్ వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 6 నెలల ప్లాన్ల మీద డిస్కౌంట్ వివరాలు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క బేసిక్ ప్లాన్ మీద ఆరు నెలల కాలంలో రాయితీ పొందిన తరువాత ఇది మీకు రూ.4,434 ధర వద్ద లభిస్తుంది. అంటే మొత్తంగా మీకు రూ.360 ఆదా అవుతుంది. ఎంటర్టైన్మెంట్ ప్లాన్ మీద ఆరు నెలల రాయితీలో రూ .450 ఆదా అయిన తరువాత రూ.5,544 ధర వద్ద లభిస్తుంది. అలాగే ప్రీమియం ప్లాన్ ధర ఆరు నెలల ప్లాన్ మీద రూ. 675 తగ్గింపు పొందిన తరువాత రూ.8,319 ధర వద్ద లభిస్తుంది. చివరగా VIP ప్లాన్ యొక్క ఆరు నెలల ప్లాన్ రూ.22,194 ధర వద్ద లభిస్తుంది. అంటే మీకు దీని మీద మొత్తంగా రూ.1,800 ఆదా అవుతుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 12 నెలల ప్లాన్ల మీద డిస్కౌంట్ వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 12 నెలల ప్లాన్ల మీద డిస్కౌంట్ వివరాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క ఏదైనా ప్లాన్ ను 12 నెలల చెల్లుబాటుతో కొనుగోలు చేసినచొ 15% తగ్గింపు లభిస్తుంది. మొత్తం సంవత్సరం చెల్లుబాటుకి బేసిక్ ప్లాన్ ను రూ.8,150 ధర వద్ద రూ.1,438 తగ్గింపుతో పొందవచ్చు. ఎంటర్టైన్మెంట్ ప్లాన్ సంవత్సరానికి రూ.10,190 ధర వద్ద రూ.1,798 తగ్గింపుతో పొందవచ్చు. ప్రీమియం ప్లాన్ ను మొత్తం సంవత్సరానికి రూ .2,698 డిస్కౌంట్ పొందిన తరువాత రూ.15,290 ధర వద్ద పొందవచ్చు. చివరగా 12 నెలల కాలానికి విఐపి ప్లాన్ మీద రూ .7,198 రాయితీ పొందిన తరువాత రూ.40,790 ధర వద్ద పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel Xstream Fiber Long-Term Plans Now Available at Discount Price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X