Home
News

Airtel Thanks App ఇప్పుడు తెలుగు భాషలో కూడా... లాగిన్ మరింత సులభం...

భారతీ ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్న ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ ఇప్పుడు మాతృభాష మద్దతుతో వస్తున్నది. కస్టమర్లు దీనిని ఉపయోగించడానికి మరింత సరళీకృతం చేయడానికి మరియు టెల్కో అందించే వివిధ డిజిటల్ యొక్క అన్ని రకాల సేవలను పూర్తిగా ఉపయోగించడానికి ఎయిర్‌టెల్ వినూత్న డిజిటల్ జోక్యాలను ప్రవేశపెట్టింది.

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ వినియోగం

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ వినియోగం

ఇండియాలో ఇప్పుడు అధిక మంది స్మార్ట్‌ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. ఇందులో దాదాపు 35% మంది ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ యూజర్లు టైర్ 2/3 పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉండడం గమనార్హం. ఇప్పుడు ప్రాంతీయ భాషల యొక్క మద్దతుతో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ను అందిస్తుండడంతో వినియోగదారులకు మరింత సులభంగా యాక్సిస్ చేయడానికి వీలుగా ఉంటుంది అని భారతి ఎయిర్‌టెల్ యొక్క CPO ఆదర్శ్ నాయర్ తెలిపారు.

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో లోకల్ భాష మద్దతు

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో లోకల్ భాష మద్దతు

ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ఉపయోగించే ప్రతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ కొత్త ఫీచర్‌ను సమర్థవంతంగా ఆస్వాదించగలరు. ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌ ఇప్పుడు హిందీ, తెలగు, మరాఠీ, తమిళం, బెంగాలీ, గుజరాతీ, మలయాళం మరియు పంజాబీ, ఒడియా, కన్నడ, అస్సామీ వంటి భారతీయ భాషల మద్దతుతో వస్తున్నది. రాబోయే వారాల్లో మరిన్ని భాషల మద్దతును ప్రవేశపెడతామని ఎయిర్టెల్ సంస్థ పేర్కొంది.

ఎయిర్టెల్ థాంక్స్ యాప్ డిజిటల్ యాక్సిస్

ఎయిర్టెల్ థాంక్స్ యాప్ డిజిటల్ యాక్సిస్

ఎయిర్టెల్ థాంక్స్ యాప్ అన్ని ఎయిర్టెల్ సేవలకు డిజిటల్ గేట్వేగా పనిచేస్తుంది. ఈ యాప్ డిజిటల్ పరంగా అన్ని రకాల సేవలను పూర్తి చేయడానికి యాక్సిస్ ను అందిస్తుంది. ఇందులో భాగంగా ఇది వినియోగదారులకు బిల్ పెమెంట్స్ , రీఛార్జీలు, డేటాను తనిఖీ చేయడం మరియు బ్యాలెన్స్ వివరాలను చూడడానికి అనుమతిస్తుంది. ఇది కాకుండా ఈ యాప్ ఎయిర్‌టెల్ యొక్క డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లైబ్రరీ ప్రివ్యూను కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ యాప్

ఎయిర్‌టెల్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ యాప్

ఇండియాలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఎయిర్‌టెల్ తన వినియోదారులకు అద్భుతమైన డేటా ప్రయోజనాలను అందిస్తున్నది. దీనితో పాటుగా బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. ఇప్పుడు కొత్తగా వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ ను విడుదల చేసే ఆలోచనలలో ఉంది. కాకపోతే ప్రారంభంలో ఎయిర్‌టెల్ సంస్థ తన బ్రాండెడ్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలను కేవలం కంపెనీలకు మాత్రమే అందించనున్నది. తరువాత దాని యొక్క డిమాండ్‌ను అంచనా వేసిన తర్వాత సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నది.

ఎయిర్‌టెల్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ ఫీచర్స్

ఎయిర్‌టెల్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ ఫీచర్స్

సైబర్ భద్రతా బెదిరింపులపై ఆందోళనలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఎయిర్‌టెల్ డేటా స్థానికీకరణ మరియు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు సమాచారం. ఎయిర్టెల్ యొక్క వీడియో-కాన్ఫరెన్సింగ్ ఉత్పత్తి అధిక స్థాయి భద్రతపై దృష్టి సారించింది. ప్రజలు ఇంటి నుండి పనిచేసేటప్పుడు సైబర్ భద్రత గురించి ఆందోళన చెందకుండా ఉండే విధంగా తయారుచేస్తున్నది. దీని యొక్క వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ మొబైల్ మరియు డెస్క్‌టాప్‌లో అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Thanks App Now Supports Regional Languages Also
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X