Home
News

TikTok యాప్‌ను తొలగించమని ఉద్యోగులకు మెయిల్ పంపిన అమెజాన్!!! తరువాత??

ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సంస్థలలో అమెజాన్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ సంస్థలో చాలా మంది పనిచేస్తున్నారు. అలాగే ఇందులో జాబ్ కోసం కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అలాంటిది అమెజాన్ ఉద్యోగులు గత రాత్రి ఒక వింతైన అనుభూతిని ఎదుర్కొన్నారు.

అమెజాన్ ఉద్యోగులు టిక్‌టాక్‌ను తొలగించడం

అమెజాన్ ఉద్యోగులు టిక్‌టాక్‌ను తొలగించడం

అది ఏమిటంటే తమ ఫోన్ నుండి వెంటనే టిక్‌టాక్‌ను తొలగించమని తెలుపుతూ ఒక ఆఫీస్ నుండి ఒక మెయిల్ ను అందుకున్నారు. ఈ ఇమెయిల్ తరువాత మీడియాకు లీక్ అవ్వడమే కాకుండా ట్విట్టర్‌లో కూడా షేర్లతో బాగా వైరల్ అయింది. అయితే కొన్ని గంటల తరువాత అమెజాన్ సంస్థ ప్రతినిధులు యుఎస్ లోని మీడియాతో మాట్లాడుతూ ఈమెయిల్ తప్పుగా పంపబడింది అని తెలిపారు.

అమెజాన్ ఇమెయిల్ సమాచారం

అమెజాన్ ఇమెయిల్ సమాచారం

"కొన్ని భద్రతా ప్రమాదాల కారణంగా అమెజాన్ యొక్క ఇమెయిల్‌ను యాక్సెస్ చేసే మొబైల్ పరికరాల్లో టిక్‌టాక్ యాప్ ఇకపై అనుమతించబడదు" అని చిన్న ఇమెయిల్ ను అమెజాన్ ఉద్యోగులకు సంస్థ పంపింది. అలాగే "మీ యొక్క ఫోన్ లో టిక్‌టాక్ ఉంటే కనుక అమెజాన్ ఇమెయిల్‌కు మొబైల్ ద్వారా యాక్సిస్ ను పొందడానికి మీరు దీన్ని 10-జూలైలోపు తీసివేయాలి. ఈ సమయంలో మీ అమెజాన్ ల్యాప్‌టాప్ బ్రౌజర్ నుండి టిక్‌టాక్ ఉపయోగించడం అనుమతించబడుతుంది." అనే సారాంశంతో అమెజాన్ తన ఉద్యోగులకు ఇమెయిల్ పంపింది.

అమెజాన్ Vs టిక్‌టాక్‌

అమెజాన్ Vs టిక్‌టాక్‌

కంపెనీల యొక్క పరికరాల నుండి టిక్‌టాక్‌ను ఎందుకు నిషేధిస్తున్నారో అమెజాన్ తన ఇమెయిల్‌లో పేర్కొనకపోయినా టిక్‌టాక్ తరచుగా ఉపయోగించినప్పుడు డేటాను సేకరించడం దీనికి ప్రధాన కారణం కావచ్చు. ఈ డేటాను చైనా ప్రభుత్వంతో పంచుకోవచ్చు. టిక్‌టాక్‌ను మొదట 2017 లో రూపొందించారు. చైనా జాతీయ ఇంటెలిజెన్స్ చట్టం ప్రకారం చైనా ప్రభుత్వంతో డేటాను పంచుకుంటుందనే మాటలను టిక్‌టాక్‌ సంస్థ అప్పుడే ఖండించింది.

టిక్‌టాక్‌కు గల సవాళ్లు

టిక్‌టాక్‌కు గల సవాళ్లు

టిక్‌టాక్‌కు వ్యతిరేకంగా వస్తున్న మాటలను ఖండిస్తూ ఇది సురక్షితమైన యాప్ అని ప్రపంచాన్ని ఒప్పించడంలో టిక్‌టాక్‌ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ప్రస్తుత సమయంలో దీనికి చైనా ప్రభుత్వంతో ఎటువంటి సంబంధాలు లేవని మరియు ఇది ఏ గోప్యత లేదా జాతీయ భద్రతా ప్రమాదాలను కలిగించదు అని సంస్థ పేర్కొంటున్నది.

ఇండియాలో టిక్‌టాక్‌ నిషేధం

ఇండియాలో టిక్‌టాక్‌ నిషేధం

జాతీయ భద్రత మరియు గోప్యతా కారణాలను పేర్కొంటూ భారత్ ఇటీవల టిక్‌టాక్‌తో పాటు 58 ఇతర చైనా యాప్‌లను నిషేధించింది. అయినప్పటికీ భారతదేశం మరియు చైనా లడఖ్‌లో సరిహద్దు వివాదం కలిగి ఉన్న సమయంలో చైనా సైన్యం దురాక్రమణదారుడిగా వ్యవహరించి భారత భూములను ఆక్రమించటానికి ప్రయత్నిస్తున్న సమయంలో భారతదేశంలో ఈ కదలిక వచ్చింది.

అమెరికాలో టిక్‌టాక్‌ నిషేధించడంపై చర్చలు

అమెరికాలో టిక్‌టాక్‌ నిషేధించడంపై చర్చలు

టిక్‌టాక్‌ను ఇండియాలో బ్యాన్ చేయడంతో ఈ యాప్ యొక్క అపారదర్శక గోప్యత మరియు కంటెంట్ మోడరేషన్ విధానాలపై ప్రపంచం మొత్తం మీద చర్చనీయాంశమైంది. అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించడంపై ట్రంప్ యొక్క ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ తెలిపారు.

చైనాకు దూరంగా టిక్‌టాక్

చైనాకు దూరంగా టిక్‌టాక్

టిక్‌టాక్ ప్రస్తుతం చైనా నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. హాంకాంగ్‌పై చైనా తన పట్టును కఠినతరం చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ ఈ నగరం నుంచి వైదొలగుతోందని చెప్పారు. ఇటీవలి కొన్ని సంఘటనల దృష్ట్యా హాంకాంగ్‌లో టిక్‌టాక్ యాప్ యొక్క కార్యకలాపాలను ఆపాలని నిర్ణయించుకున్నట్లు సంస్థ యొక్క ప్రతినిదులలో ఒకరు పత్రిక సమావేశంలో తెలిపారు.

Best Mobiles in India

English summary
Amazon Ask Employees to Delete TikTok App From Phones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X