అమెజాన్ కొత్త రూల్స్‌: కష్టమర్లకు పట్టపగలే చుక్కలు

Written By:

మీరు అమెజాన్ లో వస్తువును కొన్నారా..అయితే అది మీ దగ్గరికీ వచ్చేసరికి చెడిపోవడం గాని లేకుంటే డామేజీ కావడం కాని జరిగిందా..అయితే ఇంతకు ముందు 30 రోజుల వరకు వస్తువు బాగా లేకుంటే డబ్బు తిరిగివ్వడమో లేకుంటే కొత్త వస్తువు రావడమో జరిగేది. కాని ఇప్పుడు సీన్ మారింది. మీ దగ్గరకు వచ్చిన వస్తువకు తిరిగి డబ్బులు చెల్లించకుండా పాలసీలో భారీ మార్పులు చేసింది.

Read more : మొబైల్స్ చరిత్రలో నమ్మలేని నిజాలు

అమెజాన్ కొత్త రూల్స్‌:  కష్టమర్లకు పట్టపగలే చుక్కలు

మీరు వాపస్ చేసి డబ్బులు కావాలంటే మరో వస్తువు డెలివరీ అయ్యేదాకా మీరు డబ్బులు మరచిపోవాల్సిందేనని చెప్పింది. ఫిబ్రవరి 7 నుంచి ఇది అమలులోకి వచ్చింది. రిటర్న్ పాలసీలో ఉన్న వస్తువుల వివరాలను ఆ సంస్థ ప్రత్యేక పేజీలో పొందుపరిచింది.

Read more: లెనోవా నుంచి ప్రపంచంలోనే అతి పలుచని ల్యాప్‌టాప్

అమెజాన్ కొత్త రూల్స్‌:  కష్టమర్లకు పట్టపగలే చుక్కలు

వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారం వేరే పేజీలో ఉంటుందని .. దాన్ని చూసుకొన్న తర్వాతే సదరు వస్తువును కొనుగోలు చేయాలని .. ఒకవేళ డెలివరీ చేసిన తర్వాత వస్తువు డ్యామేజ్ అయినా .. కొన్న వస్తువుకు బదులుగా వేరే వస్తువు వస్తే మాత్రమే రిటర్న్ చేసే వెసులుబాటు ఉంటుంది.

అమెజాన్ కొత్త రూల్స్‌:  కష్టమర్లకు పట్టపగలే చుక్కలు

అందుకు మినహా మరి వేటికి రిటర్న్ చేసే అవకాశం ఉండదు. సో .. గతంలోమాదిరి '' సంతృప్తి '' అంశాన్ని పరిగణలోకి తీసుకొని వస్తువుల్ని కొనుగోళ్లు చేసే వారు జర జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ సంధర్భంగా అమెజాన్ బాస్‌కి ధనదాహం తీరడం లేదట ఓ సారి చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్' బాస్ జెఫ్ బిజోస్‌కు ఇంకా సంపాదన దాహం

ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ రిటేలర్‌గా వ్యాపార సామ్రాజ్యాన్ని అనతికాలంలోనే విస్తరించుకున్న ‘అమెజాన్' బాస్ జెఫ్ బిజోస్‌కు ఇంకా సంపాదన దాహం తీరలేదట.

 

 

కోటాను కోట్ల రూపాయలను సంపాదించుకోవడమే

వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకొని కోటాను కోట్ల రూపాయలను సంపాదించుకోవడమే నూతన సంవత్సరంలో తన లక్ష్యమని ఆయన ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.

నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగత సంపాదనతో

నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగత సంపాదనతో ప్రపంచంలోనే నాలుగవ ధనిక వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ తన లక్ష్యం ఇంకా మిగిలే ఉందని చెప్పారు.

 

 

అమెజాన్‌లో కేవలం 18 శాతం వాటా కలిగిన జెఫ్

అమెజాన్‌లో కేవలం 18 శాతం వాటా కలిగిన జెఫ్ ఇప్పటికీ వ్యక్తిగత సంపాదనలో ప్రపంచ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్ వ్యవస్థాపకులను అధిగమించారు.

 

 

పుస్తకాల అమ్మకాలతో 1994లోనే అమెజాన్ వ్యాపారాన్ని

ఆయన వ్యక్తిగత సంపాదన గత ఏడాదిలోనే రెండింతలైంది. పుస్తకాల అమ్మకాలతో 1994లోనే అమెజాన్ వ్యాపారాన్ని మొదలుపెట్టి వివిధ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించిన జెఫ్ ఇటీవలనే హాలీవుడ్ సినిమా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నానని ప్రకటించిన విషయం తెల్సిందే.

 

 

ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీయడం

ఏడాదికి 16 ఫీచర్ సినిమాలు తీయడం, ఒక్కటైనా ఆస్కార్ అవార్డును సాధించడం తన లక్ష్యమని ప్రకటించిన విషయం తెల్సిందే.

 

 

ఈ ఏడాదిలో ఫ్రెష్ ఫుడ్ ఉత్పత్తులను ప్రపంచంలోని నగరాలన్నింటికీ

ఫ్రెష్ ఫుడ్ ఉత్పత్తులను గత నవంబర్‌లోనే ప్రారంభించి న్యూయార్క్, లాస్ ఏంజెలిస్ నగరాల్లో సరఫరా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదిలో ఫ్రెష్ ఫుడ్ ఉత్పత్తులను ప్రపంచంలోని నగరాలన్నింటికీ విస్తరిస్తానని చెప్పారు.

 

 

ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ

ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఛారిటీ సంస్థలకు విరాళాలు ఇవ్వాలంటే మనస్కరించని వ్యక్తి. ఈ విషయంలో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఇటీవల వెయ్యి నుంచి పది వేల డాలర్ల వరకు విరాళాలు ఇస్తున్నారు.

 

 

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ ఉద్యమాన్ని

అయినప్పటికీ విమర్శలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ ఉద్యమాన్ని నడుపుతుందని ప్రకటించారు. అంతటి చిత్తశుద్ధే ఆయనకుంటే అమెజాన్ సరఫరా చేస్తున్న ఉత్పత్తుల ప్యాకేజీకి ఏమాత్రం ప్లాస్టిక్ పేపర్‌ను వాడకూడదు.

 

 

మరి అమెజాన్ అధినేత ఆ దిశగా అడుగులు వేస్తారా

మరి అమెజాన్ అధినేత ఆ దిశగా అడుగులు వేస్తారా లేక అందరిబాటలోనే నడుస్తారా అన్నది చూడాలి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Amazon stops returns for smartphone purchases in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot