సైబర్ నేరగాళ్లతో ఎంపికి దిమ్మతిరిగింది

Posted By:

సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న మార్పులతో సమాజం ఓ వైపుముందుకు సాగుతుంటే. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించుకుంటున్ననేరగాళ్లు వినియోగదారులను నట్టేట ముంచుతున్నా రు. డబ్బులు ఇంట్లో ఉంటే భద్రత ఉండదని ప్రతి ఒక్కరు తమ బ్యాంకు ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే నేరగాళ్లు తామేమి తక్కువా అన్నట్లు మనకంటే ఒకడుగు ముందుకు వేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. బ్యాంకు ఖాతా దారులల వివరాలను తస్కరిస్తు కార్టులను క్లోనింగ్‌ చేస్తున్నారు.

Read more :ఆన్‌లైన్ ఎఫైర్స్‌తో కొంప కొల్లేరు

తర్వాత నకిలీ కార్డులు తయారు చేసి వాటి ద్వారా ఏటిఎం నుంచి డబ్బులను దోచుకుపోతున్నారు. ఈ వరుసలోనే కాకినాడ ఎంపీ తోట నర్సింహం ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు స్మార్ట్ గా 50 వేలు దొంగిలించారు. తన ప్రమేయం లేకుండా డబ్బులు డ్రాపై ఆయన ఒక్కసారిగా షాక్ తిన్నారు.మరి ఆయనలాగే ఇంకా చాలామంది ఈ సైబర్ నేరాల బారీన పడ్డారు. స్మార్ట్ గా జరుగుతున్ ఈ సైబర్ నేరాలను ఎలా చేస్తున్నారు..వారు పిన్ అవసరం లేకుండానే మన కార్డు నుంచి డబ్బులు ఎలా కొల్లగొడుతున్నారు కింద స్లైడర్ లో చదవండి.

Read more: ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ఐఫోన్ స్మగ్లర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కార్డు మీ దగ్గరే..ఏటీఎంలో డబ్బులు మాయం

ఏటీఎం కార్డు మీ దగ్గరే ఉంటుంది....! కానీ ఏటీఎంలో డబ్బులు మాయమవుతాయి. మీ పిన్ నెంబర్ ఎవరికి తెలియదు...! మీ ఖజానా మాత్రం ఖాళీ అవుతుంది. అదెలాగంటారా సైబర్ నేరగాళ్ల తలచుకుంటే ఏదైనా సాధ్యమే.

సైబర్ క్లోనింగ్

డెబిట్‌ కార్డులను, క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేసి అకౌంట్లలో ఉన్న అసలు మొత్తాన్ని ఊడ్చేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా మాయం చేస్తున్నారు. సాధారణ వ్యక్తి నుంచి ప్రముఖుల వరకు ఈ సైబర్ క్లోనింగ్ బాధితులుగా మారుతున్నారు.

షాపుల్లో చేసే డెబిట్ కార్డు స్వైపింగే

సైబర్ క్లోనింగ్‌కు ప్రధాన కారణం షాపుల్లో చేసే డెబిట్ కార్డు స్వైపింగే. దీన్నే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. డెబిట్ కార్డు చెల్లింపులే ఆయుధంగా చేసుకుంటున్నారు. షాపింగ్‌ చేసి డెబిట్ కార్డుతో బిల్లు పేమెంట్ చేస్తున్న సమయంలో సదరు యజమాని కార్డును స్వైప్ చేస్తాడు.

డెబిట్ కార్డును క్లోన్

ఈసమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు....తమ చేతిలో ఇమిడిపోయే స్కిమ్మర్ల సహాయంతో డెబిట్ కార్డును క్లోన్ చేస్తారు. ఇలా క్లోన్ చేసి యధేచ్చగా ఏటీఎంల నుంచి డబ్బులు గుంజుతారు. ఒక్కసారి స్వైప్ చేస్తే చాలు డెబిట్ కార్డుతోపాటు బ్యాంకు ఖాతాకు సంబంధించిన డేటా అంత ఈ స్కిమ్మర్ రాబడుతుంది.

ఏలూరు ఎంపీ తోట నర్సింహం కూడా ఈ లిస్టులో..

తాజాగా ఏలూరు ఎంపీ తోట నర్సింహం కూడా ఈ లిస్టులో చేరిపోయారు. ఆయన అకౌంట్‌ నుంచి తనకు తెలియకుండానే సైబర్ దొంగలు 50 వేల రూపాయలు డబ్బులు డ్రా చేశారు హైటెక్ దొంగలు. గోవాలోని ఓ ఏటీఎం నుంచి ఈ డబ్బును డ్రా చేశారు.

కార్డు క్లోన్‌ అయ్యిందంటూ ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు

డబ్బు డ్రా అయినట్లు గుర్తించిన ఎంపీ... తన కార్డు క్లోన్‌ అయ్యిందంటూ ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు సైబర్‌ నేరగాళ్ల కోసం గాలిస్తున్నారు. బెంగుళూరులో షాపింగ్ చేసిన సమయంలో ఎంపీ తోట నర్సింహం కార్డు ఇలాగే క్లోనింగ్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మూడు లక్షలకు పైగా ..

ఇదిలా ఉంటే జిల్లాలోనే మంచిర్యాల, కాగజ్‌నగర్, నిర్మల్ ప్రాంతాల్లో కూడా సైబర్‌నేరాలు జరిగాయి. సుమారు రూ. మూడు లక్షలకు పైగా సైబర్ నేరగాళ్లు బాధితుల ఖాతాల్లోనుంచి డబ్బులు డ్రా చేసినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

కొత్త సిమ్‌కార్డు నెంబర్ల టార్గెట్..

కొత్త సిమ్‌కార్డు నెంబర్లనే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మాట్లాడుతూ మోసం చేస్తున్నారు. బ్యాంక్ అధికారులమని ఖాతా నెంబర్లు అడిగి ఆతర్వాత ఏటీఎం నెంబర్ తెలుసుకుంటున్నారు. అమాయక ప్రజలు వారి ఏటీఎం నెంబర్లు చెప్పగానే డబ్బులను కాజేస్తున్నారు.

ముంబాయి,బెంగళూరు , పూణే, గోవా ..

కొందరు సైబర్‌నేరగాళ్లు ముంబాయి,బెంగళూరు , పూణే, గోవా తదితర ప్రాంతాల నుంచి ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అపరేట్‌ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.

మ్యాగ్నటిక్‌ రిఫ్లికా అఫ్‌ ఎటిఎం కార్డ్ స్లాట్‌

గతంలో ముంబాయికి చెందిన ఒక ముఠా మ్యాగ్నటిక్‌ రిఫ్లికా అఫ్‌ ఎటిఎం కార్డ్ స్లాట్‌ అనే పరికరాన్ని తయారు చేశారు. రిఫ్లికా అనేది తొడుగు దినిని ఏటిఎం సెంటర్లలో కార్డు లోనికి వెళ్లే చోట గమ్‌తో అతికిస్తారు. రిఫ్లికా అతికించే ముందు అందులో ఓ సాఫ్ట్ వేర్‌ చిప్‌తో పాటు అది పనిచేసేందుకు బ్యాటరీ అమర్చి ఉంటుంది.

సుమారు అరు గంటలు ..

ఖాతా దారులు ఏటిఎం సెంటరుకు వెళ్లి కార్టు లోపల పెట్టి పిన్‌ నెంబరును నమోదు చేసే కీప్యాడ్‌కు పైన్‌ ఓ పెన్‌ డ్రైవ్‌ , దానికి 16 జీబీ మెమోరికార్డు, 8 మెగా పిక్సల్‌ సెల్‌ఫోన్‌లో వినియోగించే కెమెరా ఏర్పాటు చేసి దాన్ని గమ్‌స్టిక్‌తో అతికిస్తారు. రిఫ్లికాలో ఉన్న బ్యాటరీ సుమారు అరు గంటలు పనిచేస్తుంది.

కార్డుపై ఉన్న 18 అంకెలు

ఖాతాదారుడు వచ్చి తమ ఏటిఎం కార్డును ఏటిఎం మిషన్‌లో పెట్టగానే రిఫ్లికాలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కార్డుపై ఉన్న 18 అంకెలు అందులో నమోదవుతాయి. ఖాతాదారుడు పిన్‌నెంబరు నమోదు చేయగానే పైన అమర్చిన కెమెరాలో అది రికార్టవుతుంది.

క్లోనింగ్‌ ద్వారా నకిలీ ఏటిఎం కార్డులు

దీంతో అరుగంటల్లో ఏటిఎం సెంటర్‌కు ఎంత మంది వినియోగదారులు వచ్చే వారి కి చెందిన కార్డుల వివరాలు అందులో నమోదవుతాయి. ఇలా రిఫ్లికా కెమెరా ద్వారా సేకరించిన వివరాలను గోవాకు తీసుకువెళ్లి అక్కడ క్లోనింగ్‌ ద్వారా నకిలీ ఏటిఎం కార్డులను తయారు చేసి వాటిపై అవే నంబర్లను ముద్రిస్తారు.

70 నుంచి 100 నకిలీ ఏటిఎం కార్డులు

సదరు నెంబరుకు ఉన్న పిన్‌నెంబరును సైతం పేపర్‌పై రాసి నకిలీ ఏటిఎం కార్టులకు అంటిస్తారు. ఇలా ఒక్కోసారి 70 నుంచి 100 నకిలీ ఏటిఎం కార్డులను తయారు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.

2012లో వెలుగులోకి

ఇలా తయారు చేసిన ఏటిఎం కార్డుల ద్వారా సెక్యూరిటీ గార్డులు లేని ఏటిఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇలా మొట్టమెదట సారి రిఫ్లికా పరికరంతో సమాచారం తస్కరించి నకిలీ ఏటిఎం కార్డులను తయారు చేసిన సంఘటన 2012లో వెలుగులోకి వచ్చింది.

2014 సంవత్సరంలో..

ఆ సమయంలో 70 నకిలీ ఏటిఎం కార్డులను తయారు చేసి వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.12 లక్షల వరకు ఖాతాదారుల సోమ్మును కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. 2014 సంవత్సరంలో హైదరాబాద్‌లోని లైఫ్‌ స్టైల్  భవనంలో ఉన్న ఓ ఏటిఎం సెంటర్‌కు రిఫ్లికా పరికరం అమర్చి సుమారు 60 నకిలీ ఏటిఎం కార్డులను తయారు చేశారు. వీటి ద్వారా హైదరాబాద్‌లో రూ.7 లక్షల రూపాయలను దోచుకున్నారు.

నకిలీ ఏటిఎం కార్డులతో రూ.10 లక్షల వరకు ఖాతా దారుల సోమ్మును ..

2014 సంవత్సరం మార్చి నెలలో రాజ్‌భవన్‌ రోడ్డులోని ఎస్‌బిహెచ్‌ ఏటిఎంలో రిఫ్లికా పరికరం అమర్చి సమాచారం తస్కరించి వాటి ద్వారా సుమారు 100 నకిలీ ఏటిఎం కార్డులను తయారు చేశారు. ఇలా చేసిన నకిలీ ఏటిఎం కార్డులతో రూ.10 లక్షల వరకు ఖాతా దారుల సోమ్మును దోచుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

సుమారు రూ.70 లక్షల రూపాయలు ..

ఈ మధ్యనే సికింద్రాబాద్‌లోని సిండికేట్‌ బ్యాంకులోని 27 మంది ఖాతా దారులకు చెందిన అకౌంట్ల నుంచి సుమారు రూ.70 లక్షల రూపాయలు మాయమయ్యాయి. దీంతో ఖంగుతిన్న వినియోగదారులు బ్యాంకు ముందు అందోళన చేస్తున్నారు.ఖాతా దారులకు బ్యాంకు అకౌంట్ల వివరాలను క్లోనింగ్‌ చేసిన నేరగాళ్లు ముంబాయిలో డబ్బులు డ్రా చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. సైబర్‌ నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు వేట సాగిస్తున్నారు.

పోలీసుల సూచనలు

ఏటిఎం సెంటర్లలో అప్రమత్తంగా ఉండాలని, మిషన్‌ కీబోర్టుపై ఏవైనా కెమెరాలు ఉన్నాయా అని చూసుకోవాలి, పిన్‌ నెంబరు నమోదు చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి, రద్దీగా ఉండే ప్రాంతాల్లోని ఏటిఎం సెంటర్లకు వెళ్లడం కొంతమేర ఉత్తమం, సెక్యూరిటీ గార్డులు ఉన్న ఏటిఎం సెంటర్లకు మాత్రమే వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఏమరపాటుగా ఉన్నారా ఇళ్లు గుల్లే

మన నెత్తిన ఎన్నో విధాలుగా శఠగోపం పెట్టి దర్జాగా దోచేస్తున్న ముఠాలు...తాజాగా సైబర్ క్లోనింగ్‌తో అకౌంట్లో డబ్బులు మాయం చేయడంపై ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంపీ ఆర్థిక కార్యకలాపాలకే రక్షణ లేదు. ఇక సామాన్యుల పరిస్థితేంటి. షాపింగ్‌లో బిల్లులను డెబిట్ కార్డు ద్వారా చెల్లించేటప్పుడు అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం. ఏమరపాటుగా ఉన్నారా ఇళ్లు గుల్లే.

గిజ్ బాట్ పేజీని లైక్ చేయండి

మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here Write ANDHRA MP LOSES RS.50K TO DEBIT CARD CLONING
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot