రూ .2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో అమ్మకానికి షియోమి కొత్త ల్యాప్‌టాప్‌లు

|

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి సంస్థ గత వారం ఇండియాలో Mi నోట్‌బుక్ 14 మరియు Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ అనే రెండు రకాల ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. ఈ రోజు ఈ ల్యాప్‌టాప్‌లను అమెజాన్ మరియు Mi ఇండియా వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి ఉంచింది. సన్నని మరియు తేలికపాటి డిజైన్ కలిగిన ఈ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయదలచిన వారికి ఇప్పుడు గొప్ప ఆఫర్స్ లభిస్తున్నాయి.

Mi నోట్‌బుక్ 14 సిరీస్ ల్యాప్‌టాప్‌లు
 

Mi నోట్‌బుక్ 14 సిరీస్ ల్యాప్‌టాప్‌లు

ఇండియాలో మొదటిసారిగా విక్రయించబడుతున్న Mi నోట్‌బుక్ 14 మరియు Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌లు రెండు కూడా 14 అంగుళాల ఫుల్-హెచ్‌డి డిస్‌ప్లేలను కలిగి ఉండి 10 వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో పనిచేస్తాయి. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు ఒక ఛార్జ్ మీద 10 గంటల వరకు లైఫ్ ను ఇచ్చే బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Nokia 5310: అతి తక్కువ ధరలో గొప్ప ఫీచర్లతో సరైన ఎంపిక ఇదే...

Mi నోట్‌బుక్ 14 సిరీస్ ల్యాప్‌టాప్‌ల ధరల వివరాలు

Mi నోట్‌బుక్ 14 సిరీస్ ల్యాప్‌టాప్‌ల ధరల వివరాలు

Mi నోట్‌బుక్ 14 ను ఇండియాలో మూడు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 256GB వేరియంట్‌ ధర రూ.41,999, 512GB వేరియంట్‌ ధర రూ.44,999 మరియు Nvidea గ్రాఫిక్స్‌ గల 512GB వేరియంట్‌ యొక్క ధర 47,999 రూపాయలు. అలాగే Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ ను ఇండియాలో రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో ఇంటెల్ కోర్ i5 వేరియంట్‌ యొక్క ధర రూ.54,999 కాగా ఇంటెల్ కోర్ i7 వేరియంట్‌ యొక్క ధర 59,999 రూపాయలు.

Mi నోట్‌బుక్ 14 సిరీస్ ల్యాప్‌టాప్‌ల సేల్స్ ఆఫర్స్

Mi నోట్‌బుక్ 14 సిరీస్ ల్యాప్‌టాప్‌ల సేల్స్ ఆఫర్స్

Mi నోట్‌బుక్ 14 సిరీస్ ల్యాప్‌టాప్‌ల యొక్క అమ్మకాలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మొదలయ్యాయి. ఈ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు వినియోగదారులకు రూ .2,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే 6 నెలల వరకు EasyEMI ఎంపిక కూడా లభిస్తుంది. Also read: BSNL నుంచి అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు రూ.19లకే

Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్స్
 

Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్స్

Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ ల్యాప్‌టాప్ యొక్క 14 అంగుళాల డిస్‌ప్లే ఫుల్ HD రిజల్యూషన్ మరియు 91 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 1920 x 1080 పిక్సెల్‌ల పరిమాణంలో ఉంటుంది. Mi నోట్‌బుక్‌ ఇంటెల్ హైపర్-థ్రెడింగ్ టెక్నాలజీతో 10వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i7 1051U ప్రాసెసర్ తో రన్ అవుతుంది. అలాగే ఇది 8GB DDR4 ర్యామ్‌తో జతచేయబడి ఉంది. ఇందులో ఎన్విడియా జిఫోర్స్ MX350 GPU యూనిట్ ను కలిగి ఉండడమే కాకుండా ఈ నోట్‌బుక్‌లో 512GB SSD స్టోరేజ్ ను కలిగి ఉండి సరికొత్త విండోస్ 10 తో వస్తుంది.

Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఫీచర్స్

Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఫీచర్స్

Mi నోట్‌బుక్ 14 హారిజోన్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌ సొగసైన మరియు తేలికైన డిజైన్ ను కలిగి ఉంది. ఇది తక్కువ బరువును కలిగి ఉండి కేవలం ఒకే ఒక వేలితో తెరవడానికి కూడా అనువుగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో రెండు USB 3.1 పోర్ట్‌లు, ఒక USB 2.0 పోర్ట్‌తో పాటు HDMI పోర్ట్‌ కూడా ఉంటాయి. వీటితో పాటుగా 3.5mm ఆడియో జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌లు కూడా ఉన్నాయి. దీని బరువు కేవలం 1.35 కిలోలు మాత్రమే. ఇది 65W పాస్ట్ ఛార్జర్‌తో 46 Wh పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది.

Mi నోట్‌బుక్ 14 స్పెసిఫికేషన్స్

Mi నోట్‌బుక్ 14 స్పెసిఫికేషన్స్

షియోమి సంస్థ ఇండియాలో స్టాండర్డ్ Mi నోట్‌బుక్ 14 ల్యాప్‌టాప్‌ను కూడా విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌ యొక్క డిస్‌ప్లే 14అంగుళాల పరిమాణంలో ఉంటుంది. దీని యొక్క డిస్‌ప్లే 1920 x 1080 పిక్సెల్‌లతో ఫుల్ - HD రిజల్యూషన్ మరియు 91 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ 10వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ తో పనిచేస్తూ మూడు వేరియంట్లలో లభిస్తుంది.

Mi నోట్‌బుక్ 14 ఫీచర్స్

Mi నోట్‌బుక్ 14 ఫీచర్స్

షియోమి Mi నోట్‌బుక్ 14లో విండోస్ 10 హోమ్ ముందే ఇన్‌స్టాల్ చేయబడి వస్తుంది. ఈ తేలికపాటి ల్యాప్‌టాప్ 10 వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i5-10210U ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వీటితో పాటు ఎన్విడియా జిఫోర్స్ MX250 GPU వరకు ఉంటుంది. ఇందులో 8GB DDR4 RAM మరియు 512GB SSD స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. దీని యొక్క బ్యాటరీ 46Whతో వస్తుంది. ఇది ఒక ఛార్జీపై 10 గంటల లైఫ్ ను అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Mi Notebook 14 Series Laptops Sale Live on Amazon and Mi.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X