Airtel యొక్క కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
ఇండియాలోని టెలికాం ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్తగా రెండు డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను విడుదల చేసింది. ఈ సర్వీసు ప్రొవైడర్ రూ.78 మరియు రూ.248 ధర వద్ద రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్‌లతో ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు వింక్ ప్రీమియం సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. రూ.78 ప్లాన్‌తో వినియోగదారులకు ఒక నెల వింక్ ప్రీమియం చందా లభిస్తుండగా, రూ.248 ప్లాన్‌లో ఒక సంవత్సరం చందా లభిస్తుంది. ఈ రెండూ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల యొక్క ఇతర ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ.78 డేటా యాడ్-ఆన్ ప్యాక్ ప్రయోజనాలు
ఎయిర్‌టెల్ టెలికాం ఆపరేటర్ కొత్తగా విడుదల చేసిన డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లలో రూ.78 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ డేటా యాడ్-ఆన్ ప్లాన్ 5GB డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్ మీ ప్రస్తుత క్రియాశీల ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క అదే వాలిడిటీ వరకు పనిచేస్తుంది. ఈ 5GB డేటాతో పాటు యూజర్లకు ఒక నెల చెల్లుబాటు కాలానికి వింక్ మ్యూజిక్ చందాను అదనంగా లభిస్తుంది. యూజర్లకు లభించే 5GB డేటా అయిపోయినట్లయితే వారికి 1MB కి 50 పైసలు వసూలు చేస్తారు. ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్ రిలయన్స్ జియో నుండి లభించే రూ.51 డేటా ఓన్లీ ప్లాన్‌కు పోటీని కలిగి ఉంది. జియో టెలికం ఆపరేటర్ రూ.51 ధర వద్ద డేటా ఓన్లీ ప్లాన్‌ను 6GB డేటాతో అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.248 డేటా యాడ్-ఆన్ ప్యాక్ ప్రయోజనాలు
ఎయిర్‌టెల్ యొక్క కొత్త డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లలో రూ.248 ధర వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు మొత్తంగా 25GB డేటాను అందిస్తుంది. ఈ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌తో వినియోగదారులకు ఒక సంవత్సరం పాటు వింక్ మ్యూజిక్ చందాను ఉచితంగా అందిస్తుంది. 25GB డేటా పూర్తి అయిన తరువాత వారు 1MBకి 50 పైసలు చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్యాక్ అసలు డేటా ప్యాక్ మాదిరిగానే చెల్లుతుంది.

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ సవరణలు
ఎయిర్‌టెల్ టెల్కో రూ.199 ధర వద్ద లభించే తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇటీవల సవరించింది. ఈ పునర్విమర్శ తరువాత ఈ ప్లాన్ తన వినియోగదారులకు అధిక మొత్తంలో డేటాను అందిస్తుంది. రూ.199 ప్లాన్ వినియోగదారులకు రోజువారి 1.5GB డేటా, రోజుకు 100 SMSలు మరియు అపరిమిత స్థానిక మరియు జాతీయ కాలింగ్ ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








