'ఆపిల్ న్యూ ఐప్యాడ్' మొదటి వారం సేల్స్ అదుర్స్

Posted By: Super

'ఆపిల్ న్యూ ఐప్యాడ్' మొదటి వారం సేల్స్ అదుర్స్

 

టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ఆపిల్ మార్చి 16(శుక్రవారం)న అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి విడుదల చేసిన 'న్యూ ఐప్యాడ్' రికార్డు సేల్స్‌ని నమోదు చేసింది. ఆపిల్ చరిత్రలో న్యూ ఐప్యాడ్ రికార్డు నమోదు చేయడం విశేషం. శుక్రవారం విడుదలైన ఆపిల్ న్యూ ఐప్యాడ్ ప్రపంచ వ్యాప్తంగా  సుమారు 3మిలియన్ల యూనిట్స్ అమ్మకాలు అమ్ముడయ్యాయి. ఆపిల్ న్యూ ఐప్యాడ్ 4జీ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

సోమవారం ఆపిల్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ఆపిల్ న్యూ ఐప్యాడ్ అమ్మకాలు మాలో కొత్త ఉత్తేజాన్ని నింపాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకోని మార్చి 23వ తారీఖు నుండి 'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని మరో 24 దేశాలలో విడుదల చేసేందుకు రంగం సిద్దం చేశామని అన్నారు. అంతక ముందు ఆపిల్ న్యూ ఐప్యాడ్’ ని ప్రపంచ వ్యాప్తంగా  లండన్, అమెరికా, కెనడా, ఆస్టేలియా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, హాంగ్ కాంగ్, స్విట్జర్లాండ్, సింగపూర్, పుర్టినో రికో దేశాలలో విడుదల చేశారు.

ఆపిల్ ‘న్యూ ఐప్యాడ్’ వివరాలు సంక్షిప్తంగా:

శక్తిమంతమైన చిప్, హై-డెఫినిషన్ స్క్రీన్, మెరుగైన 5 మెగా పిక్సెల్ కెమెరా, 4జీ టెక్నాలజీకి అనువైనదిగా దీన్ని తీర్చిదిద్దారు. ఐప్యాడ్2 కన్నా ఇది కొంచెం మందంగా 9.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. వై-ఫై ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ సుమారు 10 గంటలు ఉంటుంది, అదే 4జీ ఉపయోగిస్తే ఒక గంట తగ్గుతుంది. ఇక స్టోరేజి సమస్యలు తలెత్తకుండా ఈ డివైజ్ లో ‘ఐక్లౌడ్’ పేరిట క్లౌడ్ సర్వీసులు కూడా అందిస్తున్నారు.

దీనితో కంటెంట్‌ను … ఐప్యాడ్‌లోనే భద్రపర్చుకోవాల్సిన పని లేకుండా కంపెనీ సర్వర్లలో ఉంచుకోవచ్చు. ఇది ఈ నెల 16 నుంచి అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో ఐప్యాడ్‌ హైడెఫినిషన్‌‌‌‌ను విక్రయించనున్నారు. భారత్‌లో దీన్ని ఎప్పుడు ప్రవేశపెడతారన్నది కంపెనీ వెల్లడించలేదు. కొత్త ఐప్యాడ్ ధర వై-ఫై రకానికైతే 499-699 డాలర్లు (రూ. 24,950- రూ. 31,450) మధ్య ఉంటుంది. అదే 4జీ వెర్షన్‌కైతే 629-829 డాలర్లు (రూ. 31,450-41,450) దాకా ఉంటుంది.

మార్చి 16 ఉదయం 8 గంటలకు ఏం జరుగుతుంది..?

‘ఆపిల్ న్యూ ఐప్యాడ్’ ని మొదట కోనుగోలు చేసేది ఎవరు..?

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot