Home
News

Airtel అన్‌లిమిటెడ్ ప్లాన్లలో ఇప్పుడు ఉపయోగపడే బెస్ట్ ప్లాన్స్ ఇవే...

ఇండియాలోని టెలికాం సర్వీస్ లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్ టెలికాం సేవలను అందిస్తున్నది. ఎయిర్టెల్ ప్రస్తుతం తన అన్ లిమిటెడ్ ప్లాన్ లను వినియోగదారులకు సరసమైన ధరల వద్ద అందిస్తున్నది. దేశం మొత్తం ఉత్తమమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉండి సరసమైన ఛార్జీలలో ఉపయోగించుకోవడంలో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

Airtel అన్‌లిమిటెడ్ ప్లాన్స్

Airtel అన్‌లిమిటెడ్ ప్లాన్స్

ప్రస్తుతం ఇండియాలో కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఇంటి వద్ద నుండి పనిచేయడానికి మరియు వినోదాన్ని ఆస్వాదించడానికి ఎయిర్‌టెల్ యొక్క ఉత్తమమైన అన్ లిమిటెడ్ ప్లాన్లు మరియు వాటి యొక్క రీఛార్జ్ ఆఫర్‌ల కోసం శోధిస్తూ ఉంటే కనుక ఎయిర్టెల్ అపరిమిత డేటా లేదా వాయిస్ కాల్స్ లను ఆకట్టుకునే ఆఫర్లతో అందిస్తున్న ఉత్తమమైన ఎయిర్టెల్ ప్లాన్ల జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ.149 ప్లాన్ అపరిమిత కాలింగ్‌ ప్రయోజనంతో

ఎయిర్‌టెల్ రూ.149 ప్లాన్ అపరిమిత కాలింగ్‌ ప్రయోజనంతో

ఎయిర్‌టెల్ సంస్థ అందిస్తున్న అపరిమిత కాలింగ్‌ ప్రయోజనాలలో మొదటి ప్లాన్ ఇది. రూ.149 ధర వద్ద లభించే ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్స్ లను అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలానికి 2GB డేటాను మరియు 300SMS లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 28 రోజులు. రూ.149 యొక్క ఈ కనీస రీఛార్జిలో వినియోగదారులు సూపర్-ఫాస్ట్ ఇంటర్నెట్‌తో ఎయిర్టెల్ అపరిమిత కాలింగ్ యొక్క ప్రయోజనాన్ని పొందుతారు.

ఎయిర్‌టెల్ రూ.179 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్: 2 లక్షల జీవిత బీమా ప్రయోజనంతో

ఎయిర్‌టెల్ రూ.179 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్: 2 లక్షల జీవిత బీమా ప్రయోజనంతో

ఎయిర్‌టెల్ రూ.149 ప్లాన్ యొక్క రీఛార్జ్ ఆఫర్ మాదిరిగానే రూ.179 ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ ప్లాన్ వినియోగదారులకు 2GB డేటా మరియు 300 SMS లను ఉచితంగా 28 రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తుంది. అలాగే అన్ని రకాల నెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్స్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటన్నిటితో పాటు ఈ ప్లాన్‌తో చందాదారుడు ఎటువంటి ఆరోగ్య పరీక్షలు లేకుండా 2 లక్షల జీవిత బీమాను కూడా అదనంగా పొందుతాడు.

ఎయిర్‌టెల్ రూ.219 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.219 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క రూ.219 రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులకు రోజువారి 1GB డేటాను అందించడంతో పాటుగా అన్నినెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్‌ల ప్రయోజనంను అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్ రోజుకు 100SMSలను కూడా ఉచితంగా ఇస్తుంది. అయితే ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 28 రోజులు.

ఎయిర్‌టెల్ రూ.249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క రూ.249 రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులకు అందిస్తున్న ఆఫర్ల విషయానికి వస్తే ఇది 1.5GB రోజువారి డేటాను అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్ అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్స్ మరియు రోజుకు 100SMS లను 28 రోజుల చెల్లుబాటు కాలానికి ఉచితంగా అందిస్తుంది. రోజువారి అధిక డేటాను కోరుకుంటున్న వారికి నెలవారీ ఎయిర్‌టెల్ రీఛార్జ్ ఆఫర్‌లలో ఇది ఉత్తమమైన ప్లాన్.

ఎయిర్‌టెల్ రూ.279 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.279 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క రూ.279 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యొక్క ఆఫర్లలో భాగంగా ఇది వినియోగదారులకు 4 లక్షల జీవిత బీమా కవరేజీని అదనంగా ఇస్తుంది అది కూడా ఉచితంగా. అలాగే ఇది 1.5GB రోజువారి డేటాను మరియు అన్ని సర్వీసు ప్రొవైడర్‌లకు అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్‌లను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. వినియోగదారులకు 4 లక్షల జీవిత బీమా కవర్‌ను అందించడానికి టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఎయిర్‌టెల్ రూ.349 అన్‌లిమిటెడ్ ప్యాక్

ఎయిర్‌టెల్ రూ.349 అన్‌లిమిటెడ్ ప్యాక్

ఎయిర్టెల్ యొక్క రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ సేవలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ వినియోగదారులు ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో తమ అభిమాన సినిమాలు మరియు షోలను అమెజాన్ ప్రైమ్‌లో ఎటువంటి అంతరాయం లేకుండా చూడడానికి ఈ ప్లాన్ సరైనది. అయితే అమెజాన్ ప్రైమ్‌కు ఉచిత యాక్సిస్ ను ఇవ్వడమే కాకుండా ఎయిర్‌టెల్ సంస్థ అదనపు ఇంటర్నెట్ డేటాను కూడా అందిస్తుంది. ఎయిర్టెల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2GB ఇంటర్నెట్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. కానీ అమెజాన్ ప్రైమ్ ఒక నెల మాత్రమే యాక్టివేట్ లో ఉంటుంది. అంటే ప్యాక్ గడువు ముగిసే వరకు మాత్రమే.

ఎయిర్‌టెల్ రూ.398 అన్‌లిమిటెడ్ ప్యాక్

ఎయిర్‌టెల్ రూ.398 అన్‌లిమిటెడ్ ప్యాక్

ఎయిర్టెల్ యొక్క రూ.398 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 3GB డేటాను అందిస్తుంది. అలాగే ఇది అన్నినెట్‌వర్క్‌లకు ఫోన్ కాల్స్ చేయడానికి అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్‌లతో వస్తుంది. అలాగే ఈ ప్లాన్ రోజుకు 100SMS లను ఉచితంగా ఇస్తుంది. అయితే ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 28 రోజులు మాత్రమే. రోజువారి అధిక డేటాను ఉపయోగించే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది.

Best Mobiles in India

English summary
Best Airtel Unlimited Prepaid Recharge Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X