Airtel Life Insurance Plans: రూ.4,00,000 బీమాను ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్ ప్లాన్‌లు ఇవే!!!
ఇండియాలోని టెలికామ్ రంగంలో అధిక మంది వినియోగదారులను కలిగి ఉన్న ఆపరేటర్లలో ఇకటైన భారతి ఎయిర్‌టెల్ ప్రస్తుతం తన చందాదారులకు తమ యొక్క ప్లాన్ లతో రూ.4,00,000 ల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ను కూడా అందిస్తోంది.

Airtel Life Insurance Plans
ఎయిర్‌టెల్ సంస్థ తన రూ.179 STV మరియు రూ.279STV వోచర్లపై ఈ ప్రత్యేక బీమా పాలసీలను అందిస్తుంది. ఎయిర్‌టెల్ యొక్క ఈ రెండు వోచర్‌లపై బీమా పాలసీ 18 సంవత్సరాల నుండి 54 సంవత్సరాల వయస్సు పరిమితిలో ఉన్న వినియోగదారులకు వర్తిస్తుందని ఎయిర్‌టెల్ ప్రత్యేకంగా తెలిపింది. Also Read:Rs.30,000 పైన ధర గల స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇవే...

ఎయిర్‌టెల్ STV ప్రీపెయిడ్ ప్లాన్‌లు
వినియోగదారుడు ఈ ప్లాన్‌లలో దేనినైనా రీఛార్జ్ చేసినప్పుడు బీమా పాలసీలు ఆటొమ్యాటిక్ గ యాక్టివేట్ అవుతాయని కంపెనీ తెలిపింది. అలాగే ఎయిర్‌టెల్ అందించే ఈ పాలసీల ప్లాన్‌లను నెలవారీ ప్రాతిపదికన నిరంతరం రీఛార్జ్ చేస్తే బీమా అదనంగా వినియోగదారులను ఒక సంవత్సరం పాటు కవర్ చేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:రూ .2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో అమ్మకానికి షియోమి కొత్త ల్యాప్‌టాప్‌లు

భారతి ఎయిర్‌టెల్ రూ.179 ప్రీపెయిడ్ STV ప్లాన్
భారతి ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ.179 ప్రీపెయిడ్ STV ప్లాన్ వినియోగదారులకు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటుగా 2GB హై స్పీడ్ డేటాతో పాటు 300SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. దీనితో పాటుగా లైఫ్ ఇన్సూరెన్స్ ను కూడా అదనంగా అందిస్తుంది. భారతి ఎయిర్‌టెల్ సంస్థ భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో జతకలిసి వినియోగదారులకు ఉచిత బీమాను అందిస్తున్నది. రూ.179 STV ప్లాన్‌తో నెలసరి రూ.2,00,000 జీవిత బీమా పాలసీ ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్ భారతదేశం అంతటా గల తన చందాదారులకు చెల్లుబాటు అవుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది. అయితే వినియోగదారులు ప్రతి నెలా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

భారతి ఎయిర్‌టెల్ రూ .279 ప్రీపెయిడ్ STV ప్లాన్
భారతి ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ.279 ప్రీపెయిడ్ STV ప్లాన్ వినియోగదారులకు రోజుకు 1.5GB హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్రయోజనాలతో పాటుగా అదనంగా రూ.4,00,000ల హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ బీమాను కూడా అందిస్తుంది. నిబంధనలు మరియు షరతులలో భాగంగా వినియోగదారులు ముఖ్యంగా నెలవారీ ప్రాతిపదికన దీనిని తప్పనిసరిగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం బీమాను ఒక వ్యక్తి మరణించిన తేదీ నుండి 30 రోజులలోపు క్లెయిమ్ చేయవలసి ఉంటుంది.

ఎయిర్‌టెల్ ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనలు
కస్టమర్ అక్విజిషన్ ఫారం (CAF) లో వినియోగదారుడు సమర్పించిన డేటా ఆధారంగా భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బీమాను యాక్టివేట్ చేస్తుందని ఎయిర్టెల్ సంస్థ తెలిపింది. CAF లో వినియోగదారుడు అందించిన తన పూర్తి సమాచారంలోని వయస్సు, ID ప్రూఫ్ మరియు అడ్రస్ ప్రూఫ్ వంటి డేటాను ఎయిర్‌టెల్ సంస్థ బీమా సంస్థకు అందిస్తుంది అని తెలిపింది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా లేదా ఎయిర్‌టెల్ రిటైలర్ ద్వారా నామినీ వివరాలను సవరించడానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది. ఇందులో తెలుకోవలసిన మరొక విషయం ఆత్మహత్య మినహా మరొక మరణానికి 2,00,000 రూపాయల ప్రయోజనాలు పొందుతారని తెలిపింది.

ఎయిర్‌టెల్ ఉచిత బీమాను పొందడం ఎలా?
ఎయిర్‌టెల్ సంస్థ తన ప్లాన్ లతో అందిస్తున్న ఉచిత బీమాను క్లెయిమ్ చేసుకోవడానికి డెత్ క్లెయిమ్ ఫారంతో పాటు డెత్ సర్టిఫికేట్, KYC డాక్యూమెంట్స్ మరియు చనిపోయిన వ్యక్తి యొక్క వయస్సును రుజువు చేసే డాక్యూమెంట్స్ అందచేయవలసి ఉంటుంది. జీవిత భీమా క్లెయిమ్ చేసే సమయంలో భారతి ఆక్సా లైఫ్‌కు పైన తెలిపిన అన్ని రకాల అవసరమైన పత్రాలను సమర్పించవలసి ఉంటుంది. మరణ కేసులలో బీమా సంస్థ పోలీస్ FIR కాపీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్ కాపీను కూడా అదనంగా అడగవచ్చని ఎయిర్‌టెల్ సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications








