బికేర్ పుల్..ఐ ఫోన్లు పేలిపోతున్నాయ్

Written By:

మీరు విన్నది నిజమే.. ఇప్పుడు ఐ ఫోన్లు కూడా పేలిపోతున్నాయ్.. ఆ పేలుడు దెబ్బకి ఐ ఫోన్ వినియోగదారుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. వివరాల్లోకెళితే ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ గారెత్ క్లియర్ బైకుపై వెళుతుండగా వెనుక జేబులో పెట్టుకున్న ఐఫోన్ 6 నుంచి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. దీంతో కంగారుపడిన అతడు బైకు పైనుంచి కింద పడిపోయాడు. అలా అతను పడిన మరుక్షణమే..అతని జేబులో ఉన్న ఫోన్ 6 పేలిపోయింది. ఫోన్ నుంచి పొగ, వేడి వస్తున్నట్టుగా గుర్తించిన కొద్దిసేపటికే అది పేలిపోయిందని 'ది డైలీ టెలిగ్రాఫ్' తెలిపింది.

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

బికేర్ పుల్..ఐ ఫోన్లు పేలిపోతున్నాయ్

ఆ పేలుడు దెబ్బకి కుడికాలి తొడ భాగంలో కాలిన గాయాలు కావడంతో అతడిని సిడ్నీలోని రాయల్ నార్త్ షోర్ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి స్కిన్ గ్రాఫ్ట్ సర్జరీ చేయనున్నారు. బ్యాటరీలోని లిథియం కారణంగానే మంటలు వ్యాపించివుండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక మనోడు బీకేర్ పుల్ అంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను ట్వీటర్ లో పోస్ట్ చేశాడు. అయితే ఐఫోన్ పేలిన ఘటనపై ఆపిల్ సంస్థ స్పందించింది. దీనిపై విచారణ జరుపుతామని ప్రకటించింది. ఐఫోన్ 6 పేలినట్టు గతేడాది, జూన్ లో కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. ఫోన్ ప్రమాదాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.

జేబులోపెట్టిన ఫోన్ నుంచి మంటలు: తేరుకునే లోపు కాలిపోయాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ ప్రమాదాలు

ఎసెక్స్‌కు చెందిన డయోనీ బాక్స్టర్ (25) అనే వివాహిత చార్జింగ్ పెట్టి ఉన్న ఐఫోన్ 4ను తన ఛాతీ పై పెట్టుకుని నిద్రలోకి జారుకుంది. తీవ్రమైన నొప్పితో మరసటి రోజు ఉదయం నిద్రలేచిన బాక్స్టర్ తన ఎడమ రొమ్ము పై 5 అంగుళాల కాలిన గాయాన్ని చూసి నిర్ఘాంతపోయింది.

ఫోన్ ప్రమాదాలు

హుటాహుటిన ఆసుపత్రికి చేరుకోవటంతో వైద్యులు ఆమెకు చికిత్సనందించారు. చార్జింగ్ పెట్టి ఉన్న తన ఐఫోన్ 4 అతిగా వేడెక్కటం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని డయోనీ బాక్స్టర్ సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

ఫోన్ ప్రమాదాలు

పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి అప్పుడే బస్ దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతని జేబులోని మొబైల్ ఫోన్ బ్యాటరీ నుండి అకస్మాత్తుగా మంటలు వెలువడి చూస్తుండగానే అతన్ని మొత్తం కమ్మేశాయి.

ఫోన్ ప్రమాదాలు

అమెరికా అబ్బాయి ఎరిక్ తన జేబులోని ఫోన్ దెబ్బకు థర్డ్ డిగ్రీ గాయాలతో బయట పడి న్యూయార్కర్ 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.

ఫోన్ ప్రమాదాలు

రోజులో గంటపాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడే పురుషులు తండ్రులుగా మారాలంటే ఇబ్బందులు తప్పవని పరిశోధకులు చెప్తున్నారు. సెల్‌ఫోన్‌ నుంచి వెలువడే వేడి, విద్యుదయస్కాంత క్షేత్రాలు వీర్యకణాల్ని ఉడికిపోయేలా చేస్తాయని హైఫా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మార్తా డర్న్‌ఫెల్డ్‌ వివరించారు.

ఫోన్ ప్రమాదాలు

మీరు స్మార్ట్ పోన్ ను పక్కలో పెట్టుకోవడం వల్ల అందులోనుంచి వచ్చే వెలుతురు మీకంటిని కాటేసే ప్రమాదం ఉంది.మీకు తెలియకుండానే అది కంటిని కాటేస్తుంది.

ఫోన్ ప్రమాదాలు

స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోతే అది నీ నిద్ర చెడగొడుతుంది. మాములుగా 8 గంటలు మనిషి నిద్రపోవాలి. అయితే ఫోన్ పక్కనే ఉంటే నిద్ర అనేది కరవవుతుంది. దీనివల్ల అనేక సమస్యలు వచ్చేఅవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
Here Write Apple iPhone 6 explodes, leaves man with third-degree burns: Report
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot