Home
News

Airtel Xstream Vs Tata Sky Vs JioFiber: తక్కువ ధరలో లభిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే!!!

ఇంటర్నెట్ మార్కెట్లో బ్రాడ్‌బ్యాండ్ అతి వేగంగా దూసుకుపోతున్నది. ఇండియాలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఎక్కువ మంది ప్రజలు ఇంటర్నెట్ కోసం బ్రాడ్‌బ్యాండ్ మీద ఆధారపడుతున్నారు. ఇంటి వద్ద నుండి పనిచేయడం కోసం అధిక స్పీడ్ గల బ్రాడ్‌బ్యాండ్ కోసం కొత్త సర్వీస్ ను ఉపయోగిస్తున్నారు. ఇటువంటి వారు తక్కువ ధరలో లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను ఎంచుకుంటారు.

బడ్జెట్ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

బడ్జెట్ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ప్రస్తుతం ప్రజలు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సాంకేతిక పరిజ్ఞానం చుట్టూ తిరుగుతున్నారు. ఇంటర్నెట్ మార్కెట్ పోటీలో సర్వీస్ ప్రొవైడర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పోటీలో ఎయిర్టెల్, జియో, టాటా స్కై మరియు ACT ఫైబర్నెట్ వంటి సంస్థలు మార్కెట్లో బలమైన పట్టును సాధించాయి. ఈ కంపెనీలన్నీ తమ వినియోగదారుల కోసం ఉత్తమమైన పలు రకాల ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను అందిస్తున్నాయి. ఎయిర్టెల్ Xstream ఫైబర్, టాటా స్కై మరియు జియోఫైబర్ సంస్థలు తక్కువ ధర వద్ద అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క సేవలు ఇండియాలోని చాలా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి నగరంలోనూ స్టాండర్డ్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లు లభిస్తాయి. టెలికాం సర్కిల్‌లలో దీని ప్లాన్‌ల యొక్క ధరలలో ఖచ్చితంగా ఎటువంటి తేడా లేదు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నెలకు రూ.799 తక్కువ ధర వద్ద బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను అందిస్తుంది. ఇది 150GB నెలవారీ డేటాను 100Mbps వేగంతో అందిస్తుంది. అదనపు ప్రయోజనాలలో ఎయిర్‌టెల్ థాంక్స్ OTT ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. వినియోగదారుడు నెలకు రూ.299 అదనపు మొత్తం చెల్లించి అపరిమిత డేటాను కూడా పొందవచ్చు.

టాటా స్కై తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

టాటా స్కై తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

DTH రంగంలో అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత టాటా స్కై ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ మార్కెట్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ఇది తన వినియోగదారులకు అతి తక్కువ ధర వద్ద బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. రూ.790 ధర వద్ద 50Mbps వేగంతో నెలకు 150GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ ను ఎంచుకున్న కస్టమర్ ఉచితంగా రౌటర్ ను పొందుతాడు. కాని ఇన్స్టాలేషన్ ఛార్జీలు మాత్రం చెల్లించవలసి ఉంటుంది. అదనంగా సేఫ్ కస్టడీతో పాటు డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కూడా లభిస్తుంది.

జియోఫైబర్ యొక్క తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

జియోఫైబర్ యొక్క తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

భారతదేశ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ మార్కెట్లో జియోఫైబర్ కొత్తగా ప్రవేశించింది. ఇది తన వినియోగదారులకు రూ.699ల తక్కువ ధర వద్ద జియోఫైబర్ "బ్రోన్స్" బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ఒక నెలకు 100Mbps వేగంతో 100GB డేటాను అందిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆఫర్లో భాగంగా మొదటి నెలలో వినియోగదారుడు 350GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వినియోగదారులకు వాయిస్ కాలింగ్, టీవీ వీడియో కాలింగ్, గేమింగ్, హోమ్ నెట్‌వర్కింగ్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా అదనంగా ఉచితంగా అందిస్తుంది. దానితో పాటు కస్టమర్ JioCinema మరియు JioSaavnలకు కూడా ఉచితంగా యాక్సిస్ చేయడానికి అనుమతి లభిస్తుంది. హోమ్ గేట్‌వే + సెట్-టాప్ బాక్స్ కూడా ఉచితంగా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel Xstream Fiber Vs Tata Sky Vs JioFiber: Which One Offers Lowest Broadband Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X