ప్రపంచ కప్2019 కోసం తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ టీవీలు

|

కొత్త టెలివిజన్ ను కొనుగోలు చేయడానికి దీని కన్నా మంచి తరుణం మరొకటి ఉండదు.దేశంలో స్మార్ట్ ఫోన్ల సంచలనం తరువాత అన్ని కంపెనీల తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా టీవీ అమ్మకాలపై దృష్టి పెట్టారు.అంతే కాకుండా టీవీ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా గట్టి పోటీ మార్కెట్గా మారుతున్నాయి.Xiaomi సంస్థ కేవలం 14 నెలల్లో విజయవంతంగా ఇండియాలో రెండు మిలియన్ MI TV లను విక్రయించింది.తరువాత ఈ ఆలోచనకు రెక్కలు పెంచింది.

ప్రపంచ కప్2019 కోసం తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ టీవీలు

 

ఇప్పుడు, థామ్సన్, టి.సి.ఎల్ యొక్క iFFalcon, MarQ మరియు Vu వంటి టీవీ బ్రాండ్లు కూడా ఈ అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ టీవీ బ్రాండ్లకు సహాయపడే మరో కారణం ఇప్పుడు కొనసాగుతున్న క్రికెట్ మానియా. ఐపీఎల్ 2019 తరువాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ లో ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ ను ఆడుతోంది.ఈ ప్రపంచ కప్ ను చూడడానికి మీ గదిలో పెద్ద టీవీలో చూడడం మీకు చాలా హయిగా ఉంటుంది. కాబట్టి మీరు క్రికెట్ ప్రపంచ కప్ ను చూడటానికి కొత్త టీవీని కొనుగోలు చేస్తున్నట్లయితే తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్స్ తో చాలా ఎంపికలు ఉన్నాయి.

Xiaomi Mi TV

Xiaomi Mi TV

Xiaomi ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అపూర్వమైన విధంగా ఉంది. అది శామ్సంగ్, LG మరియు సోనీ ఆధిపత్యం వహిస్తున్నTV విభాగంలో కూడా తన సత్తా చాటుతోంది. ఈ కంపెనీ ఇప్పటికే 2 మిలియన్ MI TV లను ఇండియాలో విక్రయించింది మరియు ఈ క్రికెట్ ప్రపంచ కప్ చూడడానికి Xiaomi Mi TVలు మీ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. Mi టీవీలు వారు అందించే ఫీచర్స్ మరియు నాణ్యతపై ఖచ్చితమైన లక్షణాలను కలిగి ఉన్నారు.

Xiaomi Mi TV 4A Pro:

Xiaomi Mi TV 4A Pro:

క్రికెట్ ప్రపంచ కప్ ను చూడటానికి కొత్త టీవీని కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు పెద్ద టీవీని కొనుగోలుచేయడం మంచిది. మీ నివాస స్థలంపై ఆధారపడి కొత్త టీవీని కొనుగోలు చేయడం చాలా మంచిది.అయితే 40-inch లేదా పెద్ద స్క్రీన్ సైజు సందర్భోచిత సందర్భంలో ఆదర్శంగా ఉంటుంది. 43-inch Xiaomi Mi TV 4A ప్రో ధర రూ.22,999, 49-inch మోడల్ ధర రూ.29,999. రెండు మోడల్స్ ఫుల్ HD డిస్ప్లేని కలిగి ఉంటాయి. కానీ 49-inch మోడల్ HDR కి కూడా మద్దతు ఇస్తుంది.ఈ రెండు టీవీలు మూడు USB పోర్టులు, మూడు HDMI పోర్టులు, ఒక AV పోర్ట్, ఈథర్ నెట్,Wi-fi మరియు S/PDIF అవుట్ లతో వస్తాయి. PatchWall UI ను అమలు చేసినప్పుడు ఇది విభిన్న సోర్సెస్ నుండి కంటెంట్ను చక్కగా కలుపుతుంది.

థామ్సన్ UD9 40-inch 4K UHD LED TV:
 

థామ్సన్ UD9 40-inch 4K UHD LED TV:

UD9 సిరీస్ లో బాగంగా థామ్సన్ 40-inch టీవీ మార్కెట్లో చౌకైన 4K టీవీ. అధిక రిజల్యూషన్ HD రిజల్యూషన్ లో ఉత్పత్తి చేయబడినప్పుడు ఆ అదనపు పిక్సెల్స్ నెట్ ఫ్లిక్స్ వంటి ప్రసార సేవల నుండి కంటెంట్ను చూస్తున్నప్పుడు సహాయపడతాయి. 4K స్మార్ట్ LED టీవీ 3840 × 2160 పిక్సల్స్ 60Hz రీఫ్రెష్ రేటుతో వస్తుంది.ఇది మూడు HDMI పోర్ట్స్, రెండు USB పోర్టులు కలిగి ఉంటుంది. మరియు నెట్ ఫ్లిక్స్ మరియు హాట్ స్టార్ల స్థానిక యాప్లతో వస్తుంది. ఇది 20W స్పీకర్ అవుట్ పుట్ ను కలిగి ఉంటుంది మరియు ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది. ఈ టివి ధర రూ.20,999లుగా ఉంటుంది అంతే కాకుండా 8,000 రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ల తో పాటు నో-కాస్ట్ EMI ఎంపికలతో ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది.

MarQ 43-inch ఆండ్రాయిడ్ టీవీ:

MarQ 43-inch ఆండ్రాయిడ్ టీవీ:

MarQ అనేది ఫ్లిప్ కార్ట్ యొక్క ఉప-బ్రాండ్ మరియు 43-inch ఆండ్రాయిడ్ TV శ్రేణిలో ఇది ఉత్తమమైనది.ఈ 43-inch టీవీ ధర కేవలం రూ .28,999.ఇది 4K అల్ట్రాHD ప్యానెల్ ను 38Hz రిఫ్రెష్ రేటులో 3840 × 2160 పిక్సెల్స్ కు మద్దతు ఇస్తుంది. ఇందులో మూడు HDMI పోర్టులు మరియు రెండు USB పోర్టులు మరియు 20W స్పీకర్ అవుట్ పుట్ లు ఉన్నాయి. ఇది ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.8,000 వరకు ఉంటుంది.

iFFalcon 40-inch LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ:

iFFalcon 40-inch LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ:

TCL iFFalcon TV ద్వారా మార్కెట్ లో Xiaomi విజయంను అనుకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇది ఎంపికల విస్తృత శ్రేణిని అందిస్తోంది. కానీ 40-inch ఫుల్ HD LED TV ధర రూ.18,999లుగా ఉంది.ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ తో నడుస్తుంది మరియు ఆండ్రాయిడ్ యాప్ ల మద్దతుతో వస్తుంది మరియు నెట్ ఫ్లిక్స్ ముందే ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. థామ్సన్ తో పోలిస్తే ఇది ఖరీదైనప్పటికీ దాని ప్యానెల్ చాలా మంచిదని భావించబడుతుంది. iFFalcon కూడా ఇతర మోడల్స్ మాదిరి ఒక సంవత్సరం వారంటీతో అందిస్తుంది.వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.8,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Vu Pixelight 50-inch Ultra HD LED TV:

Vu Pixelight 50-inch Ultra HD LED TV:

Vu అనేది ఇండియన్ బ్రాండ్.ఇది Xiaomi కంటే ముందు భారతీయ మార్కెట్లో విజయాన్ని సాధించిన శామ్సంగ్ మరియు సోనీ వంటి బ్రాండ్లు దీనికి అంతరాయం కలిగించాయి. దాని పిక్సెల్ సీరీస్ 4K టీవీలను సరసమైన ధరల వద్ద అందించే లక్ష్యంతో ఉంది మరియు 50-inch మోడల్ ధర రూ.28,999ల వద్ద అందుబాటులో ఉంది.ఇది 3840 × 2160 పిక్సెల్స్ మరియు 60Hz రిఫ్రెష్ రేటుతో అధిక రిజల్యూషన్ తో 50-inch అల్ట్రా HD ప్యానెల్ తో వస్తుంది.ఇందులో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు యూట్యూబ్ అప్లికేషన్లు ముందే ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది మరియు రిమోట్లో ఒక హాట్ కీగా ఉంటుంది. టివికి ఒక సంవత్సరం వారంటీ ఉంది.ఇది మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు మరియు 24W స్పీకర్ అవుట్ పుట్ ను అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
best big screen budget smart tvs to buy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X