యాపిల్‌ హ్యాకర్ల చేతిలో పడింది

Written By:

శత్రుదుర్భేద్యంగా భావించే యాపిల్ కంపెనీకి హ్యకర్ల బెడద మొదలైంది. యాపిల్ కంపెనీ వాళ్ల యాప్ స్టోర్ లోకి ఈ మధ్య హ్యాకర్లు జొరబడ్డారు. ఈ విషయాన్ని యాపిల్ కూడా నిర్ధారించిన వార్తలు ఒక్కసారిగా షాక్ కు గురిచేస్తున్నాయి. తమ డెవలపర్లు ఉపయోగించే ఒక టూల్ ను హ్యాకర్లు కాపీచేసి దానికి మార్పులు చేర్పులు చేసి యాప్ స్టోర్ స్టోర్ లో అందుబాటులో ఉండే యాప్స్ లోకి వాళ్ల కోడ్ ని ప్రవేశపెట్టారని యాపిల్ కంపెనీ చెప్పింది.

Read more: యాపిల్ మాయ.. తెర ఒకటే, స్క్రీన్‌లు రెండు

ఇప్పటి వరకు 40 యాప్స్ లో ఇలాంటి కోడ్ లేదా మాల్ వేర్ ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల కోట్లాది మంది యాపిల్ యూజర్లపై ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. దాదాపు 300 వరకు యాప్స్ ఇలా ఇన్ఫెక్ట్ అయ్యాయని చైనాకు చెందిన ఆన్ లైన్ సెక్యూరిటీ కంపెనీ క్యోహో తెలిపింది. నకిలీ సాఫ్ట్ వేర్లతో మార్చినట్లు గుర్తించిన కొన్ని యాప్ లను తాము ఇప్పటికే తొలగించామని యాపిల్ అధికార ప్రతినిధి క్రిస్టీన్ మొనాగన్ తెలిపారు. అయితే ఎంతమంది ఇలా ఇన్ఫ్‌క్ట్ అయిన యాప్ లను డౌన్ లోడ్ చేసుకున్నారో తేలాల్సి ఉంది. ఒక్కసారి ఇలా మాల్ వేర్ ఉన్న యాప్ ను ఓపెన్ చేశారంటే ఆ ఫోన్ లేదా ట్యాబ్ లోకి మరిన్ని వైరస్ లు ప్రవేశించే ప్రమాదం ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంధర్భంగా యాపిల్ చరిత్రను ఓ సారి గుర్తు చేసుకుందాం.

Read more: యాపిల్ ఐఫోన్ రూ.10,000కే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐప్యాడ్ రెటీనా డిస్‌ప్లే

యాపిల్ ఐప్యాడ్ రెటీనా డిస్‌ప్లేను వాస్తవానికి తయారు చేసింది సామ్‌సంగ్.

యాపిల్ కంప్యూటర్ల దగ్గర పొగత్రాగితే

యాపిల్ కంప్యూటర్ల దగ్గర పొగత్రాగితే వారంటీని కోల్పొవల్సి వస్తుంది.

యాపిల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ...

యాపిల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 80,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు.ఈ సంఖ్య ఇప్పుడు మరింతగా పెరిగి ఉండవచ్చు. 

పనిచేసే ఉద్యోగుల వేతనం

యాపిల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏడాదికి పొందే సగటు వేతనం 1,25,000 యూఎస్ డాలర్లు.,

2012లో యాపిల్ విక్రయాలు

2012లో యాపిల్ రోజుకు 3,40,000 ఐఫోన్‌లను విక్రయించగలిగింది.

 

 

యాపిల్ కంపెనీ నిమిషానికి ఆదాయం

యాపిల్ కంపెనీ ఆదాయం నిమిషానికి 300000 యూఎస్ డాలర్లు,

 

 

యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు

యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అప్పట్లో తన షేర్లను కేవలం 800 డాలర్లకు విక్రయించారు. ఇప్పుడు వాటి విలువ 35 బిలియన్ డాలర్లు.

సిరి వాయిస్ యాప్‌కు

సిరి వాయిస్ యాప్‌కు చెప్పే ప్రతి మాట యాపిల్ కంపెనీని పంపబడుతుంది. ఆ పదాలను విశ్లేషించి స్టోర్ చేస్తారు.

యూఎస్ ఖజానాతో పోలిస్తే

యూఎస్ ఖజానాతో పోలిస్తే యాపిల్ ఎక్కవ ఆపరేటింగ్ క్యాష్‌ను కలిగి ఉంది.

 

 

ఒక్క సెకను కాలంలో డౌన్‌లోడ్

ప్రపంచవ్యాప్తంగా ఒక్క సెకను కాలంలో డౌన్‌లోడ్ కాబడుతున్న యాపిల్ అప్లికేషన్ల సంఖ్య 800.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple hit by rare malware attack in China
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot