Airtel Prepaid Plans:84రోజుల వాలిడిటీతో లాక్డౌన్ సమయంలో సరైన ప్లాన్‌లు ఇవే....
ఇండియాలోని టెలికాం పరిశ్రమలో ఒకటైన ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు వివిధ రకాల చెల్లుబాటు కాలాలతో చాలా రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ చెల్లుబాటు కాలాల్లో ఎక్కువ మంది కస్టమర్లు ఇష్టపడేది 84 రోజుల వాలిడిటీ గల ప్రీపెయిడ్ ప్లాన్లు.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు
ఎయిర్‌టెల్ సంస్థ మొత్తంగా ఈ చెల్లుబాటు కాలంతో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లన్నీ ‘ట్రూలీ అన్‌లిమిటెడ్' కేటగిరీ కింద ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అందిస్తున్నాయి. అంటే ఈ ప్లాన్‌లు ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలంలో అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటుగా అద్భుతమైన డేటా ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లన్నీ అందిస్తున్న ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. JioFiber బ్రాడ్‌బ్యాండ్ యొక్క కొత్త ప్లాన్‌ల డేటా ఆఫర్స్ ఇవే...

ఎయిర్‌టెల్ రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్
ఎయిర్‌టెల్ యొక్క రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వాలిడిటీ కాలంలో లభించే చౌకైన ప్లాన్. ఈ ప్లాన్‌తో మీకు రోజువారి డేటా క్యాప్స్ లేకుండా మొత్తం కాలానికి 6GB డేటాను మాత్రమే లభిస్తుంది. మీరు ఈ ప్యాకేజీలో మొత్తంగా 900 SMSలను కూడా పొందుతారు. కానీ మీకు 84 రోజులపాటు మొత్తంగా అపరిమిత కాలింగ్ సౌకర్యంను అందిస్తుంది.

వాయిస్ కాలింగ్ ప్లాన్
మీ ఇల్లు లేదా కార్యాలయంలో వై-ఫై యొక్క డేటాను వినియోగిస్తూ ఉండి కేవలం వాయిస్ కాలింగ్ కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ కరెక్టుగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు డేటా అవసరం లేకపోతే కూడా ఇది మంచి ఎంపిక. ఎందుకంటే అత్యవసర పరిస్థితికి 6GB డేటాను కలిగి ఉండటం సరిపోతుంది. ఎయిర్‌టెల్ సంస్థ ఈ ప్లాన్ ను కొద్ది నెలల క్రితమే ప్రారంభించింది.

రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు
ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ సంస్థ వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. ఇందులో ZEE5 ప్రీమియం, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం మరియు వింక్ మ్యూజిక్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. అలాగే స్మార్ట్‌ఫోన్ కోసం యాంటీ-వైరస్ ను కూడా ఉచితంగా అందిస్తుంది. దానితో పాటు మీకు ఉచిత హెలొటూన్‌లు మరియు 28 రోజుల షా అకాడమీ ఆన్‌లైన్ కోర్సులను ఉచితంగా అందిస్తుంది. చివరిగా ఫాస్ట్‌టాగ్ లావాదేవీలపై రూ.150 క్యాష్ బ్యాక్ ను కూడా అదనంగా అందిస్తుంది. BSNL 365 రోజుల వాలిడిటీ ప్రోగ్రామ్‌లో మరో కొత్త STV డేటా ప్లాన్...

ఎయిర్‌టెల్ రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్
ఎయిర్టెల్ సంస్థ 84 రోజుల వాలిడిటీ కాలంలో అందిస్తున్న రెండవ చౌకైన లేదా ఖరీదైన ప్లాన్ ఇది. ఈ ప్లాన్ మీకు 1.5GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్న వారిలో రోజువారీ డేటా అవసరమైన వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎయిర్‌టెల్ అందిస్తున్న రోజువారి 1.5GB అయిపోయిన తర్వాత అది అర్ధరాత్రి రీసెట్ అవుతుంది.

రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు
ఎయిర్‌టెల్ రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో ZEE5 ప్రీమియం, వింక్ మ్యూజిక్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియమ్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. వీటితో పాటుగా ఉచిత హెలొటూన్లు, మీ స్మార్ట్‌ఫోన్‌కు యాంటీ-వైరస్, 28 రోజుల షా అకాడమీ ఆన్‌లైన్ క్లాసులు మరియు ఫాస్ట్‌టాగ్‌లో రూ.150 క్యాష్ బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్ నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన ప్లాన్లలో ఇది ఒకటి. రోజువారీ డేటా పరిమితితో పాటు అదనపు ప్రయోజనాలను కోరుకునే చందాదారులకు ఇది సరిగ్గా సరిపోతుంది.

ఎయిర్‌టెల్ రూ.698 ప్రీపెయిడ్ ప్లాన్
ఎయిర్‌టెల్ యొక్క రూ.698 ప్రీపెయిడ్ ప్లాన్ అనేది 84 రోజుల చెల్లుబాటుతో లభించే అత్యంత ఖరీదైన ప్లాన్. ఇది 2GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు 100 SMS / day అందిస్తుంది. అధిక వేగంతో క్రమం తప్పకుండా ఎక్కువ మొబైల్ డేటా అవసరమయ్యే వ్యక్తుల కోసం ఇది గొప్ప ప్రణాళిక. 2GB రోజువారీ డేటా ప్రతి రోజు అర్ధరాత్రి రీసెట్ అవుతుంది.

రూ.698 ప్లాన్ అదనపు ప్రయోజనాలు
ఎయిర్‌టెల్ రూ.698 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలు మిగిలిన రెండు ప్లాన్ల మాదిరిగానే ZEE5 ప్రీమియం, వింక్ మ్యూజిక్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియమ్, ఉచిత హెలొటూన్లు, మీ స్మార్ట్‌ఫోన్‌కు యాంటీ-వైరస్, 28 రోజుల షా అకాడమీ ఆన్‌లైన్ క్లాసులు మరియు ఫాస్ట్‌టాగ్‌లో రూ.150 క్యాష్ బ్యాక్ వంటివి ఉచితంగా అందిస్తుంది. రోజువారీ అధిక డేటా పరిమితితో పాటు అదనపు ప్రయోజనాలను కోరుకునే చందాదారులకు ఇది సరిగ్గా సరిపోతుంది.


Click it and Unblock the Notifications








