BSNL తక్కువ ధర ప్లాన్‌లలో గొప్ప ప్రయోజనాలతో సరికొత్త సవరణలు...
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన వినియోగదారుల యొక్క బేస్ ను పెంచుకోవడానికి కొత్త కొత్త ప్లాన్ లను విడుదల చేయడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న ప్లాన్ లను అద్భుతమైన ఆఫర్లతో సవరిస్తున్నది.

BSNL స్పెషల్ టారిఫ్ వోచర్ STV99
ఇందులో భాగంగా తన స్పెషల్ టారిఫ్ వోచర్ STV99 ప్లాన్‌ను మరింత ప్రయోజనాలతో సవరించింది. సాధారణంగా ప్రతి ఆపరేటర్ పిఆర్‌బిటి చందాను నెలకు రూ.30 ధర వద్ద వసూలు చేస్తారు. ఇంకా 30 రోజుల చెల్లుబాటు కాలంలో లభించే కాలర్ టూన్ కోసం రూ.12 అదనంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. అపరిమిత వాయిస్ ప్రయోజనాలను అందించే ప్లాన్ లలో STV 99 ప్లాన్ కూడా ఒకటి.

బిఎస్ఎన్ఎల్ STV ప్లాన్ లు
BSNL కొన్ని ప్లాన్ లు కేవలం డేటాను మాత్రమే అందిస్తాయి లేదా డేటా ప్రయోజనాలతో పాటుగా వాయిస్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. బిఎస్ఎన్ఎల్ యొక్క STV 99 ప్లాన్ అందిస్తున్న మరిన్ని ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Samsung Galaxy Tab S6 Lite యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!

బిఎస్‌ఎన్‌ఎల్ STV99 ప్లాన్ సవరణలు
బిఎస్‌ఎన్‌ఎల్ రూ.99 ధర వద్ద అందిస్తున్న STV99 ప్లాన్‌ను వినియోగదారులకు 22 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 250 నిమిషాల FUP పరిమితి గల అపరిమిత వాయిస్ కాల్స్ అందిస్తుంది. 250 నిమిషాల తరువాత వినియోగదారుల వద్ద నుండి బేస్ టారిఫ్ వసూలు చేయబడుతుంది. అలాగే వినియోగదారులకు వారి మొత్తం చెల్లుబాటు కాలంలో కాలర్ టూన్ ప్రయోజనాలను కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే ప్రీమియం నంబర్లు మరియు అంతర్జాతీయ నంబర్లకు కాల్స్ ఛార్జీలను వసూలు చేయబడతాయి. Also Read:BSNL Add-on ప్యాక్‌లలో కొత్త మార్పులు!!! డబుల్ డేటా ప్రయోజనం....

బిఎస్‌ఎన్‌ఎల్ STV99 ప్లాన్ లభ్యత ప్రాంతాలు
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క STV99 ప్లాన్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గడ్, చండీగడ్, చెన్నై, డామన్ మరియు డియు, దాద్రా మరియు నగర్ హవేలి, గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు జార్ఖండ్‌లతో సహా పలు సర్కిల్‌లలో అందుబాటులో ఉంది.

బిఎస్‌ఎన్‌ఎల్ STV99 ప్లాన్ ప్రయోజనాలు వివిధ సర్కిల్‌లలో
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క STV99 ప్లాన్ ను కొన్ని ప్రాంతాలలో తక్కువ వాలిడిటీతో వస్తుంది. అందులో భాగంగా మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ మరియు త్రిపురలోని బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు STV99 ప్లాన్‌ను అపరిమిత కాల్స్ ప్రయోజనాన్ని 21 రోజుల చెల్లుబాటు కాలంతో పొందుతారు. అలాగే అండమాన్ మరియు నికోబార్ దీవులలోని బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు STV99 ప్లాన్‌ను అదే ప్రయోజనాలతో 15 రోజుల చెల్లుబాటు కాలంతో పొందుతారు.


Click it and Unblock the Notifications








